పెళ్లి వేడుకలకు సంబంధించిన అనేక ఫన్నీ వీడియోలు, ఆసక్తికరమైన వీడియోలు నిత్యం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంటాయి. తాజాగా ఓ ఖతర్నాక్ ట్రెండింగ్ వీడియోను మీ ముందుకు పట్టుకొచ్చాం. పెళ్లి మండపానికి గుర్రం, బైక్, లగ్జరీ కారు, ఆఖరికి స్పెషల్ చాపర్‌లో వచ్చినవారిని మనం ఇప్పటివరకూ చూసి ఉంటాం. ఇదంతా ఓల్డ్ ట్రెండ్ అండి బాబూ. తాజాగా ఒక క్రేజీ వరుడ్ని మీకు పరిచయం చేయబోతున్నాం. అవును ఇతగాడు మాస్ స్టైల్లో వివాహ వేదికకు చేరుకున్నాడు. ఒక ఫ్రెండ్ భుజంపై ఎక్కించుకుని వరుడ్ని తీసుకొస్తూ ఉండగా.. మిగిలిన దోస్తులు, గ్రామంలోని పిల్లలు తీన్మార్ స్టెప్పులతో దుమ్మురేపారు. ఇది చూసి కొందరు నవ్వుతుండగా, మరికొందరు మాత్రం నీ రూటే సెపరేట్ గురూ అంటూ ప్రశంసిస్తున్నారు. అయితే, ఆ వీడియో ఎప్పుడు, ఎక్కడ షూట్ చేశారు..? అనే వివరాలు మాత్రం తెలియరాలేదు.
ముందుగా వీడియో వీక్షించండి
వీడియోలో వరుడు తన స్నేహితుడి భుజంపై కూర్చుని వివాహ వేదిక వద్దకు వెళ్లడాన్ని మీరు చూడవచ్చు. అదే సమయంలో, ఆ గ్రామంలోని పిల్లలు ఉత్సాహంతో నృత్యం చేయడం కనిపిస్తుంది. ఈ వీడియోను సోషల్ మీడియాలో నెటిజన్లు బాగా లైక్ చేస్తున్నారు. షేర్లు చేయడమే కాదు.. తమ అభిప్రాయాలను కామెంట్లు రూపంలో తెలియజేస్తున్నారు. “ఇది లాక్‌డౌన్ వివాహం “అని ఒక యూజర్ కామెంట్ పెట్టాడు. ” అద్దెకు తెచ్చుకునే బండ్లలో వస్తే ఏముంది బ్రో.. దోస్తులతో ఇలా వస్తేనే మెమోరీస్ ఉంటాయ్” అని మరో నెటిజన్ కామెంట్ పెట్టాడు. ఈ ఫన్నీ వీడియో నిరంజన్ మోహపాత్రా అనే యూజర్ ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశాడు.
Also Read: ఇతగాడికి ఏ అవార్డు ఇద్దాం చెప్పండి..? ఎండ్రకాయతో బెండకాయ కట్ చేయించాడు