100 Cars Gift: ఇది నిజంగా బంపర్ ఆఫర్.. ఉద్యోగులకు 100 కార్ల బహుమతి.. ఎక్కడో తెలుసా..!

|

Apr 12, 2022 | 5:48 AM

100 Cars Gift: కొన్ని కంపెనీలో తమ సంస్థలో పని చేసే ఉద్యోగులను కడుపులో పెట్టుకుని చూసుకుంటాయి. కంపెనీ లాభాలకోసం, అభివృద్ధి కోసం శ్రమిస్తున్న వారిని..

100 Cars Gift: ఇది నిజంగా బంపర్ ఆఫర్.. ఉద్యోగులకు 100 కార్ల బహుమతి.. ఎక్కడో తెలుసా..!
Car
Follow us on

100 Cars Gift: కొన్ని కంపెనీలో తమ సంస్థలో పని చేసే ఉద్యోగులను కడుపులో పెట్టుకుని చూసుకుంటాయి. కంపెనీ లాభాలకోసం, అభివృద్ధి కోసం శ్రమిస్తున్న వారిని.. వారి శ్రమకు తగినట్లుగానే ఆదరిస్తాయి. విలువైన వస్తువులు, భారీ ఎత్తున శాలరీలు, ప్రత్యేక ఆఫర్లు ప్రకటిస్తుంటాయి. తాజాగా చెన్నైకి చెందిన ఓ ఐటీ కంపెనీ కూడా తమ కంపెనీలోని ఉద్యోగులకు బంపర్ బొనాంజా ప్రకటించింది. ఉద్యోగులకు ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 100 కార్లను బహుమతిగా అందజేసింది. అవును.. చైన్నై కేంద్రంగా కార్యకలాపాలు సాగిస్తున్న ఐడియాస్2ఐటీ తన ఉద్యోగులకు 100 కార్లను బహుతిగా ఇచ్చింది. సంస్థ కొత్త కార్యాలయం ప్రారంభించిన సందర్భంగా.. సంస్థలో పని చేస్తున్న వంది మందికి 100 మారుతి సుజుకీ కార్లను బహుమతిగా ఇచ్చారు కంపెనీ సీఈవో. కంపెనీ అభివృద్ధికి వారు చేస్తున్న కృషికి గుర్తింపుగా వారికి ఈ కార్లను బహుకరించినట్లు సీఈవో గాయత్రి వివేకానందన్ తెలిపారు. కాగా, కేవలం ఆరుగురు ఇంజనీర్లతో ప్రారంభమైన ఈ సంస్థలో ప్రస్తుతం 500 మంది ఉద్యోగులు పని చేస్తున్నారు. ఈ సాఫ్ట్ వేరే సుల్యూషన్ కంపెనీ భారత్‌తో పాటు.. అమెరికా, మెక్సీకో సహా పలు దేశాల్లో తన కార్యకలాపాలను విస్తరించింది.

Also read:

IPL 2022: వరుసగా రెండో మ్యాచ్‌ గెలిచిన సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌.. కెప్టెన్‌ ఇన్సింగ్స్‌ ఆడిన విలియమ్సన్..

Investment: ఇన్వెస్ట్మెంట్స్ చేయడంలో మహిళలు ఎందుకు వెనకబడుతున్నారు.. కారణమేంటంటే..

విద్యార్ధులకు అలర్ట్! TSRJC CET 2022 దరఖాస్తు గడువు పెంపు! ఎప్పటివరకంటే..