AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral Video: చిన్న చేతులు.. పెద్ద మనసు.. పిల్లలు పిల్లిని ఎలా కాపాడారో చూస్తే ఫిదా అవ్వాల్సిందే..

చిన్న చేతులు.. ఎంతో పెద్ద మనసు.. మూగజీవి కష్టాన్ని చూసి చలించిపోయిన ఇద్దరు చిన్నారులు చేసిన పని ఇప్పుడు ఇంటర్నెట్‌ను షేక్ చేస్తోంది. పైకప్పు నుంచి దిగలేక అల్లాడుతున్న పిల్లిని కాపాడేందుకు ఆ పిల్లలు వేసిన ప్లాన్ చూసి పోలీసులు సైతం ఫిదా అయ్యారు. ఇంకెందుకు ఆలస్యం ఆ వీడియోను మీరే చూడండి..

Viral Video: చిన్న చేతులు.. పెద్ద మనసు.. పిల్లలు పిల్లిని ఎలా కాపాడారో చూస్తే ఫిదా అవ్వాల్సిందే..
Kids Rescue Cat Viral Video
Krishna S
|

Updated on: Aug 28, 2026 | 2:39 PM

Share

నేటి యాంత్రిక సమాజంలో మానవత్వం మసకబారుతోంది. రోడ్డుపై ఎవరికైనా ప్రమాదం జరిగినా, ఆపదలో ఉన్నవారిని కాపాడటం కంటే.. చేతిలోని స్మార్ట్‌ఫోన్లతో వీడియోలు తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేసేవారే ఎక్కువైపోయారు. ఇతరుల కష్టాలను చూసి ముఖం చాటేసే స్వార్థపూరిత లోకంలో.. ఇద్దరు చిన్నారులు చూపిన దయ, చాకచక్యం సమాజానికి కనువిప్పు కలిగిస్తోంది. ఇంటి పైకప్పుపై చిక్కుకుపోయిన ఓ చిన్న పిల్లి ప్రాణాలను కాపాడేందుకు ఆ పిల్లలు చేసిన ప్రయత్నం ఇప్పుడు ఇంటర్నెట్‌ను కదిలిస్తోంది. వైరల్ అవుతున్న వివరాల ప్రకారం.. ఒక చిన్న పిల్లి ప్రమాదవశాత్తూ ఇంటి పైకప్పు మీదికి ఎక్కింది. అయితే ఎత్తు ఎక్కువగా ఉండటంతో కిందకు దిగే దారి దొరకక, కింద పడితే ప్రాణాలు పోతాయన్న భయంతో అటూ ఇటూ తిరుగుతూ తీవ్ర ఆందోళన చెందింది. ఆ సమయంలో అక్కడే ఉన్న ఇద్దరు చిన్నారులు ఆ మూగజీవి బాధను గమనించారు. భయపడి పారిపోకుండా లేదా చూసి ఊరుకోకుండా దాన్ని రక్షించాలని నిర్ణయించుకున్నారు.

ఒక బాలుడు వెంటనే ఒక పొడవైన బల్లను పైకప్పుకు ఆనించి, పిల్లి దానిపై నుంచి మెల్లగా దిగేలా ఒక దారిని ఏర్పాటు చేశాడు. మరో బాలుడు ఆ బల్ల చివరన చిన్న ప్లాస్టిక్ బకెట్ పట్టుకుని సిద్ధంగా నిలబడ్డాడు. పిల్లి ఆ బల్లపై నుంచి జారి కింద పడకుండా, నేరుగా బకెట్‌లోకి సురక్షితంగా చేరేలా పట్టుకున్నాడు. పిల్లి క్షేమంగా కిందకు దిగగానే ఆ చిన్నారుల ముఖాల్లో కనిపించిన సంతృప్తి, ఆనందం చూసేవారి మనసులను హత్తుకుంటోంది.

పోలీసుల ప్రశంసలు.. వైరల్ అవుతున్న వీడియో

ఈ హృద్యమైన దృశ్యాలను ఉత్తరాఖండ్ పోలీసులు తమ అధికారిక సోషల్ మీడియా ఖాతాలో పంచుకున్నారు. ‘‘చిన్న చేతులు.. ఎంతో పెద్ద మనసు.. ఆపదలో ఉన్న మూగజీవిని కాపాడేందుకు ఈ పిల్లలు చేసిన ప్రయత్నం మనందరికీ పెద్ద పాఠం నేర్పుతుంది. సహాయం చేయడానికి వయసుతో పనిలేదు.. ఆపదలో ఉన్నవారిని ఆదుకోవాలనే మంచి మనసు ఉంటే చాలు” అని పోలీసులు తెలిపారు. ఈ వీడియో చూసిన నెటిజన్లు ఆ చిన్నారుల సమయస్ఫూర్తిని, దయాగుణాన్ని మెచ్చుకుంటున్నారు.

వీడియో చూడండి..

Follow Us