కొచ్చిలో భారీ భవనాల నేలమట్టం.. అంతా క్షణాల్లో ..

| Edited By: Pardhasaradhi Peri

Jan 12, 2020 | 3:59 PM

కేరళలోని కొచ్చిలో నిబంధనలకు విరుద్ధంగా నిర్మించిన బహుళ అంతస్థుల భవనాలను నేలమట్టం చేస్తున్నారు. మరాడూ పోష్ లొకాలిటీలోని ఆకాశ హర్మ్యాలను శనివారం కూల్చివేయగా.. ఆదివారం 55 మీటర్ల ఎత్తయిన ‘జైన్ కోరల్ కేవ్’ ను, అలాగే దాదాపు అంతే ఎత్తయిన ‘గోల్డెన్ కయలోరేం’ భవనాన్ని కూల్చివేశారు. ఇవాళ కూడా సుమారు 800 కిలోల పేలుడు పదార్థాలను ఉపయోగించి వీటిని కూల్చివేసినట్టు అధికారులు తెలిపారు. అంతకుముందు వీటికి 200 మీటర్ల పరిధిలో అన్ని రకాల రాకపోకలను నిషేధించారు. సుప్రీంకోర్టు […]

కొచ్చిలో  భారీ భవనాల నేలమట్టం.. అంతా క్షణాల్లో ..
Follow us on

కేరళలోని కొచ్చిలో నిబంధనలకు విరుద్ధంగా నిర్మించిన బహుళ అంతస్థుల భవనాలను నేలమట్టం చేస్తున్నారు. మరాడూ పోష్ లొకాలిటీలోని ఆకాశ హర్మ్యాలను శనివారం కూల్చివేయగా.. ఆదివారం 55 మీటర్ల ఎత్తయిన ‘జైన్ కోరల్ కేవ్’ ను, అలాగే దాదాపు అంతే ఎత్తయిన ‘గోల్డెన్ కయలోరేం’ భవనాన్ని కూల్చివేశారు. ఇవాళ కూడా సుమారు 800 కిలోల పేలుడు పదార్థాలను ఉపయోగించి వీటిని కూల్చివేసినట్టు అధికారులు తెలిపారు. అంతకుముందు వీటికి 200 మీటర్ల పరిధిలో అన్ని రకాల రాకపోకలను నిషేధించారు. సుప్రీంకోర్టు ఆదేశాలతో..కేరళ ప్రభుత్వం ఈ అక్రమ నిర్మాణాల కూల్చివేతకు ఆదేశాలిచ్చింది.