
ఢిల్లీ-డెహ్రాడూన్ ఎక్స్‌ప్రెస్‌వేపై ఏర్పాటు చేసిన సీసీటీవీ కెమెరాలలో, గత ఏడాది లక్నోలో జరిగిన పూల కుండీల దొంగతనం ఘటన మళ్లీ రికార్డ్ అయ్యింది. సుమారు 12,000 కోట్ల రూపాయల వ్యయంతో నిర్మించిన ఈ ఆర్థిక కారిడార్‌లో ఒక వ్యక్తి మొక్కలను దొంగిలిస్తూ కనిపించాడు. ఆసక్తికరంగా, అతను ప్రయాణిస్తున్న వాగన్-ఆర్ కారు వెనుక కిటికీపై పోలీసు స్టిక్కర్ ఉంది. అసలేం జరిగింది?
సాధారణంగా హైవేలపై రహదారి అందం, పర్యావరణ పరిరక్షణ కోసం ప్రభుత్వం డివైడర్లలో వివిధ రకాల మొక్కలను నాడుతుంది. సీసీటీవీ ఫుటేజ్ ప్రకారం, సెప్టెంబర్ 29 సాయంత్రం 5:14 గంటల సమయంలో ఒక తెల్లటి వ్యాగన్-ఆర్ కారు ఎక్స్‌ప్రెస్‌వే ఫ్లైఓవర్ సమీపంలో ఆగింది. ఆ కారు వెనుక అద్దంపై POLICE అని స్పష్టంగా రాసి ఉంది.
కారు దిగిన ఒక నల్లటి దుస్తులు ధరించిన వ్యక్తి, ఏమాత్రం తొందరపడకుండా ఎంతో ప్రశాంతంగా డివైడర్ పై ఉన్న మొక్కను వేళ్లతో సహా పికలించి తీశాడు. మొదట డిక్కీలో పెట్టడానికి ప్రయత్నించినప్పటికీ, కుదరకపోవడంతో కారు వెనుక సీట్లో ఉంచి ఏమీ ఎరుగనట్లు కారులో వెళ్లిపోయాడు.
ఈ సీసీటీవీ దృశ్యాలు సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో వైరల్‌గా మారాయి. పోలీసు స్టిక్కర్ ఉన్న కారులో వచ్చి ఇలా రోడ్డు పక్కన ఉన్న చిన్న మొక్కను కూడా దొంగిలించడం ఏంటని ప్రజలు తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు. గతంలో లక్నో, జైపూర్‌లలో ప్రధాని, ముఖ్యమంత్రి కార్యక్రమాల అనంతరం వేసిన పూల కుండీలను వాహనదారులు దొంగిలించిన సంఘటనలను ఇది గుర్తుచేస్తోందని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. మరికొందరు ఎక్స్‌ప్రెస్‌వే ఫాస్ట్ లేన్‌లో వాహనాన్ని ఆపడం వల్ల పెద్ద ప్రమాదం జరిగే అవకాశముందని ఆందోళన వ్యక్తం చేశారు.
बागपत: दिल्ली-दून एक्सप्रेसवे पर POLICE लिखी कार से पौधा चोरी, CCTV वीडियो वायरल। https://t.co/Xm68BeXxnX
— Arjun Chaudharyy (@Arjun5chaudhary) September 30, 2026
ఈ వీడియో నెట్టింట తీవ్ర చర్చనీయాంశంగా మారడంతో బాగ్‌పత్ పోలీసులు అధికారికంగా స్పందించారు. ఈ ఘటనపై ఇప్పటివరకు బరౌత్ పోలీస్ స్టేషన్‌లో ఎన్‌హెచ్‌ఏఐ (NHAI) లేదా ఇతర ఎవరి నుండి రాతపూర్వక ఫిర్యాదుగానీ, సమాచారం గానీ అందలేదని తెలిపారు. పూర్తి ఆధారాలు సేకరించి, దర్యాప్తు జరిపిన అనంతరం తగిన చట్టపరమైన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. ప్రజా ఆస్తులను రక్షించాల్సిన బాధ్యత ప్రతి పౌరుడిపై ఉంది. ఇలాంటి చిన్నపాటి చౌర్యాలు కూడా సమాజంలో పౌర బాధ్యతా రాహిత్యాన్ని వేత్తి చూపిస్తున్నాయి.
మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..