AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral Video: వందనాలమ్మ నీకు వందనాలమ్మ.. లోకల్ టాలెంట్ మామూలుగా లేదుగా..

ఈ దేశంలో, దాదాపు ప్రతి ఒక్కరిలోనూ జుగాద్ కళ కనిపిస్తుంది. ప్రజలు తమ అవసరానికి అనుగుణంగా ఏదో ఒక లోకల్ టాటెంట్ చూపిస్తుంటారు. కొన్నిసార్లు వారి వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. మీరు కూడా సోషల్ మీడియాలో ఉంటే, మీరు జుగాద్ వీడియోలను ఒకదాని తర్వాత ఒకటి చూసి ఉంటారు. కొన్నిసార్లు రోటీ చుట్టే జుగాద్, కొన్నిసార్లు బట్టలు ఇస్త్రీ చేసే జుగాద్, అంతే కాకుండా, ఇప్పటివరకు అనేక రకాల లోకల్ టాలెంట్ వీడియోలు వైరల్ అయ్యాయి

Viral Video: వందనాలమ్మ నీకు వందనాలమ్మ.. లోకల్ టాలెంట్ మామూలుగా లేదుగా..
Local Talent Video
Balaraju Goud
|

Updated on: Aug 14, 2025 | 5:56 PM

Share

ఈ దేశంలో, దాదాపు ప్రతి ఒక్కరిలోనూ జుగాద్ కళ కనిపిస్తుంది. ప్రజలు తమ అవసరానికి అనుగుణంగా ఏదో ఒక లోకల్ టాటెంట్ చూపిస్తుంటారు. కొన్నిసార్లు వారి వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. మీరు కూడా సోషల్ మీడియాలో ఉంటే, మీరు జుగాద్ వీడియోలను ఒకదాని తర్వాత ఒకటి చూసి ఉంటారు. కొన్నిసార్లు రోటీ చుట్టే జుగాద్, కొన్నిసార్లు బట్టలు ఇస్త్రీ చేసే జుగాద్, అంతే కాకుండా, ఇప్పటివరకు అనేక రకాల లోకల్ టాలెంట్ వీడియోలు వైరల్ అయ్యాయి. ఇప్పుడు కొత్త జుగాద్ కనిపించింది.

ప్రస్తుతం వైరల్ అవుతున్న వీడియో ఆహార పదార్థాలను వేడిగా ఉండే హాట్ బాక్స్‌కు సంబంధించినది. ఎవరైనా హాట్ బాక్స్ పాడైపోతే.. ఏం చేస్తారు. పక్కన పడేస్తారు.. లేదంటే.. పాత ఇనుప సామాన్లకు వేస్తారు. కానీ ఒక మహిళ దీని కోసం కూడా జుగాద్‌ కళను ప్రదర్శించింది. వీడియోలో, ఒక మహిళ హాట్ బాక్స్‌ను స్టప్‌పై పెట్టి వేడి చేసింది. ఆ తర్వాత, దాని చుట్టూ ఉన్న ప్లాస్టిట్‌ను కత్తితో పూర్తిగా తొలగించింది. దీని తర్వాత, ఆమె అందులోని స్టీలు బాక్స్‌ను తీసి టిఫిన్ బాక్స్‌గా మార్చేసింది. ఇప్పుడు ఈ జుగాద్ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఈ వీడియో @Siimplymee1234 అనే ఖాతా ద్వారా షేర్ చేయడంతో వైరల్‌గా మారింది. దీన్ని చూసిన నెటిజన్లు రకరకాలుగా కామెంట్ల రూపంలో స్పందిస్తున్నారు. మీరు చూసేయండీ లోకల్ టాలెంట్‌..

వీడియో చూడండి.. 

మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..