Viral Video: తాత నువ్వు కేక.. నయా ట్రెండ్ క్రియేట్ చేసిన పెద్దాయన.. స్టైల్ చూస్తే కిక్కెక్కాల్సిందే..

|

Jul 19, 2022 | 8:38 PM

సాధారణ ప్రజల నుంచి విద్యావంతులు వరకు తమ బుర్రలను విభిన్నంగా ఉపయోగించి నెటిజన్లను ఫిదా చేస్తుంటారు. తాజాగా ఓ వృద్ధుడి (Amazing Jugaad Video) కి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.

Viral Video: తాత నువ్వు కేక.. నయా ట్రెండ్ క్రియేట్ చేసిన పెద్దాయన.. స్టైల్ చూస్తే కిక్కెక్కాల్సిందే..
Viral Video
Follow us on

Desi Jugaad Viral Video: దేశీ జుగాద్‌కి సంబంధించిన కొన్ని ఫన్నీ వీడియోలు సోషల్ మీడియాలో నిత్యం వైరల్ అవుతూనే ఉన్నాయి. ఈ జుగాడ్‌ విషయంలో భారతీయులే ఎప్పుడూ కూడా ముందుంటారు. సాధారణ ప్రజల నుంచి విద్యావంతులు వరకు తమ బుర్రలను విభిన్నంగా ఉపయోగించి నెటిజన్లను ఫిదా చేస్తుంటారు. తాజాగా ఓ వృద్ధుడి (Amazing Jugaad Video) కి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. ఇది చూసి నెటిజన్లంతా అవాక్కవుతున్నారు. సాధారణంగా హుక్కా కొట్టాలంటే.. బార్‌లు, పబ్బులు, రెస్టారెంట్లకు వెళ్తారు. కానీ ఈ వీడియోలో ఓ వృద్ధుడు తన తెలివిని ఉపయోగించి మరి హుక్కా కొడుతున్నాడు. అది కూడా అతని స్నేహితులతో కలిసి ఎంజాయ్ చేస్తున్నాడు. థమ్స్అప్ ఖాళీ బాటిల్‌ ద్వారా హుక్కా గుంజుతూ ఎంజాయ్ చేస్తున్నాడు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట తెగ వైరల్ (Viral Video) అవుతోంది.

ముగ్గురు వృద్ధులు ఒకచోట కూర్చొని హుక్కా కొడుతున్న దృశ్యాన్ని ఈ వీడియోలో చూడవచ్చు. (గమనిక: పొగాకు ఆరోగ్యానికి హానికరం) ఈ హుక్కా బాటిల్‌‌ను జుగాద్‌తో తయారు చేశారు. దీని కోసం 500ml శీతల పానీయాల ఖాళీ డబ్బా, చిన్న ప్లాస్టిక్ పైపును ఉపయోగించారు. బాటిల్‌లో హుక్కా ద్రవ్యాన్ని కూడా నింపారు. బాటిల్‌కు చిన్న రంద్రం చేసి.. దానికి పైప్ అమర్చారు. ఈ వీడియో రాజస్థాన్‌కు సంబంధించినదని పేర్కొంటున్నారు.

ఇవి కూడా చదవండి

వైరల్ వీడియో చూడండి..

ఈ వీడియోను ఇన్‌స్టాగ్రామ్‌లో tripho_india_offical అనే పేజీ షేర్ చేయగా.. లక్షలాది మంది వీక్షించి పలు రకాల కామెంట్లు చేస్తున్నారు. ఫ్రెండ్స్ అంతా హుక్కాతో ఎంజాయ్ చేస్తున్నారు.. ఇంతకు మించి ఏం కావాలంటూ పేర్కొంటున్నారు. ఈ ఘటన రాజస్థాన్‌లోని సికర్ జిల్లా ఖండేలాకు చెందినదని పేర్కొంటున్నారు.

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి