Viral Video: వర్షంలో ఈ పాప చేసిన పని చూస్తే మీ చిన్ననాటి రోజులు గుర్తురావడం ఖాయం.. ఓ లుక్కెయ్యండి..

|

Oct 25, 2021 | 9:54 AM

వర్షాన్ని ఇష్టపడని వారుండరు. వర్షంలో తడవాలని.. గంతులేయాలని ఉన్నా.. పెద్దవారు కాస్తా సంకోచిస్తుంటారు. కానీ చిన్న పిల్లలకు

Viral Video: వర్షంలో ఈ పాప చేసిన పని చూస్తే మీ చిన్ననాటి రోజులు గుర్తురావడం ఖాయం.. ఓ లుక్కెయ్యండి..
Viral
Follow us on

వర్షాన్ని ఇష్టపడని వారుండరు. వర్షంలో తడవాలని.. గంతులేయాలని ఉన్నా.. పెద్దవారు కాస్తా సంకోచిస్తుంటారు. కానీ చిన్న పిల్లలకు అవేం పట్టవు.. జోరుగా కురుస్తున్న వర్షంలో తడిసిపోవాలని.. అందులో ఆడుకోవాలనుకుంటారు.. కానీ అమ్మకు భయపడి ఒక్కక్షణం ఆలోచించి ఇంట్లోనే ఉండిపోతారు.. కానీ ఓ చిన్నారి మాత్రం వర్షంలో రోడ్డుపై ఉన్న బురదలో తెగ గంతులేస్తూ తెగ ఎంజాయ్ చేస్తుంది. ఈ వీడియో చూస్తే మీ చిన్ననాటి రోజులు గుర్తుకు రావడం ఖాయం.

ఆ వీడియోలో వర్షం పడుతుండగా.. ఓ వీధిలో ఎవరి పని వారు చేసుకుంటూ.. ఎవరి దారిన వారు వెళ్తుంటారు.. కానీ ఓ చిన్నారి మాత్రం.. అక్కడ ఉన్న వర్షపు నీటిని చూసి ఉండలేకపోయింది. వెంటనే అందులో ఆడుకోవాలని నిశ్చయించుకుంది. అనుకున్నదే తడవుగా వెళ్లి ఆ వర్షపు నీటిలో కూర్చుని తెగ సంతోషపడిపోయింది. కేరింతలు కొడుతూ.. అటూ ఇటూ పరుగెడుతూ తెగ ఎంజాయ్ చేసింది. ఆనందంతో ఆ చిన్నారి ఆడుకుంటుండగా.. అక్కడున్న వారు ఎవరు ఆ చిన్నారిని ఆపే ప్రయత్నం మాత్రం చేయలేదు.. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. ఆ వీడియో నెటిజన్స్.. తమ బాల్యం గుర్తుకు వస్తుందంటూ కామెంట్స్ చేస్తున్నారు..

వీడియో..

Also Read:  Rajini Kanth: ఈరోజు దాదా సాహెబ్ ఫాల్కే అవార్డు అందుకోనున్న రజినీకాంత్.. అయినా తలైవా మనసులో బాధే ఎందుకో..

ఎన్టీఆర్-కొరటాల శివ సినిమా నుంచి ఇంట్రెస్టింగ్ అప్డేట్.. ఆసక్తికర విషయాలను చెప్పిన డైరెక్టర్..

Bigg Boss 5 Telugu: సన్నీతో గొడవే ఆమె కొంపముంచిందా ?.. ఒక్కరోజు ప్రియ ప్రవర్తనకు సీన్ రివర్స్..