Viral: ఇంట్లోకి దొంగతనానికొచ్చాడు.. ఇంతలో ఆకలేసింది.. చివరికి అతడు ఏం చేశాడో తెలిస్తే నవ్వాపుకోలేరు!

|

Jan 12, 2022 | 8:30 PM

వీడొక మంచి దొంగ. ఆకలి వేస్తే మొత్తం ప్రపంచాన్ని మర్చిపోతాడు. అసలు ఎందుకు వచ్చానో గుర్తుపెట్టుకోడు...

Viral: ఇంట్లోకి దొంగతనానికొచ్చాడు.. ఇంతలో ఆకలేసింది.. చివరికి అతడు ఏం చేశాడో తెలిస్తే నవ్వాపుకోలేరు!
Thief
Follow us on

వీడొక మంచి దొంగ. ఆకలి వేస్తే మొత్తం ప్రపంచాన్ని మర్చిపోతాడు. అసలు ఎందుకు వచ్చానో గుర్తుపెట్టుకోడు. అసలు ఇదంతా ఎందుకు చెబుతున్నానంటే.! మీరు ఈ స్టోరీ చదవండి.. మీకే అర్ధమవుతుంది. దొంగతనానికి వ‌చ్చిన ఓ దొంగ పోలీసుల‌కు అడ్డంగా దొరికిపోయాడు. దోచుకున్న తర్వాత ఆ వ్య‌క్తి.. పారిపోలేదు. ఆక‌లిగా ఉండ‌టంతో ఆ ఇంట్లోనే కిచిడి వండ‌టం మొద‌లుపెట్టాడు. అంత‌లోనే ఆ దొంగ పోలీసుల‌కు అడ్డంగా దొరికి అరెస్టయ్యాడు.

అసోంలోని ఓ ప్రాంతంలో తాళం వేసిన ఇంట్లోకి తాజాగా ఓ దొంగ ఎంట్రీ ఇచ్చాడు. ఇంట్లో ఉన్న విలువైన వ‌స్తువుల్ని మూట‌క‌ట్టాడు. ఇక ఇంటి నుంచి వెళ్లే ముందు ఆక‌లిగా అనిపించింది. ఇంకేముంది.. కిచెన్‌లో కిచిడి వండ‌టం మొద‌లుపెట్టాడు. వంట పాత్ర‌ల శ‌బ్దం రావ‌డంతో ఇరుగుపొరుగు వారికి మెల‌కువ వ‌చ్చింది. దీంతో వారు అప్ర‌మ‌త్త‌మై పోలీసుల‌కు స‌మాచారం అందించారు. ఘ‌ట‌నాస్థ‌లికి చేరుకున్న పోలీసులు దొంగ‌ను అదుపులోకి తీసుకున్నారు.

ఈ దొంగ‌త‌నం ఘ‌ట‌న‌పై అసోం పోలీసులు చాలా చమ‌త్కారంగా ట్వీట్ చేశారు. కిచిడీతో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. కానీ దొంగతనం చేసే సమయంలో కిచిడీ వండటం ఆరోగ్యానికి హానికరం. దొంగను అరెస్ట్ చేశాం. పోలీసులు అతనికి వేడి వేడి భోజనం అందిస్తున్నారు అంటూ ట్వీట్‌లో పేర్కొన్నారు. పోలీసులు చేసిన ట్వీట్ ప్రస్తుతం నెట్టింట్లో హల్‌చల్‌ చేస్తోంది.

Also Read:

ఈ ఫోటోలో పాము దాగుంది.. ఈజీగా కనిపెట్టచ్చండోయ్‌.. కష్టం కాదు.!

మద్యం షాప్ దగ్గర ఆగి ఉన్న ఇన్నోవా కారు.. అనుమానంతో డోర్ ఓపెన్ చేసి చూడగా ఫ్యూజులు ఔట్!