మెట్రోలో సీటు కోసం రచ్చ రచ్చ.. ప్రయాణికుడితో మహిళల వాగ్వాదం.. చివరకు..

ఓ యువకుడు మెట్రోలో ప్రయాణిస్తుండగా.. కొందరు మహిళలు అతనిని సీటు ఇవ్వమని అడిగారు. అతడు దానికి నిరాకరించాడు. పదేపదే వారు సీటు కోసం రిక్వెస్ట్ చేసినప్పటికీ ఆ వ్యక్తి సీటు ఇచ్చేందుకు అంగీకరించలేదు..దీంతో సదరు వ్యక్తిని రైలు కోచ్‌లోని మహిళలంతా కలిసి నిలదీశారు. మహిళలు అతనితో వాగ్వాదానికి దిగడంతో అతడు..

మెట్రోలో సీటు కోసం రచ్చ రచ్చ.. ప్రయాణికుడితో మహిళల వాగ్వాదం.. చివరకు..
Women Fight With Young Man

Updated on: Apr 02, 2025 | 2:14 PM

ఢిల్లీ మెట్రో ఎప్పుడు ఏదో ఒక వార్తతో సోషల్ మీడియాలో వైరల్ అవుతూనే ఉంటుంది. మెట్రోలో అసభ్యకర చేష్టలతో తోటివారికి విసుగు పుట్టించేవారు కొందరైతే, డ్యాన్స్ రీల్స్ తో వింత వింత స్టంట్లు చేసేవారు కూడా మరికొందరు ఉన్నారు. అలాగే, కొన్ని సందర్భాల్లో ప్రయాణికుల మధ్య ఘర్షణలకు సంబంధించిన వీడియోలు కూడా వైరల్‌ కావడం, ఢిల్లీ మెట్రో నిర్వహణపై చర్చకు దారితీశాయి. తాజాగా అలాంటి వీడియోనే మరొకటి ప్రస్తుతం వెలుగులోకి వచ్చింది. తాజాగా మరోసారి ఢిల్లీ మెట్రోకు సంబంధించిన వీడియో ఒకటి ఇంటర్‌నెట్‌లో చక్కర్లు కొడుతోంది. మెట్రోలో సీటు కోసం కొందరు మహిళలు ఓ యువకుడితో వాగ్వాదానికి దిగిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. వివరాల్లోకి వెళ్తే..

ఓ యువకుడు మెట్రోలో ప్రయాణిస్తుండగా.. కొందరు మహిళలు అతనిని సీటు ఇవ్వమని అడిగారు. అతడు దానికి నిరాకరించాడు. పదేపదే వారు సీటు కోసం రిక్వెస్ట్ చేసినప్పటికీ ఆ వ్యక్తి సీటు ఇచ్చేందుకు అంగీకరించలేదు..దీంతో సదరు వ్యక్తిని రైలు కోచ్‌లోని మహిళలంతా కలిసి నిలదీశారు. మహిళలు అతనితో వాగ్వాదానికి దిగడంతో అతడు వెటకారంగా మాట్లాడుతూ.. ఆ సీటును ఖాళీ చేశాడు. ఈ ఘటనను అక్కడే ఉన్న కొంతమంది వీడియో తీసి నెట్టింట పోస్ట్ చేశారు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం వైరల్‌ అవుతోంది.

ఇవి కూడా చదవండి

వీడియో ఇక్కడ చూడండి..

ఈ వీడియో ఆన్‌లైన్‌లో వెలుగులోకి రావడంతో చాలా మంది నెటిజన్లు దీనిపై స్పందించారు. ఇదంతా రీల్స్‌ లో భాగంగా చేశారా..? లేదంటే,నిజంగానే వారి మధ్య వాగ్వాదం జరిగిందా అనే సందేహం కూడా కొందరు వ్యక్తం చేశారు. ఇంకా అనేక మంది ప్రజలు ఈ వీడియోపై తమ అభిప్రాయాలను తెలియజేశారు.

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..