Viral Video: సింహం వేట ఇంత భయంకరంగా ఉంటుందా.. ఏనుగు పిల్ల పై దాడి చేసిన మృగరాజు.. చూస్తే షాక్ అవుతారు

|

May 11, 2022 | 5:52 PM

వన్యప్రాణుల వీడియోలు తరచుగా సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతూనే ఉంటాయి. సాధారణంగా సింహాలు, ఏనుగులు, మొసళ్లకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంటాయి.

Viral Video: సింహం వేట ఇంత భయంకరంగా ఉంటుందా.. ఏనుగు పిల్ల పై దాడి చేసిన మృగరాజు.. చూస్తే షాక్ అవుతారు
Viral Video
Follow us on

Viral Video: వన్యప్రాణుల వీడియోలు తరచుగా సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతూనే ఉంటాయి. సాధారణంగా సింహాలు, ఏనుగులు, మొసళ్లకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంటాయి. తాజాగా జంతువులకు సంబంధించిన ఓ వీడియో తెగ వైరల్ అవ్వుతోంది. సాధారణంగా చిన్న జంతువులను సింహాలు వేటాడుతూ ఉంటాయి. చిన్న వాటినే కాదు అప్పుడప్పుడు తమకన్నా పెద్ద వాటి పై కూడా ఇవి దాడి చేస్తుంటాయి. ఇప్పుడు అలాంటి వీడియో ఒకటి సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. ఓ ఏనుగుపై సింహం దాడి చేసిన వీడియో వైరల్ అవుతోంది. ఒంటరిగా ఉన్న ఏనుగు పై ఓ సింహం ఉన్నట్టుండి దాడి చేసింది. వీడియో చూస్తే మీరు నిజంగా షాక్ అవుతారనడంలో సందేహం లేదు.

సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ వీడియోలో, అడవిలో ఏనుగు పిల్ల ఒంటరిగా నడుచుకుంటూ వెళ్తుంది.  అప్పుడు హఠాత్తుగా ఒక సింహం వచ్చి ఏనుగుపై దాడి చేస్తుంది.. వెనుక నుంచి జరిగిన దాడితో ఏనుగు ఒక్కసారిగా షాక్ అయ్యింది. సింహం దాడి చేయడంతో ఆ ఏనుగు పిల్ల అక్కడే పడిపోయింది.. ఏనుగు పిల్లను సింహం దాడి చేసి చంపడం వీడియోలో మనం చూడవచ్చు. ఈ వీడియో బ్యూటీ.వైల్డ్ లైఫ్ ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ద్వారా వైరల్‌గా మారింది. ఈ వీడియోకు చాలా కామెంట్స్ వచ్చాయి. ఈ వీడియోకి ఇప్పటి వరకు 1.1 మిలియన్ వ్యూస్ , 8,000 పైగా లైక్‌లు వచ్చాయి.

మరిన్ని ఇక్కడ చదవండి : 

Upasana Konidela: ఉపాసన కొణిదెలకు కోవిడ్ పాజిటివ్.. మానసికంగా ధైర్యంగా ఉన్నానంటూ పోస్ట్..

Sarkaru Vaari Paata First Review: సర్కారు వారి పాట ఫస్ట్ రివ్యూ.. స్క్రీన్ పై సింహాంలా గర్జించిన మహేష్..

Viral Photo: పున్నమి వెన్నెల లాంటి నవ్వు.. రెండు జడల గులాబీ చిన్నారి.. కుర్రాళ్ళని తన మాయలో ముంచేసింది.. గుర్తుపట్టండి..

ఇవి కూడా చదవండి