Viral Video: ఇదేం సరదారా బాబు.. ప్రపోజ్ చేశాడు.. రిప్లై చూసి పరిగెత్తి పారిపోయాడు..

|

Sep 18, 2022 | 12:25 PM

సరదా కోసం ఎన్నో చిలిపి పనులు చేస్తూ ఉంటాం. కాని ఆ సరదా శృతి మించకూడదు. ఒక వేళ సరదా పరిధులు దాటితే అది ఒక్కోసారి పెను ప్రమాదాలకే దారి తీయవచ్చు. చాలా మంది జంతువులు కనబడితే ఏదోలా ఆటపట్టిదాం అనుకుంటారు. ఒక్కోసారి అవి..

Viral Video: ఇదేం సరదారా బాబు.. ప్రపోజ్ చేశాడు.. రిప్లై చూసి పరిగెత్తి పారిపోయాడు..
Boy Proposed To Buffalo
Follow us on

Virak News: సరదా కోసం ఎన్నో చిలిపి పనులు చేస్తూ ఉంటాం. కాని ఆ సరదా శృతి మించకూడదు. ఒక వేళ సరదా పరిధులు దాటితే అది ఒక్కోసారి పెను ప్రమాదాలకే దారి తీయవచ్చు. చాలా మంది జంతువులు కనబడితే ఏదోలా ఆటపట్టిదాం అనుకుంటారు. ఒక్కోసారి అవి ఇచ్చే రిప్లై చూస్తే దిమ్మ తిరిగి మైండ్ బ్లాంక్ అవడం ఖాయం. ఇప్పుడు ఇలాంటి వీడియో ఒకటి సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. సాధారణంగా ఎవరైనా గర్ల్ ఫ్రెండ్ కి ప్రపోజ్ చేసేటప్పుడు ఎన్నో ప్లాన్స్ వేసుకుంటారు. యాక్సెప్ట్ చేస్తే ఓకే.. చేయకపోతే ఏంది పరిస్థితి.. ఇలా ఎన్నో ఆలోచనలు చేసుకుని.. చివరికి ధైర్యం చేసి మొత్తం మీద ప్రపోజ్ చేయడానికి సిద్ధమవుతాం. కొంతమంది అయితే ముందు ఎన్నో ట్రయల్స్ కూడా వేస్తాం. పక్కన ఎవరైనా ఫ్రెండ్స్ ఉంటే మన ఫర్మార్మెన్స్ తో చివరకు చిరాకు కూడా తెప్పిస్తాం. కాని.. ఓ బాలుడు గేదెకు ప్రపోజ్ చేసిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈవీడియో చూస్తున్న నెటిజన్లంతా నవ్వును ఆపుకోలేకపోతున్నారు. సోషల్ మీడియా ప్రభావం పెరిగిన తర్వాత.. ఇలాంటి ఫన్నీ వీడియోలను డైలీ ఎన్నో చూస్తున్నాం. ముఖ్యంగా జంతువులకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంటాయి. అలాంటి ఒకటి ప్రస్తుతం సోషల్ మీడియాలో ఓ ఊపు ఊపుతోంది. ఈ వీడియో చూసిన చాలా మంది షాక్ అవుతున్నారు.

ఈ ఫన్నీ వీడియోలో ఓ బాలుగు గేదెకు ప్రపోజ్ చేస్తూ కనిపించాడు. ఇందులో ఆ గేదె రియాక్షన్ చూసి అందరూ నవ్వుకుంటున్నారు. ఈ వైరల్ వీడియోలో పచ్చని పొలంలో ఆ బాలుడు గేదెకు ప్రపోజ్ చేయడం కనిపిస్తుంది. మోకాళ్ళు దించి, గేదెకు ఓ గడ్డి బొకే ఇచ్చి ప్రపోజ్ చేయడానికి ప్రయత్నిస్తాడు. అతన్ని చూడగానే ఈ గేదె ఎలాంటి రియాక్షన్ ఇవ్వదు. తర్వాత ఆ బాలుడు గేదె ముందు డ్యాన్స్ చేయడం ప్రారంభించాడు. బాలుడి డ్యాన్స్ చూసిన గేదె ఆ అక్కడి నుండి తరిమింది. దీంతో బాలుడు అక్కడి నుండి ఒకటే పరుగు. భయంతో వెనక్కి తిరిగి చూసుకోకుండా పరిగెత్తాడు. ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఇప్పటి వరకు లక్షల మంది ఈవీడియోను వీక్షించారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం చూడండి..