AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

‘హలో’ చెప్పిన ఏలియన్స్..? ప్రూఫ్ దొరికిందంటున్న శాస్త్రవేత్తలు

ఏలియెన్స్.. ఈ వింతైన అంతరిక్ష జీవులను ఎక్కువగా హాలీవుడ్, బాలీవుడ్ సినిమాల్లో చూస్తుంటాం. ‘అవెంజర్స్’ సినిమాల్లో అయితే మానవులకు, అంతరిక్ష జీవులకు మధ్య భీకరమైన యుద్ధాన్నే చూశాం. ఇక అప్పుడప్పుడు అవి కేవలం సినిమాల్లోనే కనిపిస్తాయా.? నిజంగానే జీవిస్తున్నారా.? అనే అనుమానాలు వ్యక్తమవుతాయి. సోషల్ మీడియాలో కూడా కొన్నిసార్లు వాళ్ళ ఉనికి ఉందని ప్రచారం జరిగింది. ఇక వాటిని నిజం చేస్తూ తాజాగా అంతరిక్ష జీవులు ఉన్నారంటూ శాస్త్రవేత్తలకు కొన్ని సంకేతాలు అందాయి. ఇప్పుడు అది నెట్టింట్లో […]

‘హలో’ చెప్పిన ఏలియన్స్..? ప్రూఫ్ దొరికిందంటున్న శాస్త్రవేత్తలు
Ravi Kiran
|

Updated on: Aug 23, 2019 | 3:54 PM

Share

ఏలియెన్స్.. ఈ వింతైన అంతరిక్ష జీవులను ఎక్కువగా హాలీవుడ్, బాలీవుడ్ సినిమాల్లో చూస్తుంటాం. ‘అవెంజర్స్’ సినిమాల్లో అయితే మానవులకు, అంతరిక్ష జీవులకు మధ్య భీకరమైన యుద్ధాన్నే చూశాం. ఇక అప్పుడప్పుడు అవి కేవలం సినిమాల్లోనే కనిపిస్తాయా.? నిజంగానే జీవిస్తున్నారా.? అనే అనుమానాలు వ్యక్తమవుతాయి. సోషల్ మీడియాలో కూడా కొన్నిసార్లు వాళ్ళ ఉనికి ఉందని ప్రచారం జరిగింది. ఇక వాటిని నిజం చేస్తూ తాజాగా అంతరిక్ష జీవులు ఉన్నారంటూ శాస్త్రవేత్తలకు కొన్ని సంకేతాలు అందాయి. ఇప్పుడు అది నెట్టింట్లో వైరల్ అవుతోంది.

‘ఫాస్ట్ రేడియో బర్మ్స్ (ఎఫ్ ఆర్బీ)’… ఇతర గ్రహాల నుంచి వచ్చిన సంకేతాలకు శాస్త్రవేత్తలు పెట్టిన పేరు ఇది. తాజాగా దాని నుంచి భూమిపైకి ఎనిమిది సంకేతాలు అందాయని పరిశోధకులు తేల్చారు. కెనడాలోని హైడ్రోజన్ ఇంటెన్సిటీ మ్యాపింగ్ టెలిస్కోప్ ఈ సంకేతాలను గ్రహించిందట. ఇక ఈ సంకేతాలను ఓ అంతుచిక్కని గ్రహాంతరజీవి పంపి ఉంటుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. కాగా ఆ సంకేతాలు వేరే గెలాక్సీ నుంచి వచ్చాయా.. లేక బ్లాక్ హోల్ నుంచి వచ్చాయనేదానిపై పరిశోధన చేస్తున్నారు. వాటిని డీకోడ్ చేసే పనిలో పడ్డారు పరిశోధకులు.

మరోవైపు 2007 సంవత్సరంలో కూడా సరిగ్గా ఇలాగే జరిగిందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. అప్పుడు విశ్వం నుంచి దాదాపు ఎనిమిది రకాల వేర్వేరు సంకేతాలు (ఎఫ్ఆర్బీలు) సిగ్నల్స్ నమోదయ్యాయి. కాగా ఆ సంకేతాల వెనక రహస్యం ఏంటన్నది డీకోడ్ చేయలేకపోయారు.

Follow Us
పట్టాలపై తాగుబోతు..చివరి నిమిషంలో చూసిన డ్రైవర్‌! ఆ తర్వాత
పట్టాలపై తాగుబోతు..చివరి నిమిషంలో చూసిన డ్రైవర్‌! ఆ తర్వాత
సత్యసాయి గ్రామంలో ముగిసిన అంతర్జాతీయ విలువల విద్యా సదస్సు..
సత్యసాయి గ్రామంలో ముగిసిన అంతర్జాతీయ విలువల విద్యా సదస్సు..
నిరసనల మధ్య మానవత్వం.. జవాన్లకు పిజ్జా పంచిన యువకుడు!
నిరసనల మధ్య మానవత్వం.. జవాన్లకు పిజ్జా పంచిన యువకుడు!
కరకరలాడే పనీర్ టిక్కా తినాలని ఉందా?.. సింపుల్ రెసిపీ
కరకరలాడే పనీర్ టిక్కా తినాలని ఉందా?.. సింపుల్ రెసిపీ
భార్య పేరు మీద నెలకు రూ.8,000 జమ చేస్తే ఐదేళ్లలో ఎంత వస్తుంది?
భార్య పేరు మీద నెలకు రూ.8,000 జమ చేస్తే ఐదేళ్లలో ఎంత వస్తుంది?
చిన్నారులతో సరదాగా గడిపిన మంచు లక్ష్మి.. వీడియో
చిన్నారులతో సరదాగా గడిపిన మంచు లక్ష్మి.. వీడియో
వామ్మో.. ఆ వయసులో ఈ తిండి తింటే ప్రాణాలకే ప్రమాదం..!
వామ్మో.. ఆ వయసులో ఈ తిండి తింటే ప్రాణాలకే ప్రమాదం..!
పుట్టగొడుగులు త్వరగా పాడవుతున్నాయా.. ఇలా చేస్తే రోజుల పాటు..
పుట్టగొడుగులు త్వరగా పాడవుతున్నాయా.. ఇలా చేస్తే రోజుల పాటు..
రోజూ అతిగా ప్రొటీన్ షేక్స్, చికెన్ తింటున్నారా?..సైడ్ ఎఫెక్ట్స్
రోజూ అతిగా ప్రొటీన్ షేక్స్, చికెన్ తింటున్నారా?..సైడ్ ఎఫెక్ట్స్
ఫోటోగ్రఫీపై ప్రేమ..ఇంటినే కెమెరాగా మార్చేశాడు..! పిల్లలకు సైతం
ఫోటోగ్రఫీపై ప్రేమ..ఇంటినే కెమెరాగా మార్చేశాడు..! పిల్లలకు సైతం