Watch Video: ఇంతటి భయానకమైన ప్రమాదాన్ని మీ జీవితంలో చూసి ఉండరు.. పల్టీలు కొట్టిన కారు చివరకు..

|

Jun 17, 2023 | 6:05 PM

రోడ్డు ప్రమాదాలకు సంబంధించి మనం నిత్యం ఎన్నో వార్తలు వింటుంటాం. కొన్ని ప్రమాదాల్లో ప్రజలు గాయాలపాలైతే.. మరికొన్ని ప్రమాదాల్లో ప్రాణాలే పోయిన సందర్భాలు ఉన్నాయి. ప్రమాదాల తీవ్రతను బట్టి గాయాలు, మరణాలు ఉంటాయి. అయితే, తాజాగా సోషల్ మీడియాలో ఓ షాకింగ్ వీడియో వైరల్ అవుతోంది.

Watch Video: ఇంతటి భయానకమైన ప్రమాదాన్ని మీ జీవితంలో చూసి ఉండరు.. పల్టీలు కొట్టిన కారు చివరకు..
Car Accident
Follow us on

రోడ్డు ప్రమాదాలకు సంబంధించి మనం నిత్యం ఎన్నో వార్తలు వింటుంటాం. కొన్ని ప్రమాదాల్లో ప్రజలు గాయాలపాలైతే.. మరికొన్ని ప్రమాదాల్లో ప్రాణాలే పోయిన సందర్భాలు ఉన్నాయి. ప్రమాదాల తీవ్రతను బట్టి గాయాలు, మరణాలు ఉంటాయి. అయితే, తాజాగా సోషల్ మీడియాలో ఓ షాకింగ్ వీడియో వైరల్ అవుతోంది. కొన్ని ప్రమాదాలు చూసేందుకు చాలా బీభత్సంగా ఉంటాయి. ఈ ప్రమాదం మాత్రం అంతకు మించి అన్నట్లుగా ఉంది. హాలీవుడ్ రేంజ్‌కు మించి.. రియల్ యాక్సిడెంట్ జరిగింది. ఈ ప్రమాదానికి సంబంధించిన విజువల్స్ ఇప్పుడు సోషల్ మీడియాను షేక్ చేస్తున్నాయి.

వైరల్ అవుతున్న ఈ వీడియోలో ఓ కారు బీభత్సమైన స్పీడ్‌తో దూసుకొచ్చింది. టోల్‌ప్లాజా ఉన్నప్పటికీ కారు వేగం ఏమాత్రం తగ్గలేదు. కారు వేగాన్ని గమనిస్తే దాదాపు 100 కు పైగానే ఉండే అవకాశం ఉంది. ఇంతటి వేగంతో దూసుకొచ్చిన కారు.. నేరుగా టోల్‌ప్లాజ్‌లో ఉన్న సిమెంట్ రెయిలింగ్‌ను ఢీకొట్టింది. దాంతో కారు అంతెత్తు ఎగిరిపడింది. ఆ వెంటనే గాల్లోనే కారు బ్లాస్ట్ అయ్యింది. ఈ ప్రమాద దృశ్యాలన్నీ టోల్‌ప్లాజాలోని సీసీ కెమెరాలో రికార్డ్ అయ్యాయి. ఆ వీడియోను సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్ ట్విట్టర్‌లో పోస్ట్ చేయగా.. అదికాస్తా వైరల్ అయ్యింది. ఇంత భయానకమైన ప్రమాదాన్ని తామింత వరకు చూడలేదని నెటిజన్లు కామెంట్స్ పెడుతున్నారు. కాగా, ఈ ఘోర ప్రమాదం చిలీ లోని పరాగ్వేలో చోటు చేసుకుంది.

ఇవి కూడా చదవండి

వైరల్ అవుతున్న యాక్సిడెంట వీడియో ఇదే..

మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..