AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

గేమింగ్ క్రియేటర్ కు షాక్.. భార్యకు రూ.18 వేల కోట్ల భరణం చెల్లించాలని కోర్టు తీర్పు !

దక్షిణ కొరియాకు చెందిన ప్రముఖ గేమింగ్ కంపెనీ స్మైల్‌గేట్  వ్యవస్థాపకుడు, దేశంలోని అత్యంత సంపన్నులలో ఒకరైన క్వాన్ హ్యుక్-బిన్ తన మాజీ భార్యకు విడాకుల సెటిల్‌మెంట్‌ కింద ఏకంగా రూ.18 వేల కోట్ల విలువైన ఆస్తులను చెల్లించాలని ఆ దేశ కోర్టు ఆదేశించింది. సౌత్ కొరియా చరిత్రలోనే ఇది అతి పెద్ద విడాకుల సెటిల్‌మెంట్‌గా రికార్డు సృష్టించింది. బ్లూమ్‌బెర్గ్ అంచనా ప్రకారం క్వాన్ నికర విలువ $3 బిలియన్లుగా ఉంది. 

గేమింగ్ క్రియేటర్ కు షాక్.. భార్యకు రూ.18 వేల కోట్ల భరణం చెల్లించాలని కోర్టు తీర్పు !
Gaming Tycoon To Pay Ex Wife Billions In South Korea Divorce Settlement
Sharada V
|

Updated on: Sep 10, 2026 | 9:18 PM

Share

బుధవారం వరకు స్మైల్‌గేట్ కంపెనీ పూర్తిగా క్వాన్ హ్యుక్-బిన్ కంట్రోల్‌లోనే ఉండేది. కానీ కోర్టు తీర్పుతో ఆ సీన్ పూర్తిగా మారిపోయింది. కంపెనీలోని 35 శాతం వాటాను ఆయన మాజీ భార్య లీ హ్వా-జిన్ పేరున బదిలీ చేయాలని కోర్టు ఆర్డర్ వేసింది. ఈ షేర్లతో పాటు అదనంగా మరో 65 బిలియన్ల వోన్లను క్యాష్ రూపంలో తన మాజీ భార్యకు చెల్లించాలని కోర్టు స్పష్టం చేసింది. ఈ కోర్టు  తీర్పు కొరియా కార్పొరేట్ ప్రపంచంలో  ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది!

కోర్టులో విడాకుల పిటిషన్ దాఖలు చేసిన సమయంలో క్వాన్ మాజీ భార్య లీ హ్వా-జిన్.. స్మైల్‌గేట్ కంపెనీలో ఏకంగా 50 శాతం వాటా కావాలని డిమాండ్ చేశారు. కంపెనీ తొలి రోజుల్లో తాను కూడా ఆర్థికంగా సపోర్ట్ చేశానని, కంపెనీ అభివృద్ధి వెనుక తన పాత్ర ఉందని ఆమె లాయర్లు కోర్టులో వాదించినట్లు బ్లూమ్‌బెర్గ్ రిపోర్ట్ పేర్కొంది. బిజినెస్ సక్సెస్‌లో లైఫ్‌ పార్ట్‌నర్ కష్టానికి గుర్తింపుగా కోర్టు ఫైనల్‌గా ఆమెకు భారీ మొత్తంలో వాటాను దక్కేలా సంచలన తీర్పు ఇచ్చింది!

అయితే తన మాజీ భార్య లీ హ్వా-జిన్ కంపెనీలో ఎలాంటి పెట్టుబడులు పెట్టలేదని, అసలు కంపెనీ కోసం ఎలాంటి పనీ చేయలేదని క్వాన్ తరపు న్యాయవాదులు కోర్టులో వాదించారు. ఈ ఏడాది జనవరిలో స్మైల్‌గేట్ కంపెనీ ఒక స్టేట్‌మెంట్ విడుదల చేస్తూ, కంపెనీకి సంబంధించిన ప్రారంభ మూలధనం పూర్తిగా క్వాన్‌దేనని స్పష్టం చేసింది. క్వాన్, లీ ఇద్దరూ 2001లో వివాహం చేసుకున్నారు. ఒక సంవత్సరం తర్వాత 2002లో క్వాన్ ‘స్మైల్‌గేట్’ ను  స్థాపించారు.  కంపెనీ రూపొందించిన గేమ్‌లలో  ప్రపంచ వ్యాప్తంగా ఫేమస్ అయినవి చాలా ఉన్నాయి. వాటిలో  ఫస్ట్-పర్సన్ షూటర్ గేమ్‌ ‘క్రాస్‌ఫైర్’ , యాక్షన్ రోల్-ప్లేయింగ్ గేమ్‌  ‘లాస్ట్ ఆర్క్’ వంటివి ఎంతగానో పాపులర్ అయ్యాయి.  ఒకప్పుడు గేమింగ్ పరిశ్రమలో సెన్సేషన్ సృష్టించిన ఈ గేమింగ్ కపుల్  లవ్‌స్టోరీ ఇప్పుడు విడాకుల రూపంలో వార్తల్లో నిలిచింది!

ఫ్యామిలీ లైఫ్‌కు అంకితం

 కంపెనీని భర్త చూసుకుంటూ ఉండగా  తను దాదాపు 20 ఏళ్ల పాటు పిల్లలను పెంచడం, ఇంటి బాధ్యతలపై దృష్టి పెట్టినట్లు లీ హ్వా-జిన్ కోర్టుకు తెలిపారు. ఇంటిని, పిల్లలను ఒంటి చేత్తో మేనేజ్ చేసి భర్తకు సపోర్ట్ చేశానని ఆమె కోర్టులో తెలిపినట్లు  బ్లూమ్‌బెర్గ్ వెల్లడించింది.

సౌత్ కొరియా చరిత్రలోనే బిగ్గెస్ట్ డైవర్స్ సెటిల్‌మెంట్‌గా సంచలనం సృష్టించింది ఈ తీర్పు. కోర్టు తీర్పుపై ఇరువర్గాలు సంతృప్తి చెందని సందర్భంలో సుప్రీంకోర్టును ఆశ్రయించే అవకాశం ఉంది. ఈ తీర్పును సవాలు చేసే వెసులుబాటు ఇరుపక్షాలకు ఉండటంతో.. ఈ హై-ప్రొఫైల్ గేమింగ్ బిలియనీర్ విడాకుల వివాదం ముందు ముందు ఎలాంటి టర్న్ తీసుకుంటుందనే దానిపై టెక్, కార్పొరేట్ వర్గాల్లో తీవ్ర ఆసక్తి నెలకొంది!

Follow Us
గేమింగ్ సంస్థ అధిపతికి షాక్..భార్యకు రూ.18 వేల కోట్ల భరణం!
గేమింగ్ సంస్థ అధిపతికి షాక్..భార్యకు రూ.18 వేల కోట్ల భరణం!
పుతిన్, షీ జిన్‌పింగ్‌ బ్రిక్స్ షెడ్యూల్ ఇదే!
పుతిన్, షీ జిన్‌పింగ్‌ బ్రిక్స్ షెడ్యూల్ ఇదే!
ఇలా చేస్తే ఆఫీస్ స్ట్రెస్ నుంచి వెంటనే రిలీఫ్.. !
ఇలా చేస్తే ఆఫీస్ స్ట్రెస్ నుంచి వెంటనే రిలీఫ్.. !
బెర్త్‌పైనే బిర్యానీ బ్యాచ్.. చికెన్ విందుతో మహిళ హల్‌చల్..
బెర్త్‌పైనే బిర్యానీ బ్యాచ్.. చికెన్ విందుతో మహిళ హల్‌చల్..
7 ఫోర్లు, 3 సిక్స్‌లు.. హాఫ్ సెంచరీతో లేడీ సెహ్వాగ్ బీభత్సం
7 ఫోర్లు, 3 సిక్స్‌లు.. హాఫ్ సెంచరీతో లేడీ సెహ్వాగ్ బీభత్సం
హీరో కార్తీతో ఉన్న ఈ అమ్మాయిని గుర్తు పట్టారా? ఇంతలా మారిపోయిందా?
హీరో కార్తీతో ఉన్న ఈ అమ్మాయిని గుర్తు పట్టారా? ఇంతలా మారిపోయిందా?
కేవలం రూ.88కే బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్..200Mbps ఇంటర్నెట్‌..26 OTTలు
కేవలం రూ.88కే బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్..200Mbps ఇంటర్నెట్‌..26 OTTలు
టిఫిన్స్‌లోకి అదిరిపోయేలా పల్లీల చట్నీ.. సింపుల్‌గా ఎలా చేయాలంటే?
టిఫిన్స్‌లోకి అదిరిపోయేలా పల్లీల చట్నీ.. సింపుల్‌గా ఎలా చేయాలంటే?
వాల్ నట్స్ కొంటున్నారా?పెంకు పగలకుండానే నాణ్యమైనవి గుర్తించండిలా?
వాల్ నట్స్ కొంటున్నారా?పెంకు పగలకుండానే నాణ్యమైనవి గుర్తించండిలా?
ఉల్లిపాయ, పచ్చిమిర్చితో 2 నిమిషాల్లో పచ్చి ఉల్లి పచ్చడి
ఉల్లిపాయ, పచ్చిమిర్చితో 2 నిమిషాల్లో పచ్చి ఉల్లి పచ్చడి