Viral Video: ఊహకైనా అందని రేంజ్‌లో చిరుత వేట.. వీడియో చూస్తే వణుకు పుట్టాల్సిందే..!

|

Aug 05, 2022 | 3:45 PM

Viral Video: అటవి జీవితమే ఒక విచిత్రం. అక్కడ జీవులన్నీ ఒకదాని ఆకలి తీర్చడానికి మరోటి జన్మించినట్లుగాను ఉంటుంది. బలం, శక్తి కలిగిన జీవులదే రాజ్యం.

Viral Video: ఊహకైనా అందని రేంజ్‌లో చిరుత వేట.. వీడియో చూస్తే వణుకు పుట్టాల్సిందే..!
Leopard
Follow us on

Viral Video: అటవి జీవితమే ఒక విచిత్రం. అక్కడ జీవులన్నీ ఒకదాని ఆకలి తీర్చడానికి మరోటి జన్మించినట్లుగాను ఉంటుంది. బలం, శక్తి కలిగిన జీవులదే రాజ్యం. అంతటి శక్తివంతమైన, క్రూరమైన జంతువుల్లో మృగరాజు సింహం, పెద్దపులి, చిరుత పులి ప్రధానమైనవి. వీటి వేట అత్యంత భయంకరంగా ఉంటుంది. మాంచి ఆకలిమీదున్న సమయంలో వీటి కంట ఇతర జీవి పడిందో అంతే సంగది. ఈ క్రూర మృగాల్లో చిరుత వేట ఊహించని స్థాయిలో ఉంటుంది. భూమిపైనా, నీటిలోనూ, చెట్ల పై నుంచి కూడా వేటాడే సామర్థ్యం దీని సొంతం. అందుకే.. చిరుత వేట అత్యంత భయానకంగా ఉంటుంది. చిరుత వేగం, వేటను అంచనా వేయడం అసాధ్యమనే చెప్పాలి. దీనికి నిదర్శనమైన వీడియో ఒకటి సోషల్ మీడియాలో ఇప్పుడు తెగ వైరల్ అవుతోంది. ఆ వీడియో చూసి నెటిజన్లు వణికిపోతున్నారు.

@Animl_World పేరుతో ఉన్న ట్విట్టర్‌ అకౌంట్‌లో చిరుత వేటకు సంబంధించిన వీడియోను షేర్ చేశారు. ఈ వీడియోలో పచ్చటి మైదాన ప్రాంతంలో ఓ జింక, దాని పిల్లి మేత మేస్తూ హాయిగా సంచరిస్తు్న్నాయి. మైదాన ప్రాంతంలో ఓ చెట్టు ఉండగా, దాని నీడన చేరి గడ్డి తింటున్నాయి. అయితే, అక్కడే వాటికి పెద్ద ప్రమాదం పొంచి ఉంది. దానిని ఆ జింకలు గ్రహించలేదు. చెట్టు నీడగా భావించి వస్తే.. ఆ చెట్టే వాటి పాలిట యమపాశం అయ్యింది. ఎందుకంటే.. ఆ చెట్టుపైన చిరుత నక్కి ఉంది. అదును కోసం చూసిన ఆ చిరుత.. సమయం రాగానే జింకపై ఒక్క ఉదుటున దూకేసింది. పిల్ల జింకను పట్టేసింది. దాంతో బెంబేలెత్తిపోయిన తల్లి జింక.. భయంతో అక్కడి నుంచి పరుగులు తీసింది. అయితే, చిరుత వేటకు సంబంధించిన ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట్లో తెగ వైరల్ అవుతోంది. చిరుత వేట ఈ రేంజ్‌లో ఉంటుందా? అని ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు నెటిజన్లు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..