Viral: తలుపులేసిన ఇంట్లో నుంచి ఘాటైన వాసన.. ఏంటా అని బద్దలు కొట్టి చూడగా..

ఎవ్వరూ కూడా పైకి కనిపించేనంత అమాయకులు కారు. అమాయకంగా కనిపిస్తున్నారని.. నేరాలు చెయ్యరనుకోవద్దు..

Viral: తలుపులేసిన ఇంట్లో నుంచి ఘాటైన వాసన.. ఏంటా అని బద్దలు కొట్టి చూడగా..
Representative Image 2
Follow us
Ravi Kiran

|

Updated on: Jul 20, 2022 | 9:32 PM

ఎవ్వరూ కూడా పైకి కనిపించేనంత అమాయకులు కారు. అమాయకంగా కనిపిస్తున్నారని.. నేరాలు చెయ్యరనుకోవద్దు. అసలు నిజం బయటపడ్డాకే.. నిజస్వరూపం ఏంటన్నది తెలుస్తుంది. దీనికి నిదర్శనం నిలిచే ఓ ఘటన ఇటీవల ముంబైలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఆ స్టోరీ ఏంటంటే.?

వివరాల్లోకి వెళ్తే.. ముంబైలోని అంధేరీ ప్రాంతంలో రుబీనా, నసీమ్ ఖాన్ దంపతులు అద్దెకు నివాసముంటున్నారు. 2017లో వివాహమైన వీరిద్దరి మధ్య ఇటీవల తరచూ గొడవలు జరుగుతున్నాయి. అప్పుడప్పుడూ కుటుంబ సభ్యులు జోక్యం చేసుకుని వాటిని పరిష్కరిస్తూ వచ్చారు. సీన్ కట్ చేస్తే.. ఈ నెల 12న నసీమ్ ఇంటికి తాళం వేసి ఉండటం స్థానికులు గమనించారు. అదే రోజు రాత్రి నసీమ్‌ను చూసేందుకు వచ్చిన అతడి తల్లిదండ్రులు.. ఇంటికి తాళం వేసి ఉండటం చూసి వెనుదిరిగి వెళ్లిపోయారు.

అయితే ఆ తల్లిదండ్రులు కొడుకు ఆరోగ్యం గురించి దిగులు చెంది.. జూలై 14న అతడి ఫోన్‌కు కాల్‌ చేయగా.. స్విచాఫ్ వస్తుంది. అనంతరం కోడలికి ఫోన్ చేసి.. అడిగి తెలుసుకున్నారు. నెక్ట్స్ రోజు కోడలి ఫోన్ కూడా స్విచాఫ్ వస్తుంది. దీంతో అనుమానమొచ్చి కొడుకు ఇంటికి రాగా.. తాళం వేసి కనిపిస్తుంది. అప్పటికే స్థానికులకు కూడా రుబీనా ఇంటి నుంచి దుర్వాసన వస్తుండటం గమనిస్తారు. దీనితో ఆ ఇంటి తలుపులు బద్దలు కొట్టి.. లోపలికెళ్లి చూడగా.. వారికి బెడ్‌రూమ్ మంచం కింద నసీమ్ ఖాన్ మృతదేహం కుళ్లిన స్థితిలో కనిపించింది. దీనితో వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. స్పాట్‌కు చేరుకున్న పోలీసులు.. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

ఆర్ధిక సంస్కరణల ఆద్యుడు.. ప్రజలకు 'ఉపాధి' కల్పించిన నాయకుడు
ఆర్ధిక సంస్కరణల ఆద్యుడు.. ప్రజలకు 'ఉపాధి' కల్పించిన నాయకుడు
మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌కు ప్రముఖుల నివాళి
మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌కు ప్రముఖుల నివాళి
నవ భారత రూపశిల్పి ఇకలేరు..
నవ భారత రూపశిల్పి ఇకలేరు..
ఎవరో నా పేరు మర్చిపోతే ఫీల్ అవుతానా.? సీఎం రేవంత్ ఏమన్నారంటే
ఎవరో నా పేరు మర్చిపోతే ఫీల్ అవుతానా.? సీఎం రేవంత్ ఏమన్నారంటే
ఇండియన్ సినిమా క్యాపిటల్‌గా హైదరాబాద్.. సీఎంతో సినీ ప్రముఖుల భేటీ
ఇండియన్ సినిమా క్యాపిటల్‌గా హైదరాబాద్.. సీఎంతో సినీ ప్రముఖుల భేటీ
ఉదయాన్నే ఖాళీకడుపుతో జీలకర్ర వాటర్ తాగితే,శరీరంలో ఉహించనిమార్పులు
ఉదయాన్నే ఖాళీకడుపుతో జీలకర్ర వాటర్ తాగితే,శరీరంలో ఉహించనిమార్పులు
బీఎస్‌ఎన్‌ఎల్‌ గుడ్‌న్యూస్‌.. ఒక నెల పాటు ఉచిత ఇంటర్నెట్‌ సదుపాయం
బీఎస్‌ఎన్‌ఎల్‌ గుడ్‌న్యూస్‌.. ఒక నెల పాటు ఉచిత ఇంటర్నెట్‌ సదుపాయం
మద్యం మత్తులో నిద్రిస్తున్న భర్త.. అదే అదునుగా చూసిన భార్య..
మద్యం మత్తులో నిద్రిస్తున్న భర్త.. అదే అదునుగా చూసిన భార్య..
చేసిన సినిమాలన్ని ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్..
చేసిన సినిమాలన్ని ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్..
ఒకప్పుడు క్రేజీ హీరోయిన్.. ఇప్పుడు మోటివేషనల్ స్పీకర్..ఎవరంటే
ఒకప్పుడు క్రేజీ హీరోయిన్.. ఇప్పుడు మోటివేషనల్ స్పీకర్..ఎవరంటే