Viral Video: లయన్ కింగ్.. పిల్లలకు వేట నేర్పిస్తున్న తండ్రి సింహం.. వీడియో చూస్తే వావ్ అనాల్సిందే

|

Nov 03, 2022 | 7:55 PM

ఎంత క్రూర మృగమైన తమ పిల్లలను చాలా జాగ్రత్తగా చూసుకుంటూ ఉంటాయి. ఇక సింహాల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు అడవికి రాజైన సింహం తన కుటుంబాన్ని ఎంతో జాగ్రత్తగా చూసుకుంటుంది.

Viral Video: లయన్ కింగ్.. పిల్లలకు వేట నేర్పిస్తున్న తండ్రి సింహం.. వీడియో చూస్తే వావ్ అనాల్సిందే
Lion
Follow us on

తల్లిదండ్రులు పిల్లలను ఎంతో జాగ్రత్తగా చూసుకుంటూ ఉంటారు.. కేవలం మనుషుల్లోని కాదు జంతువుల్లోనూ ఇది ఉంటుంది. తమ పిల్లలను కాపాడుకోవడం కోసం కొన్నిసార్లు ప్రాణాలకు తెగించి పోరాడుతూ ఉంటాయి. ఎంత క్రూర మృగమైన తమ పిల్లలను చాలా జాగ్రత్తగా చూసుకుంటూ ఉంటాయి. ఇక సింహాల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు అడవికి రాజైన సింహం తన కుటుంబాన్ని ఎంతో జాగ్రత్తగా చూసుకుంటుంది. వేట లో సింహానికి తిరుగేలేదు.. అదే దాని పిలల్లకు కూడా నేర్పిస్తూ ఉంటాయి. తాజాగా ఓ సింహానికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.

సహజంగా మగ సింహాలు వేటాడవు..కానీ  ఆడసింహాలు ఎక్కువగా వేటాడుతూ ఉంటాయి. తాజాగా వైరల్ అవుతోన్న వీడియోలో ఓ తండ్రి సింహం తన పిల్లలతో షికారుకు వెళ్లడం మనం చూడొచ్చు. ఈ  వీడియో ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతోంది. ఈ వీడియోలో ఒక మగసింహ అడవిలో నడుస్తూ ఉంటే దాన్ని అనుసరిస్తూ దాని పిల్లలు వెళ్తూ కనిపిస్తున్నాయి. ఇప్పటికే ఈ వీడియోను 2.3 మిలియన్లకు పైగా ప్రజలు చూశారు. ఈ వీడియోను 44,000 మందికి పైగా లైక్ చేసారు. ఈ వీడియోలో సింహం తన పిల్లలకు పరిగెత్తడం నేర్పిస్తూ కనిపించింది. ఇక ఈ వీడియో పై నెటిజన్లు రకరకాల కామెంట్లు పెడుతున్నారు. వేట నేర్పిస్తున్న నాన్న.. నాన్న బాటలో పిల్ల సింహాలు అంటూ కామెంట్లు పెడుతున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం క్లిక్ చేయండి..