AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఐటీ హబ్‌లో ‘ఐరన్’ కష్టాలు.. ఇక్కడ బట్టల ఇస్త్రీ రేట్లు చూస్తే.. సాఫ్ట్‌వేర్ జీతాలు కూడా సరిపోయేలా లేవుగా!

భారతదేశంలో నగరాలు మారినప్పుడు అద్దెలు, ట్రాఫిక్ మారడం సహజం. కానీ, బట్టలు ఇస్త్రీ చేయించుకునే ఖర్చు కూడా ఇంతలా మారుతుందని బెంగళూరుకు వచ్చిన ఒక వెంచర్ క్యాపిటలిస్ట్ ఊహించలేదు. నోయిడాతో పోలిస్తే బెంగళూరులో ఇస్త్రీ ధరలు చుక్కలు చూపిస్తున్నాయంటూ సజిత్ పై అనే వ్యక్తి సోషల్ మీడియా ఎక్స్‌ వేదికగా పంచుకున్న పోస్ట్ ఇప్పుడు ఇంటర్నెట్‌లో తెగ వైరల్ అవుతోంది.

ఐటీ హబ్‌లో ‘ఐరన్’ కష్టాలు.. ఇక్కడ బట్టల ఇస్త్రీ రేట్లు చూస్తే.. సాఫ్ట్‌వేర్ జీతాలు కూడా సరిపోయేలా లేవుగా!
Laundry Shop
Balaraju Goud
|

Updated on: May 29, 2026 | 12:07 PM

Share

భారతదేశంలో నగరాలు మారినప్పుడు అద్దెలు, ట్రాఫిక్ మారడం సహజం. కానీ, బట్టలు ఇస్త్రీ చేయించుకునే ఖర్చు కూడా ఇంతలా మారుతుందని బెంగళూరుకు వచ్చిన ఒక వెంచర్ క్యాపిటలిస్ట్ ఊహించలేదు. నోయిడాతో పోలిస్తే బెంగళూరులో ఇస్త్రీ ధరలు చుక్కలు చూపిస్తున్నాయంటూ సజిత్ పై అనే వ్యక్తి సోషల్ మీడియా ఎక్స్‌ వేదికగా పంచుకున్న పోస్ట్ ఇప్పుడు ఇంటర్నెట్‌లో తెగ వైరల్ అవుతోంది.

ఇటీవలే నోయిడా నుండి బెంగళూరుకు మారిన సజిత్ పై, అక్కడ ఒక్కో డ్రెస్‌కు కేవలం రూ. 5 మాత్రమే చెల్లించేవారు. బెంగళూరులో ఒకటి రెండు రూపాయలు ఎక్కువ ఉండొచ్చని భావించిన ఆయనకు, ఇందిరానగర్‌లో ఒక్కో చొక్కా ఇస్త్రీకి రూ. 12 నుండి రూ. 20 వరకు వసూలు చేయడం తీవ్ర దిగ్భ్రాంతిని కలిగించింది. చివరకు ముంబై వంటి ఖరీదైన నగరం నుండి వచ్చిన వారు సైతం బెంగళూరు ధరలు చూసి ఆశ్చర్యపోతున్నారు.

నగరాల మధ్య ఈ ధరల తేడాపై సజిత్ ఒక ఆసక్తికరమైన సిద్ధాంతాన్ని వెల్లడించారు. ఉత్తర భారతదేశంలో ఇప్పటికీ సాంప్రదాయ బొగ్గు పెట్టెలను వాడుతుండగా, బెంగళూరులోని వ్యాపారులు ఎక్కువగా ఎల్‌పిజి (LPG) ఆధారిత ఇస్త్రీ పెట్టెలను వాడుతున్నారని ఆయన పేర్కొన్నారు. ఎన్‌సిఆర్ (NCR) ప్రాంతంలో తందూరి రెస్టారెంట్లు ఎక్కువగా ఉండటం వల్ల అక్కడ బొగ్గు చౌకగా దొరుకుతుందని, అదే బెంగళూరులో ఎల్‌పిజి సిలిండర్ల ధరలు పెరగడం వల్ల ఇస్త్రీ ధరలు రాత్రికి రాత్రే రూ. 10 నుండి రూ. 15 – 20కి పెరిగాయని నెటిజన్లు కూడా అంగీకరిస్తున్నారు.

దేశవ్యాప్తంగా ఇస్త్రీ ధరల పోలికతో ఈ పోస్ట్‌పై స్పందిస్తూ నెటిజన్లు దేశంలోని వివిధ నగరాల ధరలను వివరించారు.

థానే: సాధారణ ఇస్త్రీ రూ. 7, స్టీమ్ ప్రెస్ రూ. 20.

సూరత్: డెలివరీతో కలిపి సాధారణ ఇస్త్రీ రూ. 10, స్టీమ్ ఇస్త్రీ రూ. 25.

హైదరాబాద్: ఇక్కడ కూడా ధరలు రూ. 15 నుండి రూ. 20 కి చేరాయి.

చివరగా, “బెంగళూరులో ముడతలు పడని చొక్కాలు కూడా స్టార్టప్ స్థాయి ధరలకే లభిస్తాయి” అంటూ నెటిజన్లు చమత్కరిస్తున్నారు. ఈ చర్చ కేవలం ఇస్త్రీ ధరల గురించే కాకుండా, భారతీయ నగరాల్లో రోజువారీ జీవన వ్యయాలు ఎంత ఊహించని రీతిలో మారుతుంటాయో స్పష్టం చేసింది.

మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us