Kerala: ప్రజలను దోచుకునేందుకు రాజ్యాంగం రాశారు.. కేరళ మంత్రి షాకింగ్ కామెంట్స్

| Edited By: Ravi Kiran

Jul 06, 2022 | 2:44 PM

కేరళ (Kerala) సాంస్కృతిక శాఖ మంత్రి సాజీ చెరియన్.. భారత రాజ్యాంగం పట్లు వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. దోపిడీని సమర్థిస్తున్నట్లు రాజ్యాంగాన్ని రచించారని అన్నారు. దేశ ప్రజలను దోచుకునేందుకు రాజ్యాంగాన్ని రాశారని షాకింగ్ కామెంట్స్...

Kerala: ప్రజలను దోచుకునేందుకు రాజ్యాంగం రాశారు.. కేరళ మంత్రి షాకింగ్ కామెంట్స్
Kerala Minister Saji Cheriy
Follow us on

కేరళ (Kerala) సాంస్కృతిక శాఖ మంత్రి సాజీ చెరియన్.. భారత రాజ్యాంగం పట్లు వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. దోపిడీని సమర్థిస్తున్నట్లు రాజ్యాంగాన్ని రచించారని అన్నారు. దేశ ప్రజలను దోచుకునేందుకు రాజ్యాంగాన్ని రాశారని షాకింగ్ కామెంట్స్ చేశారు. అంతే కాకుండా రాజ్యాంగాన్ని బ్రిటిషర్లు సిద్ధం చేశారని, దానిని భారతీయులు రాశారని పేర్కొన్నారు. ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట్లో వైరల్ గా (Viral) మారాయి. కేరళలోని పథనంతిట్ట జిల్లాలో నిర్వహించిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి సాజీ చెరియన్ ఈ వ్యాఖ్యలు చేశారు. కాగా మంత్రి స్టేట్ మెంట్స్ పై ప్రతిపక్షాలు తీవ్రంగా మండిపడుతున్నాయి. రాజ్యాంగబద్ధమైన పదవిలో ఉన్న వ్యక్తి.. ఇలాంటి వ్యాఖ్యలు చేయడం ఎంత వరకు సమంజసమని ప్రశ్నిస్తున్నారు. కార్పొరేట్ రంగంలో మిలియనీర్లు పెరగడానికి రాజ్యాంగమే కారణమని తీవ్రంగా విమర్శించారు.

అయితే.. రాజ్యాంగంపై మంత్రి చేసిన అనుచిత వ్యాఖ్యలను రాష్ట్రంలోని ప్రధాన ప్రతిపక్ష పార్టీలైన కాంగ్రెస్‌, బీజేపీలు తీవ్ర స్థాయిలో ఖండించాయి. మంత్రిని వెంటనే తొలగించాలంటూ సీఎం పినరయి విజయన్‌కు డిమాండ్‌ చేశారు. ఆయనపై చట్టపరంగా చర్యలు తీసుకోవాలని కోరారు. సాజీ చెరియన్.. రాజ్యాంగ నిర్మాతలను కించపరచడమే కాకుండా లౌకికవాదం, ప్రజాస్వామ్యం వంటి విలువలను అవమానించారని, అలాంటి వ్యక్తి వెంటనే పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. ఆయనకు ఒక్క సెకను కూడా పదవిలో కొనసాగేందుకు అర్హత లేదని మండిపడుతున్నాయి.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి