Viral Video : నువ్వు అడవికి రాజైతే నాకేంటి.. సింహాలకు చుక్కలు చూపించిన ఏనుగు..

|

Mar 18, 2022 | 5:40 PM

ప్రస్తుతం ఉన్న ఉరుకుల పరుగుల జీవితంలో సోషల్ మీడియా కూడా ఓ భాగం అయ్యింది. సోషల్ మీడియాలో ఎప్పటికప్పుడు రకరకాల విచిత్రమైన వీడియోలు బాగా పాపులర్ అవుతుండడం మనకు తెలిసిందే.

Viral Video : నువ్వు అడవికి రాజైతే నాకేంటి.. సింహాలకు చుక్కలు చూపించిన ఏనుగు..
Viral
Follow us on

Viral Video : ప్రస్తుతం ఉన్న ఉరుకుల పరుగుల జీవితంలో సోషల్ మీడియా కూడా ఓ భాగం అయ్యింది. సోషల్ మీడియాలో ఎప్పటికప్పుడు రకరకాల విచిత్రమైన వీడియోలు బాగా పాపులర్ అవుతుండడం మనకు తెలిసిందే. ఈ మధ్య కాలంలో జంతు వీడియోలు బాగా పాపులర్ అవుతున్నాయి. జంతువుల వీడియోలు సోషల్ మీడియాలో ఎప్పుడూ వైరల్ అవుతూనే ఉంటాయి. ఈ వీడియోలలో మీరు కొన్నిసార్లు జంతువులు పోరాడడాన్ని చూడవచ్చు.. కొన్నిసార్లు అవి ఒకరినొకరు ప్రేమించుకోవడం చూడొచ్చు. ఈ రోజు ప్రజలు జంతువులు మరియు పక్షుల వీడియోలను చూడటానికి ఎక్కువ ఆసక్తి చూపుతున్నారు. అలాంటి ఆసక్తికరమైన వీడియో ఒకటి ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ వీడియో నెటిజన్లను విపరీతంగా ఆకట్టుకుంటోంది. సింహాలను చూస్తే ఎలాంటి జంతువైనా భయపడాల్సిందే.. అలంటి సింహాలను హడలెత్తించాయి ఏనుగులు. తిన్న తర్వాత విశ్రాంతి తీసుకుంటున్న సింహాల మందపైకి కోపంగా దూసుకువచ్చాయి ఏనుగులు. వాటిలో ఒక ఏనుగు మాత్రం కోపంతో ఊగుతూ.. సింహళ మంద మీదకు దూసుకువెళ్లింది. దాంతో బెదిరిపోయిన సింహాలు పరుగందుకున్నాయి.  ఇప్పుడు ఈవీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. ఈ వీడియో పై నెటిజన్లు రకరకాల కామెంట్లు కురిపిస్తున్నారు. పెత్తనం ఎవడి సొత్తు కాదు అని కొందరు.. సింహం, ఏనుగు రెండింటిలో ఏది నిజమైన రాజు అంటూ.. కామెంట్స్ చేస్తున్నారు . ఈ వీడియో పై మీరూ ఓ లుక్కేయండి.

మరిన్ని ఇక్కడ చదవండి : 

Kashmir Files: కశ్మీర్‌ ఫైల్స్‌ చిత్ర దర్శకుడికి భద్రత పెంపు.. వై క్యాటగిరీ కల్పిస్తూ అధికారుల నిర్ణయం..

Prabhas: మారుతి సినిమాకు ప్రభాస్‌ అన్ని కోట్లు తీసుకుంటున్నారా.? రోజుకు ఏకంగా కోటి రూపాయల పైమాటే..

Bheemla Nayak Aha: ఆహాలో పవర్ స్ట్రోమ్.. స్ట్రీమింగ్‏కు సిద్ధమైన బ్లాక్ బస్టర్ భీమ్లా నాయక్..