Inspiring Story: నేటి యువకులకు స్ఫూర్తి.. పొలంలో నీటి కోసం 5ఏళ్ళు కష్టపడి 3 ఎకరాల్లో చెరువు తవ్విన 105 ఏళ్ల వృద్ధుడు

|

Jul 31, 2022 | 12:31 PM

వర్షం నీటిని సేకరించేందుకు ఆయన చేసిన అపూర్వ ప్రయత్నం చూసి అందరూ ఆశ్చర్యపోతున్నారు. ప్రకృతి అంటే ఇష్టమైన బైద్యనాథ్.. గత 40 ఏళ్లుగా కుటుంబానికి దూరంగా ఉంటున్న 105 ఏళ్ల వృద్ధుడు ప్రకృతి ఒడిలోనే నివాసం ఏర్పరచుకున్నారు.

Inspiring Story: నేటి యువకులకు స్ఫూర్తి.. పొలంలో నీటి కోసం 5ఏళ్ళు కష్టపడి 3 ఎకరాల్లో చెరువు తవ్విన 105 ఏళ్ల వృద్ధుడు
Farmer Baidyanath
Follow us on

Inspiring Story: కలలు కనండి.. వాటిని నెరవేర్చుకోవడానికి కష్టపడండి.. మిస్సైల్ మ్యాన్ అబ్దుల్ కలామ్ చెప్పిన సూక్తిని కొండతమంది పాటిస్తారు.. తాము కన్న కలలు నెరవేర్చుకోవడం కోసం అనుకున్న గమ్యాన్ని చేరుకోవడం కోసం ఎన్ని కష్టలు ఎదురైనా లెక్కచేయరు. ఇందుకు సజీవ సాక్ష్యం.. 105 సంవత్సరాల వయస్సు  బైద్యనాథ్. ఉత్తరప్రదేశ్‌లోని బుందేల్‌ఖండ్‌కు చెందిన ఈ వృద్ధుడు ఓ చెరువు తవ్వి.. చరిత్ర సృష్టించాడు.

బైద్యనాథ్ రాజ్‌పుత్ స్వయంగా పలుగు, పార పట్టారు. 3 ఎకరాల చెరువును తవ్వారు. వర్షం నీటిని సేకరించేందుకు ఆయన చేసిన అపూర్వ ప్రయత్నం చూసి అందరూ ఆశ్చర్యపోతున్నారు. ప్రకృతి అంటే ఇష్టమైన బైద్యనాథ్.. గత 40 ఏళ్లుగా కుటుంబానికి దూరంగా ఉంటున్న 105 ఏళ్ల వృద్ధుడు ప్రకృతి ఒడిలోనే నివాసం ఏర్పరచుకున్నారు. పొలాల్లో గుడిసె వేసుకుని జీవిస్తున్నాడు. ఉద్యాన, సాగు, నీటి సంరక్షణ కోసం చర్యలు తీసుకుంటూ ప్రజలకు ఆదర్శంగా నిలుస్తున్నారు.

హమీర్‌పూర్ జిల్లాలోని సరిలా తహసీల్‌లోని బ్రహ్మానంద్ ధామ్ బర్హరా అనే చిన్న గ్రామ నివాసి.  1914 లో జన్మించాడు. బైద్యనాథ్ హోంగార్డుగా పనిచేసి పదవీ విరమణ చేసిన అనంతరం రైతుగా అవతారం ఎత్తారు. 100 ఏళ్ళు దాటినా వ్యవసాయం చేస్తున్నాడు. తోటపనిని స్వయంగా చేస్తారు. అయితే పంటకు నీటికొరత లేకుండా చూడడం కోసం స్వయంగా పలుగు, పార పట్టి రంగంలోకి దిగారు.

ఇవి కూడా చదవండి

ఐదేళ్లు కష్టపడి తవ్విన చెరువు
గత 40 ఏళ్లుగా పొలాల్లో గుడిసె వేసుకుని కుటుంబానికి దూరంగా జీవిస్తున్నారు. ఈ వయస్సులో కూడా ఎంతో చురుకుగా ఉంటారు. అతని ఉత్సాహం ఆరోగ్యం ముందు నేటి యువకుడు కూడా దిగదుడుపే అని చెప్పవచ్చు. తోటలో మొక్కలు, చెట్లు పెంచే సమయంలో నీటి ఎద్దడి ఏర్పడింది. దీంతో ఏకంగా పార తీసుకుని 5 ఏళ్లు కష్టపడి 3 ఎకరాల చెరువు తవ్వారు. హార్టికల్చర్, వ్యవసాయం 105 ఏళ్ల బైద్యనాథ్ కు ఇష్టమైన వ్యాపకం.

తన తోటలో వివిధ రకాల మొక్కలను పెంచుతున్నారు. వందలాది పండ్ల చెట్లతో పాటు కొబ్బరి, లవంగం, యాలకులు, నిమ్మకాయలు, కాశ్మీరీ జామకాయ వంటి రకరకాల మొక్కలను పెంచుతున్నారు. అంతేకాదు ఈ తోటలోని పండ్లను మార్కెట్‌లో విక్రయించకుండా గ్రామంలోని పిల్లలకు, పెద్దలకు ఉచితంగా పంపిణీ చేస్తున్నారు. జిల్లాలో కొన్ని ప్రాంతాల్లో సరైన నీటి వసతి లేదు. చేతి పంపులు కూడా ఇక్కడ పనిచేయవు. దీంతో  పరిస్థితుల్లో తన తోటను కాపాడుకునేందుకు 3 ఎకరాల పొలంలో చెరువు తవ్వించారు. ఇప్పుడు అదే నీటితో చెట్లకు నీరందిస్తున్నారు.

ఉదయం 5 గంటలకే పొలం పనులు ప్రారంభం:
బైద్యనాథ్ ప్రశాంతమైన జీవితాన్ని గడుపుతారు. తెల్లవారుజామున 5 గంటలకే నిద్ర లేచి చెరువు, పొలం, తోటలో కొద్దీ సేపు పని చేస్తారు. 105 ఏళ్ల వయసులోనూ ప్రశాంతంగా జీవిస్తున్నారు. తన ఆరోగ్య రహస్యం ఆహారాన్ని క్రమం తప్పకుండ సమయానికి తింటానని.. సింపుల్ గా ఉండేలా చూసుకుంటానని చెప్పారు. తినే ఆహారంలో, పాలు, రొట్టె, గంజి లతో పాటు తోటలలో పండే పండ్లు మాత్రమే తీసుకుంటారు.

105 ఏళ్ల వయసులోసంపూర్ణ ఆరోగ్యం:

ఇప్పటికీ ఉదయం, సాయంత్రం బైద్యనాథ్ తన తోటలో కష్టపడి పనిచేస్తుంటారు. 35 ఏళ్ల వయసులో రెజ్లింగ్ చేసేవాడినని చెప్పాడు. బుందేల్‌ ఖండ్‌లోని అనేక జిల్లాల్లో పెద్ద రెజ్లర్లను కూడా ఓడించారు. 1966లో గో ఉద్యమ సమయంలో స్వామి బ్రహ్మానందతో పాటు తీహార్ జైలులో ఒక నెల శిక్షను అనుభవించారు. ఇప్పటి వరకు ఇంగ్లీషు మందులేవీ తీసుకోలేదు. జ్వరం, జలుబు, మరేదైనా సమస్య వచ్చినా ఆయుర్వేద మందులు మాత్రమే తీసుకుంటారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..