Viral Video: అరేయ్ ఏంట్రా ఇది.. మనిషేనా మరేమైనా శక్తులున్నాయా?.. వైరల్ అవుతున్న షాకింగ్ వీడియో!

| Edited By: Janardhan Veluru

Mar 05, 2022 | 10:22 AM

Viral Video: కొందరు వ్యక్తులు పేరు తెచ్చుకోవడం కోసం, ప్రజల దృష్టిని ఆకర్షించడం కోసం ఏదైనా చేయడానికి సిద్ధంగా ఉంటారు.

Viral Video: అరేయ్ ఏంట్రా ఇది.. మనిషేనా మరేమైనా శక్తులున్నాయా?.. వైరల్ అవుతున్న షాకింగ్ వీడియో!
Viral Stunts
Follow us on

Viral Video: కొందరు వ్యక్తులు పేరు తెచ్చుకోవడం కోసం, ప్రజల దృష్టిని ఆకర్షించడం కోసం ఏదైనా చేయడానికి సిద్ధంగా ఉంటారు. ముఖ్యంగా యువకులు బైక్‌పై రకరకాల విన్యాసాలు చేస్తుంటారు. బైక్ స్టంట్స్‌కు సంబంధించిన వీడియోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తుంటారు. తాజాగా ఓ వ్యక్తి బైక్ స్టంట్స్‌కి సంబంధించి షాకింగ్ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఆ వీడియోను చూసి నెటిజన్లు అవాక్కవుతున్నారు. అరే ఎంట్రా ఇది.. బైక్ అలా ఎలా వెళుతుంది, అతనెలా ఈ స్టంట్స్ చేయగలుగుతున్నాడని నోరెళ్లబెడుతున్నారు. అవను ఇంత భయంకరమైన బైక్ స్టంట్‌ను మీరు ఇంతకు ముందెన్నడూ చూసి ఉండరు.

ఈ వైరల్ వీడియోలో హైవేపై బైక్ స్టంట్ చేస్తూ ఓ యువకుడు కనిపించాడు. ఆ బైక్‌కు సమాంతరంగా పెద్ద పెద్ద వాహనాలే వెళుతున్నాయి. అయినప్పటికీ ఏమాత్రం బెదరకుండా.. బైక్‌పై వెళుతూ రకరకాల విన్యాసాలు చేయడం ప్రారంభించాడు. బైక్‌పై పడుకోవడం, రెండు చేతులను, కాళ్లను పైకి లేపడం, బైక్ సీట్‌నిల్చోవడం, వన్ సైడ్ కూర్చోవడం సహా రకరకాల స్టంట్స్ చేస్తున్నాడు. బైక్ కూడా చాలా వేగంగా వెళుతోంది. కాగా, బస్సు వెనుకాల బస్సు వెళ్తుండగా.. బస్సులో వ్యక్తి.. ఆ యువకుడి బైక్ స్టంట్స్‌ని వీడియో తీశాడు. అనంతరం వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా అదికాస్తా వైరల్‌గా మారింది.

బైక్ స్టంట్ వీడియో..

వీడియోను చూసి నెటిజన్లు షాక్ అవుతున్నారు. ఇలాంటి స్టంట్స్ లైఫ్‌లో చూడలేదంటున్నారు. అత్యంత భయానకంగా ఉన్న ఈ స్టంట్స్‌పై నెటిజన్లు రకరకాల కామెంట్స్ చేస్తున్నారు. కాగా, ఈ వీడియోను మొదట సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా.. ఆ తరువాత దానిని తొలగించారు.

Also read:

Drugs: డ్రగ్స్‌పై ఉక్కుపాదం మోపుతున్న తెలంగాణ పోలీసులు.. వినూత్న కార్యక్రమానికి శ్రీకారం

Russia Ukraine Crisis Live: తగ్గేదెలే అంటున్న రష్యా.. ఉక్రెయిన్‌పై దాడులు ముమ్మరం..

Medaram Hundi: మేడారం హుండీ లెక్కింపు పూర్తి.. ఈసారి తగ్గిన ఆదాయం.. ఇంకా తేలాల్సిన బంగారం, వెండి కానుకల లెక్కలు