Viral Video: ‘సూపర్ పోలీస్’.. దూసుకొస్తున్న రైలుకు ఎదురెళ్లి యువకుడి ప్రాణాలు కాపాడాడు!

|

Mar 24, 2022 | 6:15 PM

Viral Video: ఈ మధ్యకాలంలో మనుషులు మరీ సున్నిత మనస్కులు అవుతున్నారు. చిన్న చిన్న అంశాలకే ప్రాణాలు తీసుకుంటున్నారు. వందేళ్లపాటు జీవించాల్సిందిపోయి.. యుక్తవయసులోనే తనువు చాలిస్తున్నారు.

Viral Video: ‘సూపర్ పోలీస్’.. దూసుకొస్తున్న రైలుకు ఎదురెళ్లి యువకుడి ప్రాణాలు కాపాడాడు!
Supercop
Follow us on

Viral Video: ఈ మధ్యకాలంలో మనుషులు మరీ సున్నిత మనస్కులు అవుతున్నారు. చిన్న చిన్న అంశాలకే ప్రాణాలు తీసుకుంటున్నారు. వందేళ్లపాటు జీవించాల్సిందిపోయి.. యుక్తవయసులోనే తనువు చాలిస్తున్నారు. కారణాలేమైనా.. ముఖ్యంగా యువత ఎక్కువగా ఆత్మహత్యకు పాల్పడున్నట్లు అనేక అధ్యయనాల్లో తేలింది. ఏమైందో ఏమో గానీ.. తాజాగా ఓ యువకుడు రైలు కింద పడి ఆత్మహత్య చేసుకోవాలనుకున్నాడు. అయితే, అతని అదృష్టమో.. భగవంతుడి దృష్టి పడిందో గానీ.. ఓ పోలీస్ అధికారి సూపర్ మ్యా్న్‌లా వచ్చి రెప్పపాటు వ్యవధిలో ఆ యువకుడి ప్రాణాలను కాపాడారు. ఈ ఘటన మహారాష్ట్రలోని విఠల్ వాడి రైల్వే స్టేషన్‌లో చోటు చేసుకుంది. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

పెద్దలు ఎప్పుడూ ఒక మాట అంటుంటారు.. భగవంతుడు ఒకరిని రక్షించాలనుకున్నప్పుడు ఒకరి రూపాన్ని ఎంచుకుంటారట. మహారాష్ట్రలోని విఠల్‌వాడి రైల్వే స్టేషన్‌లో ఇలాంటి సన్నివేశమే చోటు చేసుకుంది. అక్కడ ఒక పోలీసు మెరుపు వేగంతో ఒక యువకుడి ప్రాణాలు రక్షించాడు. మహారాష్ట్రలోని విఠల్ వాడి రైల్వే స్టేషన్‌లో నిల్చున్న ఓ యువకుడు.. రైల్ ట్రాక్‌కు సమీపంగా ఉండి అటూ ఇటూ తిరుగుతున్నాడు. ఇంతలో ఎక్స్‌ప్రెస్ రైలు స్టేషన్‌లో ఎంటరైంది. రైలు రాకను గమనించిన యువకుడు.. ఒక్కసారిగా ప్లాట్‌ఫామ్ నుంచి రైలు పట్టాలపై దూకాడు. యువకుడి చర్యను చూసి చుట్టూ ఉన్నవారు హతాశులయ్యారు. కానీ, ఒక పోలీస్ కానిస్టేబుల్ ఏమాత్రం ఆలోచించకుండా.. రైలు దూసుకొస్తున్నా లెక్కచేయకుండా సూపర్‌మ్యాన్ మాదిరిగా పట్టాలపై దూకి ఆ యువకుడిని రక్షించాడు. ఈ దృశ్యమంతా రైల్వే స్టేషన్‌లోని సీసీ కెమెరాలో రికార్డ్ అవగా.. రైల్వే శాఖ ఆ వీడియోను షేర్ చేసింది. యువకుడి ప్రాణాలను కాపాడిన పోలీస్ అధికారిని అభినందించింది. కాగా, ఆత్మహత్యకు యత్నించిన యువకుడిని అదుపులోకి తీసుకున్న ఆర్పీఎఫ్ పోలీసులు.. కేసు నమోదు చేసుకుని విచారిస్తున్నారు.

ఇదిలాఉంటే.. ఈ షాకింగ్ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఈ వీడియోను చూసి యువకుడి చర్యను ఖండిస్తూనే.. మరోవైపు పోలీస్ అధికారిపై ప్రశంసలు కురిపిస్తున్నారు. రియల్ హీరో అని, సూపర్ కాప్ అంటూ కితాబిస్తున్నారు. పోలీసు ధైర్యానికి సెల్యూట్ చేస్తున్నారు.

Viral Video:

Also read:

Summer Tips: ఈ 6 ఆహారాలు వేసవిలో డీహైడ్రేషన్‌ను నివారించడంలో సహాయపడతాయి

IPL 2022: త్వరలో మరో షాక్ ఇవ్వనున్న ధోనీ? కీలక ప్రకటన చేసిన చెన్నై సూపర్ కింగ్స్ సీఈఓ..

Amazon: కరోనా టైంలో కోడింగ్ నేర్చుకున్న కూలీ కూతురు.. నేడు కష్టానికి తగిన ఫలం.. రూ.44 లక్షల వేతనంతో జాబ్