Viral Video: ఇండియాలోనే ఉన్నానా.. నమ్మలేకపోయిన జపాన్ టూరిస్ట్!

|

Nov 14, 2024 | 4:27 PM

ఇండియాకి వచ్చిన ఓ జపాన్ టూరిస్ట్ షాక్ అయ్యింది. నేను ఇండియాలో ఉన్నా.. జపాన్‌లో ఉన్నట్టు అనిపించిందని పోస్ట్ చేసింది. ప్రస్తుతం ఈ జపాన్ టూరిస్ట్ చేసిన ఓ పోస్ట్ నెట్టింట వైరల్‌గా మారింది. సాధారణంగా వివిధ దేశాల నుంచి ఇండియాకు అనేక మంది టూరిస్టులు వస్తూ ఉంటారు. ఈ క్రమంలోనే జపాన్‌కు చెందిన ఓ ట్రావెల్ వ్లాగర్ కికీ చెన్ ఓ యువతి..

Viral Video: ఇండియాలోనే ఉన్నానా.. నమ్మలేకపోయిన జపాన్ టూరిస్ట్!
Viral Video
Follow us on

ఇండియాకి వచ్చిన ఓ జపాన్ టూరిస్ట్ షాక్ అయ్యింది. నేను ఇండియాలో ఉన్నా.. జపాన్‌లో ఉన్నట్టు అనిపించిందని పోస్ట్ చేసింది. ప్రస్తుతం ఈ జపాన్ టూరిస్ట్ చేసిన ఓ పోస్ట్ నెట్టింట వైరల్‌గా మారింది. సాధారణంగా వివిధ దేశాల నుంచి ఇండియాకు అనేక మంది టూరిస్టులు వస్తూ ఉంటారు. ఈ క్రమంలోనే జపాన్‌కు చెందిన ఓ ట్రావెల్ వ్లాగర్ కికీ చెన్ ఓ యువతి.. భారత్‌కు వచ్చింది. ఈమె బెంగుళూరులోని కెంపేగౌడ ఇంటర్నేషనల్‌ ఎయిర్ పోర్టులోని టెర్మినల్ 2లో దిగింది. అక్కడ చేసిన డిజైన్స్‌కి ఈ యువతి ముగ్దురాలైంది. వెంటనే వీడియో వ్లాగ్ చేయడం మొదలు పెట్టింది.

నేను ఇండియాలో ఉన్నానా.. జపాన్‌లో ఉన్నానో అర్థం కావడం లేదని వీడియో స్టార్ట్ చేసింది. నేను ఇండియాలో ఉన్నానా అని నిజంగా నమ్మలేక పోతున్నా.. ఈ ఎయిర్ పోర్ట్ చాలా బావుంది. అంటూ ఎయిర్‌ పోర్టులో ఉండే ప్లేసులన్నీ చూపించింది కికీ. అంతే కాకుండా అక్కడ కొన్ని రకాల ఫొటోలు కూడా దిగింది. ఆ తర్వాత ఈ వీడియోను ఇంటర్నెట్‌లో షేర్ చేసింది. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట జోరుగా వైరల్ అవుతుంది. ఈ వీడియోకు లక్షల్లో వ్యూస్ వచ్చాయి. ఈ వీడియో చూసిన పలువురు నెటిజన్లు విభిన్నంగా స్పందిస్తున్నారు.

‘అత్యంత అందమైన ఎయిర్ పోర్ట్స్‌లో బెంగుళూరుకు చెందిన ఈ విమానాశ్రయానికి ‘టెర్మినల్ అవార్డు’ వచ్చిందని ఒక నెటిజన్ కామెంట్ చేయగా’.. ‘బెంగుళూరు ఎయిర్ పోర్టు వల్ల ఇతర దేశ ప్రజలు కూడా మనల్ని అభినందించడం గర్వ కారణం.. కాబట్టి మన గర్వ పడాలి’ అని మరికొందరు నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.

ఈ వీడియో చూసేయండి..