Bats In Dreams : కలలో గబ్బిలం కనిపిస్తే దేనికి సంకేతం…?

|

Nov 05, 2023 | 9:46 PM

ఇలా కల కన్నవారు భవిష్యత్‌లో చేసే పనులు పట్ల అప్రమత్తంగా ఉండాలట. కలను ఒక వార్నింగ్ సైన్ కింద భావించి.. నిర్ణయాలు తీసుకోవాలట.  కలలో గబ్బిలం కనిపిస్తే.. ఉద్యోగం, లేదా వ్యాపారంలో ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉందని.. జాగ్రత్తలు తీసుకోవాలని జ్యోతిష్యులు సూచిస్తున్నారు.

Bats In Dreams : కలలో గబ్బిలం కనిపిస్తే దేనికి సంకేతం...?
Bat
Follow us on

నిద్రపోయిన ప్రతిసారి కలలు వస్తాయి. అందులో కొన్ని గుడ్ డ్రీమ్స్ ఉంటే.. మరికొన్ని బ్యాడ్ డ్రీమ్స్ ఉంటాయి. అయితే తెల్లవారుజూమున వచ్చే కలలు నిజమవుతాయని చాలామంది అంటుంటారు. అయితే స్వప్న శాస్త్రం అనేది కూడా ఒకటి ఉంది. మనకు కలలో ఫలానా వస్తువు లేదా జంతువు లేదా పక్షి కనిపిస్తే… ఏమవుతుంది అనేది ఇందులో రాసి ఉంది. ఈ రోజు కలలో గబ్బిలం కనిపిస్తే ఏమువుతుందో మనం తెలుసుకుందాం. కలలో గబ్బిలాలు కనిపిస్తే మంచిది కాదని స్వప్న శాస్త్రం చెబుతోంది. ఇలా జరిగితే మీకు కొన్ని చెడు పరిణామాలు ఎదురవుతాయని జ్యోతిష్కులు చెబుతున్నారు. అలానే మీరు ఓ వ్యక్తి  గురించి చెడుగా భావించే అవకాశం కూడా ఉంటుదట.

ఇలా కల కన్నవారు భవిష్యత్‌లో చేసే పనులు పట్ల అప్రమత్తంగా ఉండాలట. కలను ఒక వార్నింగ్ సైన్ కింద భావించి.. నిర్ణయాలు తీసుకోవాలట.  కలలో గబ్బిలం కనిపిస్తే.. ఉద్యోగం, లేదా వ్యాపారంలో ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉందని.. జాగ్రత్తలు తీసుకోవాలని జ్యోతిష్యులు సూచిస్తున్నారు. నీ గమ్యం నిన్ను వదిలి వెళ్లిపోతోందని.. అప్రమత్తత అవసరం అన్నది వారి వెర్షన్.  ఇక కలలో మాంసాహారం తినడం, పామును బంధించడం, చంపడం వంటివి చెడు సంకేతమని చెబుతున్నారు. వెంట్రుకలు, ఎండు గడ్డి, బూడిద,  ఆవు పేడ, విరిగిన పాత్రలు, కలలో మానవ,  జంతువు మృతదేహం కనిపించడం చెడు శుకునం. ఒక వ్యక్తి చిరిగిన, పాత బట్టలతో కలలో తనను తాను చూసుకున్నట్లే.. అది చాలా బ్యాడ్ డ్రీమ్ అట. అలానే కలలో తన శరీరం నుండి చెట్టు పెరగడం చూసినా ఇబ్బందికర పరిస్థితులు తలెత్తే అవకాశం ఉందట. దాని ప్రభావాలను వదిలించుకోవడానికి, సూర్యడ్ని పూజించాలట.

(నోట్: టీవీ9 సంస్థ మూఢనమ్మకాలను ప్రొత్సహించదు. ఇది కేవలం స్వప్న శాస్త్రం, కొందరి జ్యోతిష్యుల వెర్షన్ మాత్రమే అని అర్థం చేసుకోగలరు)

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..