AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral: కూర వండేందుకు చేపను కోస్తున్న మహిళ.. దాని కడుపులో కనిపించింది చూసి అవాక్కు

కేరళలోని అలప్పుజ జిల్లాలోని చారుమ్మూడ్‌కి చెందిన సనోజ్‌ ఇంట్లో ఒక వింత సంఘటన జరిగింది. ఇంటికి సమీపంలోని పొలం వద్ద గల మడుగులో గాలం వేసి, దాదాపు 900 గ్రాముల బరువున్న ముర్రెల చేప (వరల్ ఫిష్)‌ను సనోజ్ పట్టుకొచ్చాడు. అదే సాయంత్రం సనోజ్ భార్య ఆ చేపను కూర కోసం కోస్తుండగా..

Viral: కూర వండేందుకు చేపను కోస్తున్న మహిళ.. దాని కడుపులో కనిపించింది చూసి అవాక్కు
Fish
Ram Naramaneni
|

Updated on: Aug 10, 2025 | 3:04 PM

Share

కేరళ అలప్పుజ జిల్లాలోని చారుమ్మూడ్‌కు చెందిన సనోజ్‌కి చిన్నప్పటి నుంచే చేపల వేటంటే ఇష్టం. పెద్దవాడై పెళ్లైనా సరే ఆ వేటే అతనికి కాలక్షేపం. వర్షాకాలంలో మడుగులు, వాగుల వద్దకు వెళ్లి చేపలు పట్టేవాడు. శనివారం కూడా సాయంత్రం పనులన్నీ ముగించుకుని, ఇంటి పక్కనే ఉన్న పొలం సమీపంలోని ఓ మడుగులో గాలం వేసాడు. ఎక్కువసేపు వేచి చూడకముందే గాలం కదిలింది. లాగేసరికి దాదాపు 900 గ్రాముల బరువున్న ముర్రెల చేప(varal fish) చిక్కింది. ఇది కూరకి సరిపోతుంది అనుకుంటూ ఆనందంగా ఇంటికి వచ్చాడు. సాయంత్రం వంటకి సిద్దమవుతున్న సనోజ్ భార్య.. ఆ చేపను శుభ్రం చేయడం మొదలుపెట్టింది. కత్తితో కోస్తుండగా.. కడుపులో ఏదో పాము మాదిరి చర్మం కనిపించింది. ఏంటోనని కడుపు చీల్చి చూస్తే… లోపల రెండు అడుగుల పొడవున్న నాగుపామును గుర్తించారు.

దాన్ని బయటకి తీసి జాగ్రత్తగా చూసేసరికి… పాము చర్మం ఇప్పటికే కుళ్లిపోతున్న స్థితిలో ఉంది. కానీ తల భాగం మాత్రం దాదాపు అలాగే ఉంది. తలపై ఉన్న ప్రత్యేకమైన చారలు చూసి.. అది నాగుపామేనని కుటుంబ సభ్యులు ఖచ్చితంగా గుర్తించారు. ఈ దృశ్యం చూసి అందరూ ఒక్కసారిగా షాక్ అయ్యారు. ఆ చేప తిన్నామంటే ఏమయ్యేదో అనుకుంటూ గబగబా చేతులు కడిగేశారు. సనోజ్.. చేపతో పాటు ఆ పామును కూడా ఒక గుంత తీసి పాతిపెట్టాడు. గ్రామంలో ఈ విషయం గురించి తెగ చర్చించుకున్నారు. చేప కడుపులో నాగుపామా అంటూ ఆశ్చర్యపోయారు. కొందరు జాలర్లు మాత్రం ముర్రెల చేపలు చిన్న పాములను తినేస్తాయని.. కాని ఈ సైజ్ నాగు పామును తినడం తొలిసారి చూస్తున్నామన్నారు.

మరిన్ని ట్రెండింగ్‌ వార్తల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి 

Follow Us
ప్లేట్ పట్టుకుని వెళ్తే అన్నం లేదు పో అన్నాడు.. ఇప్పుడు ఇలా..
ప్లేట్ పట్టుకుని వెళ్తే అన్నం లేదు పో అన్నాడు.. ఇప్పుడు ఇలా..
‏ 90's కుర్రాళ్లకు పిచ్చెక్కించిన సాంగ్.. ఇప్పటికీ యూట్యూ‏బ్‏లో..
‏ 90's కుర్రాళ్లకు పిచ్చెక్కించిన సాంగ్.. ఇప్పటికీ యూట్యూ‏బ్‏లో..
బీజేపీలో చేరే ముందు రజినీకాంత్ ఫోన్ చేసి బంపర్ ఆఫర్ ఇచ్చారు..
బీజేపీలో చేరే ముందు రజినీకాంత్ ఫోన్ చేసి బంపర్ ఆఫర్ ఇచ్చారు..
జింక పిల్లను పట్టిన ఆనందంలో మొసలి.. వెనక్కి తిరిగి చూస్తే..
జింక పిల్లను పట్టిన ఆనందంలో మొసలి.. వెనక్కి తిరిగి చూస్తే..
అల్లనేరేడు పండ్లు తినేటప్పుడు ఈ తప్పులు అస్సలు చేయొద్దు..
అల్లనేరేడు పండ్లు తినేటప్పుడు ఈ తప్పులు అస్సలు చేయొద్దు..
లక్ష్మీదేవి పూజలో పారిజాత పుష్పాల ప్రాముఖ్యత.. ఇంట్లో సిరుల పంట!
లక్ష్మీదేవి పూజలో పారిజాత పుష్పాల ప్రాముఖ్యత.. ఇంట్లో సిరుల పంట!
ఆసుపత్రిలో కలకలం.. గర్భిణి చనిపోయిన గంటల్లోనే 3 తులాల బంగారం మాయం
ఆసుపత్రిలో కలకలం.. గర్భిణి చనిపోయిన గంటల్లోనే 3 తులాల బంగారం మాయం
చైన్‌తో కట్టేసిన కుక్కకే దమ్కీ ఇద్దామనుకున్నాడు.. కట్‌చేస్తే..
చైన్‌తో కట్టేసిన కుక్కకే దమ్కీ ఇద్దామనుకున్నాడు.. కట్‌చేస్తే..
పుల్ల పుల్లగా కారంగా.. పిల్లలకు ఎంతో నచ్చే బొరుగుల గొట్టం మిక్చర్
పుల్ల పుల్లగా కారంగా.. పిల్లలకు ఎంతో నచ్చే బొరుగుల గొట్టం మిక్చర్
Optical Illusion: మీ డేగ కళ్లకు 30 సెకన్ల ఛాలెంజ్..
Optical Illusion: మీ డేగ కళ్లకు 30 సెకన్ల ఛాలెంజ్..