ఇకపై మీ పెట్‌తో హ్యాపీ జర్నీ.. వందే భారత్ రైల్వే కొత్త సదుపాయం.. బుకింగ్ రూల్స్ ఇవే..!

ప్రయాణికులు తమ పెంపుడు జంతువులతో కలిసి సులభంగా ప్రయాణించేందుకు వీలుగా భారతీయ రైల్వే వందే భారత్ స్లీపర్ రైళ్లలో ప్రత్యేక పెట్ బాక్స్ సౌకర్యాన్ని అందుబాటులోకి తెచ్చింది. ఈ సేవను పొందడానికి కన్ఫర్మ్ చేయబడిన ఫస్ట్ క్లాస్ టికెట్ లేదా కేబిన్ ఉండాలి. ప్రయాణానికి ముందు వెటర్నరీ డాక్టర్ జారీ చేసిన ఫిట్‌నెస్ సర్టిఫికెట్, వ్యాక్సినేషన్ పత్రాలు సమర్పించడం తప్పనిసరి. సాధారణ లగేజ్ చార్జీల ప్రకారం రుసుము చెల్లించాలి. ఒకవేళ ప్రయాణం రద్దు చేసుకుంటే పార్సల్ లేదా బుకింగ్ ఛార్జీల రిఫండ్ లభించదు. పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం..

ఇకపై మీ పెట్‌తో హ్యాపీ జర్నీ.. వందే భారత్ రైల్వే కొత్త సదుపాయం.. బుకింగ్ రూల్స్ ఇవే..!
Pet Travel In Indian Railways

Updated on: Nov 11, 2026 | 4:54 PM

పెంపుడు జంతువులతో కలిసి సుదూర ప్రయాణాలు చేయడం గతంలో చాలా సవాలుతో కూడుకున్నది. సాధారణ రైళ్లలో దీనికి సంబంధించి కఠినమైన, పరిమిత నిబంధనలు ఉండేవి. అయితే, పెట్ లవర్స్ సౌలభ్యం కోసం భారతీయ రైల్వే ఇప్పుడు అత్యాధునిక వందే భారత్ స్లీపర్ రైళ్లలో పెంపుడు జంతువుల కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేసింది.

వందే భారత్ స్లీపర్ రైళ్లలో పెట్ బాక్స్ ప్రత్యేకత

వందే భారత్ స్లీపర్ రైళ్లలో పెంపుడు జంతువుల కోసం ప్రత్యేకంగా పెట్‌ బాక్స్‌ ఏర్పాటు చేశారు. ఇది అత్యంత పటిష్టమైన, సురక్షితమైన ఎన్‌క్లోజర్. ఈ బాక్స్‌లో జంతువులకు అవసరమైన గాలి, నీరు, ఆహారం అందించేందుకు ప్రత్యేక హోల్డర్లు ఉంటాయి. దీనివల్ల సుదూర లేదా రాత్రి సమయపు ప్రయాణాల్లో పెంపుడు జంతువులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఉంటుంది.

టికెట్ బుకింగ్, అర్హత నిబంధనలు

ఈ ప్రత్యేక సదుపాయాన్ని పొందడానికి ప్రయాణికునికి కన్ఫర్మ్ అయిన టికెట్ ఉండాలి. ఆర్ఏసీ లేదా వెయిటింగ్ లిస్ట్ టికెట్లపై ఈ అనుమతి లభించదు. ఒక PNR పై కేవలం ఒక పెంపుడు జంతువును మాత్రమే అనుమతిస్తారు. సాధారణంగా ఫస్ట్ క్లాస్ AC లో మొత్తం 4 బెర్త్‌ల కేబిన్ లేదా 2 బెర్త్‌ల కూపే బుక్ చేసుకున్నప్పుడు ఈ సదుపాయం సులభంగా లభిస్తుంది. బుట్టలో ఉంచగలిగే చిన్న పిల్లి పిల్లలు లేదా కుక్క పిల్లలను కూడా నిర్దిష్ట నిబంధనల ప్రకారం అనుమతిస్తారు.

ఇవి కూడా చదవండి

ఛార్జీలు, రిఫండ్ నిబంధనలు

రైల్వే నిబంధనల ప్రకారం పెంపుడు జంతువుల బరువును బట్టి లగేజ్ ఛార్జీలు వర్తిస్తాయి. సాధారణంగా డెడికేటెడ్ పెట్ బాక్స్ లేదా ఫస్ట్ క్లాస్ కంపార్ట్‌మెంట్‌లలో తరలించేటప్పుడు నిర్ణీత బరువు (దాదాపు 30 నుండి 60 కేజీల వరకు) ఆధారంగా రుసుము వసూలు చేస్తారు. జంతువుకు అవసరమైన ఆహారం, సంరక్షణ బాధ్యత పూర్తిగా యజమానులదే. ఒకవేళ డాగ్ బాక్స్ బుక్ చేసుకుని, ప్రయాణం చేయకపోతే పార్సల్ లేదా బుకింగ్ ఛార్జీల రీఫండ్ లభించదు. అలాగే ట్రైన్ క్యాన్సిల్ అయినా లేదా లేట్ అయినా దీనికి రిఫండ్ వర్తించదు.

కావలసిన ముఖ్యమైన పత్రాలు

రైలులో పెంపుడు జంతువుతో ప్రయాణించే ముందు సంబంధిత స్టేషన్ పార్సల్ ఆఫీసులో కొన్ని ధృవపత్రాలు చూపించాలి. ముఖ్యంగా ప్రయాణానికి 24 నుండి 48 గంటల ముందు వెటర్నరీ డాక్టర్ జారీ చేసిన ఫిట్‌నెస్ సర్టిఫికెట్, జంతువుకు వేయించిన వ్యాక్సిన్ల పత్రాలు తప్పనిసరిగా సమర్పించాలి. ముందుగానే ట్రైన్ షెడ్యూల్, లభ్యతను పరిశీలించి ప్రయాణం చేయడం మంచిది.

Loading...
Unable to load recommendations.
Follow Us