Viral Video: పామును పామే వేటాడటం ఎప్పుడైన చూశారా..! వీడియో చూస్తే జడుసుకుంటారు..

|

Sep 11, 2021 | 8:17 PM

Viral Video: ఇటీవల సోషల్ మీడియాలో జంతువులు, పాములు, పక్షులకు సంబంధించిన వీడియోలు తెగ వైరల్ అవుతున్నాయి. కొన్ని సందర్భాల్లో ఆ వీడియోలను చూస్తే

Viral Video: పామును పామే వేటాడటం ఎప్పుడైన చూశారా..! వీడియో చూస్తే జడుసుకుంటారు..
King Cobra
Follow us on

Viral Video: ఇటీవల సోషల్ మీడియాలో జంతువులు, పాములు, పక్షులకు సంబంధించిన వీడియోలు తెగ వైరల్ అవుతున్నాయి. కొన్ని సందర్భాల్లో ఆ వీడియోలను చూస్తే భయంతో వణికిపోవాల్సిందే. మరికొన్ని వీడియోలు మాత్రం పొట్ట చెక్కలయ్యేంతగా నవ్విస్తాయి. కానీ ఓ వీడియో మాత్రం నెటిజన్లు ఒకింత షాక్‏కు గురిచేసింది. ఆశ్చర్యంతోపాటు.. భయం కూడా కలిగిస్తుందండోయ్. పాములు అంటే చాలా మందికి భయం. పాము కనిపిస్తే చాలు భయంతో పరుగులు పెడతారు. ఇక ఒంటరిగా వెళ్తుంటే పాము ఎదురైతే అంతే సంగతులు. అయితే తాజాగా ఒక పాము మరో పామును వేటాడే వీడియో సోషల్ మీడియాలో హల్‌చల్‌ చేస్తుంది.

వీడియోలో కింగ్ కోబ్రా మరొక బతికున్న పామును నోటితో కొరకడం మనం చూడవచ్చు. ఆ పాము మెల్లగా కదులుతూ తప్పించుకోవడానికి ప్రయత్నిస్తుండగా కింగ్‌ కోబ్రా ఒక్కసారిగా దానిని నేలకేసి కొడుతుంది. దీంతో పెద్ద శబ్దం వినిపిస్తుంది. ఈ వీడియో చూసిన నెటిజన్లు షాక్ అవుతున్నారు. పామును పాము వేటాడటం ఏంటని ఆశ్చర్యపోతున్నారు. వీడియో చూస్తే ఒక్క క్షణం మీరు కూడా జడుసుకుంటారు. ఇప్పుడు ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్‌ అవుతోంది. ఈ వీడియో చూసిన తర్వాత నెటిజన్లు రకరకాల కామెంట్లు చేస్తున్నారు. పామును చూసి చాలా భయపడిపోయానని ఒక నెటిజన్‌ కామెంట్ చేశాడు. మరొకరు ఇది హర్రర్ ఫిల్మ్ లాగా ఉందన్నారు.ఈ వీడియోను యూట్యూబ్‌లో డయాజ్ బోర్నియో అనే అకౌంట్‌తో షేర్ చేశారు. ఇప్పటివరకు ఈ వీడియోను 15 లక్షల మందికి పైగా చూశారు. చాలామంది లైకులు, షేర్స్ చేస్తున్నారు.

Medchal Car Accident: మేడ్చల్‌ జాతీయ రహదారిపై కారు బీభత్సం.. చిన్నారితో సహా ముగ్గురు మృత్యువాత

Manike Mage Hithe Song: ఆకాశవీధిలో మాణికే సాంగ్ హవా.. ఎయిర్‏హోస్టెస్ డ్యాన్స్‏కు ఎవ్వరైనా ఫిదా అవ్వాల్సిందే..

Sai Dharam Tej: సాయి ధరమ్ యాక్సిడెంట్‌పై నరేష్ వ్యాఖ్యలపై వివాదం.. ఎప్పుడు ఎలా మాట్లాడాలో నేర్చుకో అంటూ బండ్ల గణేష్ ఫైర్