ఇదేదో కాస్ట్లీహోటల్ అనుకునేరు..రూ. 1,100లకే వాషింగ్ మెషీన్, ప్రొజెక్టర్ స్క్రీన్‌తో లగ్జరీ రూమ్!

ప్రతిరోజూ సోషల్ మీడియాలో కొత్త కంటెంట్ వైరల్ అవుతుంది. కొన్ని వినోదాన్ని అందిస్తే, మరికొన్ని వినియోగదారులను ఆశ్చర్యపరుస్తాయి. ఇటీవల, ఒక టూరిస్ట్‌ షేర్‌ చేసిన ఒక డ్యూప్లెక్స్ తరహా హోటల్ గది ఇంటర్‌నెట్‌ ప్రేక్షకుల్ని విపరీతంగా ఆకర్షించింది. అందరూ ఆశ్చర్యపోయేలా, ఆ చిన్న గదిలోనే ప్రజలకు కావాల్సిన అన్ని సౌకర్యాలు, పూర్తి లగ్జరీ సదుపాయాలు ఉన్నాయి. ఇక్కడే మరో షాకింగ్‌ విషయం ఏంటంటే.. దాని ధర కేవలం 1,100 రూపాయలు మాత్రమే. ఆ హోటల్‌లో లభించే ప్రీమియం సౌకర్యాలను చూసి సోషల్ మీడియా వినియోగదారులు ఆశ్చర్యపోతూ కామెంట్లు పెడుతున్నారు. అది ఎక్కడ? ఏంటి అనే పూర్తి వివరాల్లోకి వెళితే..

ఇదేదో కాస్ట్లీహోటల్ అనుకునేరు..రూ. 1,100లకే వాషింగ్ మెషీన్, ప్రొజెక్టర్ స్క్రీన్‌తో లగ్జరీ రూమ్!
Cheap Luxury Hotel

Updated on: May 25, 2026 | 3:59 PM

సాధారణంగా మనం ఎక్కడికైనా టూర్‌కు వెళ్లినప్పుడు తక్కువ బడ్జెట్‌లో మంచి హోటల్ గది దొరకడం చాలా కష్టం. ఒకవేళ తక్కువ ధరకు రూమ్ దొరికినా, అందులో కనీస సౌకర్యాలు కూడా ఉండవు. కానీ, చైనాలోని ఒక ప్రముఖ నగరంలో మాత్రం కేవలం రూ. 1,100లకే సకల సౌకర్యాలతో కూడిన లగ్జరీ హోటల్ గది లభిస్తోంది. దీనికి సంబంధించిన ఒక ఆసక్తికరమైన వీడియో ప్రస్తుతం ఇంటర్నెట్‌లో సంచలనం సృష్టిస్తోంది.

భారత్‌కు చెందిన అనంత్ అనే ఒక ట్రావెల్ వ్లాగర్ తన @onroadindian అనే ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో చైనాలోని చెంగ్డూ (Chengdu) నగరంలో తాను బస చేసిన హోటల్ గది టూర్‌ను షేర్ చేశారు. చౌక ధరలో లభించే ఈ గది డ్యూప్లెక్స్ (లోఫ్ట్) మోడల్ లో డిజైన్ చేయబడింది. ఈ చిన్న స్థలంలోనే ఒక ప్రైవేట్ వాషింగ్ మెషీన్, ఫ్రిజ్, ఇండక్షన్ స్టవ్, ఎలక్ట్రిక్ కెటిల్, ఒక సోఫా, పెద్ద స్మార్ట్ టీవీ వంటి ప్రీమియం హోటళ్లలో ఉండే సదుపాయాలన్నీ కల్పించారు.

ఇవి కూడా చదవండి

ఈ గది ప్రత్యేకత ఏమిటంటే, పై అంతస్తుకు వెళ్లడానికి చిన్న మెట్లు ఉన్నాయి. ఆ పైభాగంలో అందమైన ఝుమ్మర్ (Chandelier) తో కూడిన ఒక విలాసవంతమైన బెడ్‌రూమ్ ఉంది. మరింత వినోదం కోసం బెడ్ పక్కనే గోడపై ఇన్-బిల్ట్ ప్రొజెక్టర్ సిస్టమ్‌ను కూడా ఏర్పాటు చేశారు. అంటే పర్యాటకులు పడుకునే థియేటర్ అనుభూతిని పొందవచ్చు. ఈ హోటల్ నగరం నడిబొడ్డున ఉన్నప్పటికీ ఇంత తక్కువ ధరకే లభించడం విశేషం.

వీడియో ఇక్కడ చూడండి..

ఈ వీడియో సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లలో విపరీతంగా దూసుకుపోతోంది. ఇప్పటివరకు ఈ వీడియోకు 6.5 మిలియన్లకు పైగా వ్యూస్, 2 లక్షలకు పైగా లైక్స్ వచ్చాయి. చైనాలో పర్యాటక రంగం ఇప్పటికీ ఎంత సరసమైన ధరల్లో ఉందో ఈ వీడియో నిరూపిస్తోందని వ్లాగర్ పేర్కొన్నారు. నెటిజన్లు కూడా భారత్‌లో ఇంత తక్కువ ధరకు ఇలాంటి గది దొరకడం అసాధ్యం అంటూ ఆశ్చర్యపోతూ కామెంట్లు పెడుతున్నారు.

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..

Follow Us