Viral video: ప్రియురాలి తల్లికి కిడ్నీని దానం చేసిన ప్రియుడు.. వేరొకరిని పెళ్లి చేసుకున్న అమ్మాయి.. ఇప్పుడతని పరిస్థితి ఏంటంటే..

| Edited By: Phani CH

Jan 19, 2022 | 9:16 AM

ప్రేమ గుడ్డిదంటారు. అందుకే ప్రేమ కోసం, ప్రేమించిన వారికోసం ఎలాంటి త్యాగాలకైనా సిద్ధపడుతుంటారు చాలామంది. అయితే ఎంత చేసినా మన మనసుకు నచ్చినవారు మనకు దక్కకకపోతే 

Viral video: ప్రియురాలి తల్లికి కిడ్నీని దానం చేసిన ప్రియుడు.. వేరొకరిని పెళ్లి చేసుకున్న అమ్మాయి.. ఇప్పుడతని పరిస్థితి ఏంటంటే..
Follow us on

ప్రేమ గుడ్డిదంటారు. అందుకే ప్రేమ కోసం, ప్రేమించిన వారికోసం ఎలాంటి త్యాగాలకైనా సిద్ధపడుతుంటారు చాలామంది. అయితే ఎంత చేసినా మన మనసుకు నచ్చినవారు మనకు దక్కకకపోతే  ఆ భాద అనుభవిస్తే కానీ అర్థం కాదు. ప్రస్తుతం మెక్సికోకు చెందిన టీచర్ ఉజీల్ మార్జినెజ్ కూడా ఇలాంటి పరిస్థితే ఎదుర్కొంటున్నాడు.   ప్రేమించిన అమ్మాయి కోసం ఎవరూ చేయని పని చేసిన ఇతగాడికి.. ఆ అమ్మాయి ఊహించని ట్విస్ట్ ఇచ్చింది. తన తల్లికి కిడ్నీ ఆపరేషన్ జరిగిన తర్వాత సదరు మహిళ ఆ యువకుడికి హ్యాండ్ ఇచ్చింది. మొదట అతనికి దూరం దూరంగా ఉంటూ వస్తోన్న ఆమె   కొద్ది రోజుల తర్వాత మరొకరితో కలిసి పెళ్లిపీటలెక్కింది.

ఆ అమ్మాయే బాధపడాలి..!

కాగా ప్రేమలో విఫలమైన ఉజీల్ తన ఆవేదనను ఓ టిక్ టాక్ వీడియో ద్వారా పంచుకున్నాడు.  ఈ వీడియోలో అతను సోఫాలో పడుకుని  ఎంతో విచారంగా కనిపించడం మనం చూడవచ్చు.  తాను మనసుపడ్డ అమ్మాయి వేరొకరిని మనువాడడంతో తనకు ఏం చేయాలో కూడా తోచడంలేదని ఇందులో వాపోయాడు ఉజీల్. ఈ క్రమంలో ఈ వీడియోను చూసిన చాలామంది భగ్న ప్రేమికుడికి మనోధైర్యం చెబుతున్నారు.   బాధపడోద్దంటూ సానుభూతి ప్రకటిస్తున్నారు. ‘ మార్జినెజ్ లాంటి   మంచి వ్యక్తిని దూరం చేసుకున్నందుకు ఆమహిళ దురదృష్టవంతురాలు.. ఇందుకు బాధపడాల్సింది ఆ అమ్మాయే’ అంటూ నెటిజన్లు స్పందిస్తున్నారు.

నిజమైన ప్రేమకు నిర్వచనం..

కాగా ఈ వీడియో తరువాత ఉజీల్ మరో వీడియోను కూడా  విడుదల చేశాడు. అందులో తనకు, తన మాజీ ప్రియురాలికి మధ్య సత్సంబంధాలున్నాయని చెప్పుకొచ్చాడు. తాను మానసికంగా బాగానే ఉన్నానంటూ తనకు తాను ధైర్యం చెప్పుకునే ప్రయత్నం చేశాడు. అదేవిధంగా తన ప్రేమ విషయంలో తన ప్రియురాలిది ఎలాంటి తప్పులేదని తన ప్రేయసికి అండగా నిలవడం గమనార్హం. ఆమెను ఎప్పుడూ ద్వేషించనంటూ నిజమైన ప్రేమకు నిర్వచనంలా కనిపించాడు ఉజీల్.

Also Read:Covid Vaccine: గ‌ర్భిణీలు ఏ వ్యాక్సిన్, ఏ స‌మ‌యంలో తీసుకుంటే మంచిది.. వైద్యులు ఏం చెబుతున్నారంటే..

Mumbai: ఐఎన్ఎస్ రణ్ వీర్ లో పేలుడు.. ముగ్గురు నేవి సిబ్బంది మృతి.. భారీగా ఎగసిపడుతోన్న మంటలు..

SteviaLeaves : షుగర్ వ్యాధిగ్రస్తులకు దివ్య ఔషధం.. పంచదార బదులు ఈ ఆకులు..!(వీడియో)