Father’s Love: అప్పుడే పుట్టిన కూతురుతో గడపడం కోసం లక్షల్లో జీతం వచ్చే ఉద్యోగానికి గుడ్ బై చెప్పిన తండ్రి.. నువ్వు గ్రేట్ బ్రో అంటోన్న నెటిజన్లు

|

Nov 20, 2022 | 9:25 PM

ఈ ఉద్యోగంలో అత్యధిక జీతంవస్తుందని.. అయితే తనకు తండ్రిగా వస్తున్న  ప్రమోషన్ ముందు జీతం తక్కువ అనిపించినట్లు పేర్కొన్నాడు అంకిత్. తాను ఉద్యోగానికి రిజైన్ చేసిన సమయంలో చాలామంది నన్ను హెచ్చరించారు..  భవిష్యత్తులో పరిస్థితులు కష్టమవుతాయని చెప్పారు.

Fathers Love: అప్పుడే పుట్టిన కూతురుతో గడపడం కోసం లక్షల్లో జీతం వచ్చే ఉద్యోగానికి గుడ్ బై చెప్పిన తండ్రి.. నువ్వు గ్రేట్ బ్రో అంటోన్న నెటిజన్లు
Ankit Joshi's Heartwarming
Follow us on

నేటి యువత అధిక జీతం ఇచ్చే ఉద్యోగాల కోసం చూస్తున్నారు. అలా ఎక్కువ జీతం వచ్చే ఉద్యోగం కోసం ఎంత కష్టపడతారో చెప్పాల్సిన పనిలేదు. కన్న తల్లిదండ్రులను ,ఉన్న ఊరుని, చివరకు దేశాన్ని కూడా విడిచి పెట్టి వెళ్తున్నారు. అయితే ప్రస్తుతం అత్యధిక జీతం వస్తున్న ఉద్యోగానికి గుడ్ బై చెప్పేసిన ఓ వ్యక్తి ప్రస్తుతం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నారు. ఉద్యోగానికి రాజీనామా చేయడానికి చెప్పిన రీజన్ తో నెటిజన్లను కట్టుకున్నారు. వైరల్ అవుతున్న ఈ తండ్రి.. తన నవజాత శిశువును చూసుకోవడం కోసం లక్షల విలువ చేసే ఉద్యోగాన్ని వదిలిపెట్టాడు. అప్పుడే పుట్టిన బిడ్డతో ఎక్కువ సమయం గడపాలని తాను ఈ నిర్ణయం తీసుకున్నట్లు సోషల్ మీడియా ద్వారా తెలిపారు అకింత జోషి.

ఐఐటీ ఖరగ్‌పూర్‌లో చదివిన అంకిత్ జోషిది  విజయవంతమైన కెరీర్. ఓ సక్సెస్ ఫుల్ మనిషికి ఉండాల్సినవన్నీ ఉన్నాయి. అంతేకాదు అంకిత్  ఒక కంపెనీకి సీనియర్ వైస్ ప్రెసిడెంట్. తన నిర్ణయం గురించి హ్యూమన్స్ ఆఫ్ బాంబేతో మాట్లాడుతూ, తన కుమార్తె పుట్టడానికి కొన్ని రోజుల ముందు.. తాను ఉద్యోగానికి రిజైన్ చేయాలని నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు. ఈ ఉద్యోగంలో అత్యధిక జీతంవస్తుందని.. అయితే తనకు తండ్రిగా వస్తున్న  ప్రమోషన్ ముందు జీతం తక్కువ అనిపించినట్లు పేర్కొన్నాడు అంకిత్. తాను ఉద్యోగానికి రిజైన్ చేసిన సమయంలో చాలామంది నన్ను హెచ్చరించారు..  భవిష్యత్తులో పరిస్థితులు కష్టమవుతాయని చెప్పారు. అయితే నేను తీసుకున్న నిర్ణయానికి నా భార్య మద్దతు ఇచ్చిందని వెల్లడించారు అంకిత్.

ఇవి కూడా చదవండి

తాను వైస్ ప్రెసిడెంట్‌గా పనిచేస్తున్న కంపెనీలో ఎక్కువగా వివిధ ప్రాంతాలకు పర్యటించాల్సి వచ్చేదని అంకిత్ చెబుతున్నాడు. అయితే ఇప్పుడు తాను అందుకు సిద్ధంగా లేనని.. కుమార్తె పుట్టిన తర్వాత ఉద్యోగం మానేయాలని నిర్ణయించుకున్నానని స్పష్టం చేశారు.

 

వాస్తవానికి అంకిత్ జోషి అతను పనిచేస్తున్న కంపెనీ ఒక వారం పితృత్వ సెలవు ఇచ్చింది. అయితే ఈ సెలవులతో అతను సంతృప్తి చెందలేదు. గత కొన్ని నెలల క్రితం సీనియర్ వైస్ ప్రెసిడెంట్‌గా ఛార్జ్ తీసుకున్నందున తాను కంపెనీ నుండి ఎక్కువ ఆశించలేనని చెప్పాడు.

తన ఉద్యోగాన్ని విడిచిపెట్టినప్పటి నుండి అంకిత్ సంరక్షణ కోసం తన పూర్తి సమయాన్నివెచ్చిస్తున్నట్లు పేర్కొన్నాడు. అంకిత్ జోషి దంపతులు తమ కుమార్తెకు స్పితి అనే అద్భుతమైన ప్రదేశానికి చెందిన పేరు పెట్టారు.  కొన్ని నెలల తర్వాత తాను కొత్త ఉద్యోగానికి సంబంధించిన ప్రయత్నాలు చేస్తానని అంకిత్ పేర్కొన్నారు.

మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..