Viral Video: ఓరీ దేవుడో.. వరద నీటిలో కొట్టుకువచ్చిన వందలాది పాములు.. వణుకుతున్న జనం! ఇవిగో ఆ భయానక దృశ్యాలు

తుఫాను, భారీ వర్షాల మధ్య మీరు మీ ఇంట్లో సురక్షితంగా ఉన్నారని భావిస్తున్నప్పుడు, వరద నీటిలో వందలాది పాములు ఈదుతూ కనిపిస్తే ఎలా ఉంటుందో ఊహించుకోండి. సరిగ్గా ఇలాంటి దృశ్యాలే సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. వరద నీటిలో వందలాది పాములు వీధుల్లో, నివాస ప్రాంతాల్లో తేలుతూ కనిపిస్తుండటంతో స్థానిక ప్రజలు తీవ్ర భయాందోళనలకు గురవుతున్నారు. ప్రభుత్వం చుట్టుపక్కల గ్రామస్తులను ఇళ్లలోనే ఉండాలని హెచ్చరించింది. ఈ పాములను పట్టుకోవడానికి ప్రత్యేక రెస్క్యూ టీమ్‌లు రంగంలోకి దిగాయి. ఇంటర్నెట్‌లో దీనికి సంబంధించిన వీడియోలు వైరల్‌గా మారి ఒళ్లు గగుర్పొడిచేలా చేస్తున్నాయి.

Viral Video: ఓరీ దేవుడో.. వరద నీటిలో కొట్టుకువచ్చిన వందలాది పాములు.. వణుకుతున్న జనం! ఇవిగో ఆ భయానక దృశ్యాలు
900 Snakes Escape

Updated on: Jul 09, 2026 | 8:04 AM

భారీ వర్షాలు, తుఫానుల వల్ల వరదలు రావడం ఒక ఎత్తైతే.. ఆ వరద నీటిలో వందలాది పాములు కొట్టుకురావడం మరో ఎత్తు. ప్రస్తుతం చైనాలో ఇలాంటి ఒక వెన్నులో వణుకు పుట్టించే భయానక దృశ్యం ఎదురైంది. చైనాలోని గుయాంగ్షీ ప్రాంతంలో ప్రకృతి వైపరీత్యానికి తోడు ఈ విచిత్రమైన ఉపద్రవం వచ్చిపడటంతో అక్కడి ప్రజలు ప్రాణాలు గుప్పిట్లో పెట్టుకుని బతుకుతున్నారు.

ఫార్మ్ నుండి వరద నీటిలోకి 900 పాములు:

టైఫూన్ మైసాక్ ప్రభావంతో చైనాలోని పలు ప్రాంతాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. ఈ క్రమంలో డెంగ్‌వేయ్ అనే గ్రామంలో ఉన్న ఒక స్నేక్ బ్రీడింగ్ ఫార్మ్ పూర్తిగా జలమయమైంది. వరద ఉధృతికి ఆ ఫార్మ్ గోడలు దెబ్బతినడంతో, అందులో ఉన్న సుమారు 900 పాములు బయటకు వచ్చేసి వరద నీటిలో చేరిపోయాయి. వరద నీటి అలలపై వందలాది పాములు ఈదుకుంటూ వస్తున్న విజువల్స్ సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతున్నాయి. ఇది చూసిన నెటిజన్లు ఏదో హాలీవుడ్ హారర్ సినిమా చూస్తున్నట్లు ఉందంటూ కామెంట్లు పెడుతున్నారు.

ఇవి కూడా చదవండి

ఇళ్లకే పరిమితమైన ప్రజలు – రెడ్ అలర్ట్ జారీ:

వరద నీటిలో పాములు కొట్టుకురావడంతో అధికారులు ఆ చుట్టుపక్కల గ్రామస్తులందరినీ ఇళ్ల నుండి బయటకు రావద్దని, తలుపులు గట్టిగా వేసుకోవాలని హెచ్చరించారు. ప్రస్తుతం వరద నీరు ప్రమాదకర స్థాయిని దాటి ప్రవహిస్తుండటంతో ఆ ప్రాంతంలో రెడ్ అలర్ట్ ప్రకటించారు. ఇప్పటికే ఈ వరదల కారణంగా 17 మంది ప్రాణాలు కోల్పోగా, వేలాది మంది నిరాశ్రయులయ్యారు. పరిస్థితి తీవ్రతను గమనించిన చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్ సహాయక చర్యలను మరింత వేగవంతం చేయాలని ఆదేశించారు.

వీడియో ఇక్కడ చూడండి..

రంగంలోకి రెస్క్యూ టీమ్స్:

తప్పించుకున్న పాములను పట్టుకోవడానికి ప్రభుత్వం 10 మంది నిపుణులతో కూడిన ఒక ప్రత్యేక రెస్క్యూ టీమ్‌ను రంగంలోకి దించింది. వీరు ప్రత్యేకమైన ఫిషింగ్ నెట్లు, స్టన్ గన్‌ల సహాయంతో పాములను పట్టుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. అధికారుల సమాచారం ప్రకారం.. ఈ పాములలో చాలావరకు విషపూరితమైనవి కావు. అయినప్పటికీ, వరద నీటిలో కొట్టుకువస్తున్న పాములు కొరకడం వల్ల కొందరు గాయపడినట్లు నివేదికలు అందుతున్నాయి. వరద తీవ్రత, వైద్య సహాయం కొరత కారణంగా స్థానికుల్లో భయం మరింత పెరుగుతోంది.

మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం క్లిక్ చేయండి.

Follow Us