Viral Video: ఎవరైతే నాకేంటి.. కుక్కకు చుక్కలు చూపించిన కప్ప.. భీకర పోరాటంలో గెలిచిందెవరంటే..?

Dog and Frog Fight Video: సోషల్ మీడియా ప్రపంచంలో నిత్యం ఎన్నో రకాల వీడియోలు వైరల్ అవుతుంటాయి. వాటిలో కొన్ని వీడియోలు ఫన్నీగా.. మరికొన్ని ఆశ్చర్యకరంగా ఉంటాయి.

Viral Video: ఎవరైతే నాకేంటి.. కుక్కకు చుక్కలు చూపించిన కప్ప.. భీకర పోరాటంలో గెలిచిందెవరంటే..?
Viral Video

Updated on: Feb 23, 2022 | 9:00 AM

Dog and Frog Fight Video: సోషల్ మీడియా ప్రపంచంలో నిత్యం ఎన్నో రకాల వీడియోలు వైరల్ అవుతుంటాయి. వాటిలో కొన్ని వీడియోలు ఫన్నీగా.. మరికొన్ని ఆశ్చర్యకరంగా ఉంటాయి. వైరల్ అయ్యే (Viral Video) వీడియోల్లో ఎక్కువగా జంతువులకు సంబంధించినవి ఉంటాయి. తాజాగా.. ఓ వింత వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. అదేంటంటే.. కుక్క.. కప్ప మధ్య భీకర పోరు జరిగింది. ఇదేంటి కుక్క.. కప్ప పొట్లాడుకోవడం ఏంటీ..? ఒకవేళ రెండు గొడవ పడినా.. శునకమే గెలుస్తుందని అని ఆలోచిస్తున్నారు కదా.. అయితే మీరు తప్పుగా ఆలోచిస్తున్నట్లే. ఎందుకంటే.. ఈ భీకర పోరులో కప్ప.. కుక్కపై ఆధిపత్యం చెలాయిస్తుంది. సోషల్ మీడియా (Social media) లో వైరల్ అవుతున్న వీడియో చూసి అందరూ ఆశ్చర్యపోతున్నారు.

వైరల్ వీడియోలో.. కప్ప – కుక్క పోట్లాడుకుంటున్నాయి. అయితే.. ఊహించని విధంగా కప్ప.. కుక్కపై ఆధిపత్యం చెలాయిస్తుంది. ఈ వీడియో సోషల్ మీడియాలో చాలా వేగంగా వైరల్ అవుతోంది. ఈ వీడియో చూసిన తర్వాత యూజర్లు ఆశ్చర్యం వ్యక్తంచేస్తూ కామెంట్లు చేస్తున్నారు. ఇంకెంందుకు ఆలస్యం మీరు కూడా ఈ వీడియోను చూడండి..

వైరల్ వీడియో..

ఈ వీడియోను సుశాంతానంద3 అనే ట్విట్టర్ యూజర్ షేర్ చేశారు. దీంతోపాటు కుక్కను ఇబ్బంది పెట్టే కప్ప.. అంటూ ఒక క్యాప్షన్ కూడా రాశారు. ఈ వీడియోను వేలాది మంది వీక్షించి పలు రకాల కామెంట్లు చేస్తున్నారు. ఏదైనా కప్ప తెలివి ముందు కుక్క ఓడిపోయిందంటూ కామెంట్లు వర్షం కురిపిస్తున్నారు.

Also Read:

Watch Video: మళ్లీ విస్ఫోటనం చెందిన ఎట్నా అగ్నిపర్వతం.. ఆ ప్రాంతంలో రెడ్ అలెర్ట్‌.. వీడియో..

Viral Video: సింహంతోనే పరాచకాలా.. ఖబర్దార్.. క్షణాల్లో ప్రాణాలు గాల్లో కలిసిపోతాయ్.!