AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Personality Test: మీ పాదాల ఆకారాన్ని బట్టి.. మీ క్యారెక్టర్ ఎలాంటిదో తెలుసుకోవచ్చు..! ఎలా అంటే?

సాధారణంగా మనం ఒక వ్యక్తి గురించి తెలుసుకోవాలి అంటే జ్యోతిష్యం, లేదా హస్త్రముద్రికం ద్వారా తెలుసుకుంటాం. కానీ సాముద్రిక శాస్త్రం ప్రకారం, మన శరీర భాగాలు కూడా మన స్వభావాన్ని తెలియచేస్తాయని మీకు తెలుసా? కాబట్టి ఒక వ్యక్తి పాదాల వంపును అతని వ్యక్తిత్వం గురించి ఏమి చెబుతుందో ఇక్కడ తెలుసుకుందాం.

Personality Test: మీ పాదాల ఆకారాన్ని బట్టి.. మీ క్యారెక్టర్ ఎలాంటిదో తెలుసుకోవచ్చు..! ఎలా అంటే?
Foot Arch Personality Test
Anand T
|

Updated on: Apr 09, 2026 | 1:14 PM

Share

మనం ఒక వ్యక్తి గురించి తెలుసుకోవాలంటే వారితో కొద్ది మాట్లాడితే వారు ఎలాంటి వారు అని అర్థం అవుతంది. లేదంటే జోతిష్యం శాస్త్రంలో వారి జాతకాన్ని బట్టి వారి స్వభావాన్ని తెలుసుకోవచ్చు. కానీ మన శరీర భాగాలు కూడా మన స్వభావాన్ని, మన వ్యక్తిత్వాన్ని తెలియజేస్తాయని చాలా మందికి తెలియదు. ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకుని, ఈ రోజు మనం పాద వంపు వ్యక్తిత్వ పరీక్ష గురించి తెలుసుకోబోతున్నాం. అంటే ఒకరి పాదం ఉండే ఆకారాన్ని బట్టి వారి వ్యక్తిత్వ లక్షణాలు ఎలా ఉంటాయో తెలుసుకోవచ్చు. కాబట్టి మీ పాదం ఆకారం ఏమిటో, మీ వ్యక్తిత్వం ఎలాంటిదో ఇప్పుడు చూద్దాం.

మీ పాదం ఆకారాన్ని బట్టి మీ వ్యక్తిత్వం ఎలాంటిదో తెలుసుకోండి.

చదునైన పాదాలు కలిగిన వ్యక్తి: మీ పాదాలు నేలకు సమాంతరంగా, వంపు లేకుండా ఉంటే మీరు అందరితో కలిసి ఉండటానికి ఇష్టపడే వ్యక్తులు అని అర్థం. అలాగే ఒంటరిగా ఉండటం కంటే స్నేహితులు, కుటుంబ సభ్యులతో గడపడానికే వీరు ప్రాధాన్యత ఇస్తారు. అంతేకాదు ఇలాంటి వ్యక్తులు చాలా ప్రాక్టికల్ గా ఆలోచిస్తారు. భావోద్వేగాల కంటే వాస్తవాలకు ఎక్కువ వ్యాల్యూ ఇస్తారు. ఇస్తారు. ఇలాంటి పాదాలు కలిగిన వ్యక్తులు ఇతరుల పట్ల దయ, సానుభూతిని కలిగి ఉంటారు. అవతలి వారి బాధను సులభంగా అర్థం చేసుకోగలరు. వీరు అందరితో కలిసి పనిచేయడానికి ఇష్టపడతారు.

ఎత్తైన వంపు ఉన్న పాదాలు కలిగిన వ్యక్తులు: మీ పాదాలకు మధ్యలో ఎక్కువ వంపు ఉంటే మీరు ఎవరిపైనా ఆధారపడటానికి ఇష్టపడని వ్యక్తి అని అర్థం. ఇలాంటి వ్యక్తులు వారి పనులు వారు చేసుకునేందుకే ఎక్కవగా ఇష్టపడుతారు. మీరు ఏ విషయాన్నైనా తోలుతా ఆలోచించి నిర్ణయం తీసుకుంటారు. అలాగే మీ ట్యాలెంట్‌ను మీరు ఎక్కువగా నమ్ముతారు. మీరు కొత్తవారితో కలవడానికి కొంచెం సమయం తీసుకుంటారు. మీకంటూ ఒక సొంత ప్రపంచాన్ని నిర్మించుకుని, అందులో ఉండటాన్ని ఇష్టపడతారు. మీకు పెద్ద కలలు ఉంటాయి. మీకంటూ ఒక ప్రత్యేకమైన మార్గాన్ని ఎంచుకుని, దానిలో విజయం సాధించడానికి కష్టపడతారు.

Note: పైన పేర్కొన్న అంలశాలు కేవలం నమ్మకాలు, ఇంటర్నెట్ లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా అందించబడినవి.. ఒక వ్యక్తి వ్యక్తిత్వం అనేది వారి పెరిగిన వాతావరణం, అనుభవాలపై ఆధారపడి ఉంటుంది. వీటిని TV9 దృవీకరించడం లేదు. వీటిపై మీకు సందేహాలు ఉంటే నిపుణులను సంప్రదించవచ్చు)

మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us
గ్లాస్గోలో మీరాబాయి చాను విశ్వరూపం..
గ్లాస్గోలో మీరాబాయి చాను విశ్వరూపం..
20 ఏళ్లు దాటిన మహిళల్లో పెరుగుతున్న భయం.. ఈ లక్షణాలు కనిపిస్తే..
20 ఏళ్లు దాటిన మహిళల్లో పెరుగుతున్న భయం.. ఈ లక్షణాలు కనిపిస్తే..
NTA సంస్కరణల కోసం హై-పవర్డ్ కమిటీ.. టీమ్‌లో ఉన్నది వీళ్లే..
NTA సంస్కరణల కోసం హై-పవర్డ్ కమిటీ.. టీమ్‌లో ఉన్నది వీళ్లే..
విషపూరితమైన ఈ ఆకు ఘుమఘుమలాడే బిర్యానీలో ఎందుకు వేస్తారు?
విషపూరితమైన ఈ ఆకు ఘుమఘుమలాడే బిర్యానీలో ఎందుకు వేస్తారు?
తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు.. ఇదిగో లేటెస్ట్ వెదర్ రిపోర్ట్
తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు.. ఇదిగో లేటెస్ట్ వెదర్ రిపోర్ట్
బాలయ్యను పరామర్శించిన సీఎం చంద్రబాబు.. డాక్టర్లు ఏమంటున్నారంటే?
బాలయ్యను పరామర్శించిన సీఎం చంద్రబాబు.. డాక్టర్లు ఏమంటున్నారంటే?
చిన్న ముక్కతో ఆరోగ్యం.. వంటింటి మసాలా కాదు ఆరోగ్యానికి సహజ ఔషధం!
చిన్న ముక్కతో ఆరోగ్యం.. వంటింటి మసాలా కాదు ఆరోగ్యానికి సహజ ఔషధం!
హ్యాట్రిక్ విక్టరీ.. సిరీస్ క్లీన్‌స్వీప్ చేసిన భారత్..
హ్యాట్రిక్ విక్టరీ.. సిరీస్ క్లీన్‌స్వీప్ చేసిన భారత్..
బంగారం కొనాలా వద్దా? శ్రావణ మాసంలో ధర తగ్గుతుందా? పెరుగుతుందా?
బంగారం కొనాలా వద్దా? శ్రావణ మాసంలో ధర తగ్గుతుందా? పెరుగుతుందా?
ఆ జబర్దస్త్ నటుడి పేరును మా ఫోన్‌లో 'గాడ్' అని సేవ్ చేసుకున్నాం
ఆ జబర్దస్త్ నటుడి పేరును మా ఫోన్‌లో 'గాడ్' అని సేవ్ చేసుకున్నాం