సోషల్ మీడియాలో పెళ్లికి సంబంధించిన చాలా వీడియోలు కనిపిస్తున్నాయి. ఏ అబ్బాయికైనా, అమ్మాయికైనా పెళ్లి రోజు చాలా ప్రత్యేకమైనది. ఈ రోజును స్పెషల్గా మార్చుకోడానికి చాలా రకాలుగా ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. ఇటీవల కాలంలో పెళ్లికి సంబంధించిన రకరకాలు పెళ్లి వీడియోలు నెట్టింట వైరల్గా మారతోన్న విషయం తెలిసిందే. పెళ్లికి సంబంధించిన వీడియో ఒకటి ప్రజంట్ బాగా ట్రెండ్ అవుతోంది. ఈ వీడియోను నెటిజన్లు విపరీతంగా లైక్ చేస్తున్నారు. అందుకు పెద్ద రీజనే ఉందండోయ్. వైరల్ అవుతున్న వీడియోలో, వధూవరులు ఊరేగింపుతో కాలినడకన సాగుతోంది. ప్రస్తుతం ఎంతటి పేద కుటుంబం అయినా పెళ్లి ఊరేగింపు అంటే కనీసం అద్దెకు కారు అయినా తెచ్చుకుంటారు. లేదా తక్కువలో తక్కువ ఆటో అయినా పెడతారు. కానీ ఇక్కడ మాత్రం వధూవరులు నడుచుకుంటూ వెళ్తున్నారు. అంతే కాదండోయ్.. రెండు స్పీకర్స్ కనెక్ట్ చేసి.. వాటిని ఓ ఇద్దరు భుజాలపై మోసుకుంటూ కనిపించారు. అందులో వస్తోన్న పాటలను అనుకరిస్తూ కొందరు వధూవరుల ముందు డ్యాన్స్ చేస్తూ వెళ్తున్నారు.
వీడియో చూడండి…
Gareeb ki shaadi…..?☺️
But
NO COMPROMISE ☺️☺️☺️??@hvgoenka @RKharmujai @anirban1970 pic.twitter.com/dVkv5SbrYk
— Rupin Sharma IPS (@rupin1992) November 9, 2021
ఈ క్రేజీ వీడియోను సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ట్విట్టర్ ఖాతాలో ఇండియన్ పోలీస్ సర్వీస్ అధికారి రూపిన్ శర్మ షేర్ చేశారు. ఈ వీడియోకి ఇప్పటి వరకు వేల సంఖ్యలో లైక్లు, కామెంట్లు వచ్చాయి. మీకు కూడా ఈ వీడియో బాగా నచ్చే ఉంటుంది. లేని దాని కోసం తాపత్రయపడకుండా.. ఉన్నంతలో ఆనందంగా జీవించడం కంటే బెస్ట్ థింగ్ ఏముంటుంది చెప్పండి.
Also Read: Viral Video: ‘ఫోన్ నాదంటే.. నాది’.. చిన్నారి వర్సెస్ వానరం.. క్యూట్ వీడియో భలే ఉంది
స్నేక్ రెస్క్యూ ఆపరేషన్… మింగిన కప్పను కక్కిన డేంజరస్ కోబ్రా