Groom Dance: ఈ వరుడి డ్యాన్స్‌ చూశారంటే పొట్ట చెక్కలే..! మనోడి ఊపుడు మామూలుగా లేదులేండి..

|

May 22, 2022 | 6:15 PM

ప్రస్తుతం పెళ్లిలలో వధూవరులు డ్యాన్స్ చేయడం ట్రెండ్‌గా మారింది. కొత్త పెళ్లికొడుకు, పెళ్లి కూతురు ఈ మధ్య పెళ్లి వేడుకలో స్టెప్స్ వేస్తూ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నారు. అలాంటి వీడియోలు..

Groom Dance: ఈ వరుడి డ్యాన్స్‌ చూశారంటే పొట్ట చెక్కలే..! మనోడి ఊపుడు మామూలుగా లేదులేండి..
Bridegroom
Follow us on

ప్రస్తుతం పెళ్లిలలో వధూవరులు డ్యాన్స్ చేయడం ట్రెండ్‌గా మారింది. కొత్త పెళ్లికొడుకు, పెళ్లి కూతురు ఈ మధ్య పెళ్లి వేడుకలో స్టెప్స్ వేస్తూ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నారు. అలాంటి వీడియోలు ఈ మధ్య సోషల్ మీడియాలో బాగా ట్రెండ్ అవుతున్నాయి. పెళ్లిలో సంగీత్, మోహందీ ఫక్షన్‌ వంటి కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉంటారు. ఇక ఈ వీడియో కూడా అలాంటిదే. ఓ యువకుడు కూడా తన పెళ్లిలో.. అంతే డ్యాన్స్ వేయాలని అనుకున్నాడు. డీజే పెట్టడంతో.. ఆనందంతో చిందులు వేశాడు. అతడు చేసిన డ్యాన్స్‌ చూసి చుట్టుపక్కల ఉన్నవారంతా ఒక్కసారిగా అవాకయ్యారు. ఇదేం ఊపుడురా నాయనా అంటూ అందరూ పగలబడి నవ్వుకున్నారు.
పెళ్లి ఊరేగింపులో వరుడు వేసిన డ్యాన్స్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.పెళ్లి కొడుకు జోష్ మామాలుగా లేదండోయ్ అంటూ నెటిజన్లు ఫన్నీ కామెంట్స్‌ చేస్తున్నారు. పెళ్లి కొడుకు వేసే స్టెప్స్‌ బాడి షేక్ చేస్తున్న స్టైల్‌ చూసి షాక్‌ అవుతున్నారు.

వీడియోలో పెళ్లి దుస్తుల్లో ఉన్న వరుడు సహా బంధువులతో ఊరేగింపుగా వెళ్తున్నారు. డీజే పాటలతో హోరెత్తిస్తున్నారు సౌండ్‌ సిస్టమ్‌ సిబ్బంది..ఇంతలోనే కొందరు స్నేహితులు అతన్ని రెండు స్టెప్పులు వేయాలని అడిగారు. మాంచి ఊపిచ్చే భోజ్‌పూరీ పాటను ప్లే చేయడంతో వరుడిలో డ్యాన్సర్‌ బయటకు వచ్చాడు. ఫుల్‌ బాడీని షేక్‌ చేస్తూ స్టెప్పులతో ఇరగదీశాడు. అది చూసిన ఫ్రెండ్స్‌, బంధువులు ‘వన్స్ మోర్’ అంటూ విజిల్స్‌ వేయటం మనం వీడియోలో చూడొచ్చు..దానికి ఫుల్‌ జోష్‌లో ఉన్న వరుడు ఇంకోసారి అదే స్టెప్ వేసి మరింత ఊపేశాడు. వీడియో కాస్త ఇంటర్‌ నెట్‌లో చేరటంతో వైరల్‌గా మారింది.

ఇవి కూడా చదవండి

ఈ వీడియో చూసిన చాలామంది నెటిజన్లు  వరుడి డ్యాన్స్‌కు ఫిదా అవుతున్నారు. భలేగా ఊపేశావ్ బాస్‌ అంటూ పొగడ్తల వర్షం కురిపిస్తున్నారు. ఇంకొందరైతే,..షకీరా డ్యాన్స్‌ కూడా నీ ముందు దిగదుడుపే భాయ్‌ అంటూ కామెంట్లు చేస్తున్నారు.