AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral Video: ‘ఆలస్యమైనా పర్లేదు బ్రో.. బతికి ఉండడం ముఖ్యం’.. వైరల్‌ అవుతోన్న యాక్సిడెంట్ వీడియో..

Viral Video: ట్రాఫిక్‌ రూల్స్‌ పాటిస్తే ప్రయాణం సాఫీగా సాగుతుందని అందరికీ తెలిసిందే. కానీ పాటించం.. త్వరగా గమ్యాన్ని చేరుకోవాలనే కోరిక ప్రమాదాలను కొని తెచ్చి పెడుతుంది. గమ్యాన్ని త్వరగా...

Viral Video: 'ఆలస్యమైనా పర్లేదు బ్రో.. బతికి ఉండడం ముఖ్యం'.. వైరల్‌ అవుతోన్న యాక్సిడెంట్ వీడియో..
Narender Vaitla
|

Updated on: Jul 09, 2022 | 12:01 PM

Share

Viral Video: ట్రాఫిక్‌ రూల్స్‌ పాటిస్తే ప్రయాణం సాఫీగా సాగుతుందని అందరికీ తెలిసిందే. కానీ పాటించం.. త్వరగా గమ్యాన్ని చేరుకోవాలనే కోరిక ప్రమాదాలను కొని తెచ్చి పెడుతుంది. గమ్యాన్ని త్వరగా చేరుకోవాలంటే, ముందు బయలుదేరాలనే విషయాన్ని గుర్తించకుండా ఆదరబాదరాగా వెళుతూ ప్రాణాల మీదికి తెచ్చుకుంటారు. ముఖ్యంగా రాంగ్‌ రూట్‌లో ప్రయాణించడం ఎంతో డేంజర్‌ అని తెలిసినా అడ్డదారిలో వెళ్తుంటారు. అయితే దీనివల్ల కలిగే నష్టం మాత్రం తీవ్ర విషాధాన్నే మిగుల్చుతుంది.

తాజాగా వైరల్‌ అవుతోన్న ఓ వీడియో ఇదే విషయాన్ని చెబుతుంది. రాంగ్‌ రూట్‌లో త్వరగా వెళ్లాలనుకున్న ఓ బైకర్‌ అత్యుత్సాహం తీవ్ర ప్రమాదానికి దారి తీసింది. వివరాల్లోకి వెళితే.. హైదరాబాద్‌లోని మైలర్‌ దేవ్‌ పల్లి, దుర్గానగర్‌లోని కూడలి వద్ద ఒక వ్యక్తి బైక్‌పై రాంగ్‌ రూట్‌లో వస్తున్నాడు. అదే సమయంలో అవతలి వైపు నుంచి కారు వేగంగా దూసుకొస్తోంది. ఎదురుగా ఎవరు వస్తారులే అనే నమ్మకంతో ఉన్న ఆ కారు డ్రైవర్‌కు ఊహించని సీన్‌ ఎదురైంది. ఎదురుగా వస్తున్న బైక్‌ను వేగంగా ఢీకొట్టాడు. దీంతో బైక్‌పై ఉన్న వ్యక్తి ఒక్కసారిగా గాల్లోకి ఎగిరి కింద పడ్డాడు.

ఇదంతా అక్కడే ఉన్న సీసీటీవీ కెమెరాలో రికార్డ్‌ అయింది. తాజాగా ఈ వీడియోను పోస్ట్‌ చేసిన సైబరాబాద్‌ ట్రాఫిక్‌ పోలీస్‌.. ‘సెంటిమీటర్‌ ప్రయాణం అయిన రాంగ్‌ రూట్లో వెళ్లకండి’ అనే క్యాప్షన్‌తో ట్వీట్ చేశారు. దీంతో ఈ వీడియోకాస్త వైరల్‌గా మారింది. అయితే సదరు వ్యక్తి ప్రాణాలతో బయటపడ్డాడా లేదా అన్న విషయం మాత్రం తెలియలేదు. ఏది ఏమైనా ఒక్క రెండు నిమిషాలు ఆలస్యమైనా యూటర్న్‌ తీసుకొని వచ్చి ఉంటే ఆ ప్రమాదం జరిగిఉండేది కాదన్నది మాత్రం సత్యం.

మరిన్ని ట్రెండింగ్ ఆర్టికల్స్ కోసం క్లిక్ చేయండి..

టాలీవుడ్‌తో పోటీగా సినిమాలు తీస్తున్న మరో ఇండస్ట్రీ? సక్సెస్ రేట్
టాలీవుడ్‌తో పోటీగా సినిమాలు తీస్తున్న మరో ఇండస్ట్రీ? సక్సెస్ రేట్
ప్రభుదేవా సినిమాలో నటిస్తున్న టాప్ మ్యూజిక్ డైరెక్టర్
ప్రభుదేవా సినిమాలో నటిస్తున్న టాప్ మ్యూజిక్ డైరెక్టర్
గత ఏడాది బిలియనీర్ల సంపద పెరుగుదల..చరిత్ర సృష్టించిందెవరో తెలుసా?
గత ఏడాది బిలియనీర్ల సంపద పెరుగుదల..చరిత్ర సృష్టించిందెవరో తెలుసా?
కాల్వలోకి పల్టీ కొట్టిన స్కూల్‌ బస్సు.. ఆ తర్వాత ఏం జరిగిందంటే?
కాల్వలోకి పల్టీ కొట్టిన స్కూల్‌ బస్సు.. ఆ తర్వాత ఏం జరిగిందంటే?
ప్రాణాలు తీసుకోవాలనే ఆలోచన వెనుక జెనెటిక్ మిస్టరీ దాగి ఉందా!
ప్రాణాలు తీసుకోవాలనే ఆలోచన వెనుక జెనెటిక్ మిస్టరీ దాగి ఉందా!
ఇంటర్ సిలబస్‌ మారుతుందోచ్‌.. ఇక మ్యాథ్స్‌ పరీక్ష 60 మార్కులకే!
ఇంటర్ సిలబస్‌ మారుతుందోచ్‌.. ఇక మ్యాథ్స్‌ పరీక్ష 60 మార్కులకే!
వింటర్ స్కిన్ కేర్ టిప్స్: ఈ 10 లాభాలు తెలిస్తే ఆ నూనె వదలరు!
వింటర్ స్కిన్ కేర్ టిప్స్: ఈ 10 లాభాలు తెలిస్తే ఆ నూనె వదలరు!
భర్తతో న్యూ ఇయర్ సెలబ్రేషన్స్.. సామ్ ఏం చేసిందో చూశారా? వీడియో
భర్తతో న్యూ ఇయర్ సెలబ్రేషన్స్.. సామ్ ఏం చేసిందో చూశారా? వీడియో
అన్నీ స్టేటస్‌లో పెట్టేస్తున్నారా! ఈ విషయం గురించి తెలుసా?
అన్నీ స్టేటస్‌లో పెట్టేస్తున్నారా! ఈ విషయం గురించి తెలుసా?
బెల్లం తింటున్నారా? అయితే ఈ షాకింగ్ విషయాలు తెలుసుకోవాల్సిందే!
బెల్లం తింటున్నారా? అయితే ఈ షాకింగ్ విషయాలు తెలుసుకోవాల్సిందే!