AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

నెయిల్ పాలిష్‌తో క్యాన్సర్? అందులోని డేంజర్ కెమికల్స్ ఇవే!

మహిళల మేకప్ కిట్‌లో నెయిల్ పాలిష్‌ది ప్రత్యేక స్థానం. చేతి గోళ్లకు అందాన్ని ఇచ్చే ఈ నెయిల్ పాలిష్‌ల వల్ల క్యాన్సర్ వస్తుందంటూ సోషల్ మీడియాలో కథనాలు తెగ వైరల్ అవుతున్నాయి. అయితే సాధారణంగా నెయిల్ పాలిష్‌ను నేరుగా క్యాన్సర్ కారకంగా చెప్పలేమనీ, కాకపోతే అందులో వాడే కొన్ని రకాల ప్రమాదకర రసాయనాల వల్ల సుదీర్ఘకాలంలో ఆరోగ్య సమస్యలు తలెత్తే అవకాశం ఉందని వైద్య నిపుణులు స్పష్టం చేస్తున్నారు.

నెయిల్ పాలిష్‌తో క్యాన్సర్? అందులోని డేంజర్ కెమికల్స్ ఇవే!
Is Nail Polish Carcinogenic How To Choose The Right One
Sharada V
|

Updated on: Sep 15, 2026 | 3:58 PM

Share

మనం రోజూ వాడే సాధారణ నెయిల్ పాలిష్‌లోని కొన్ని రసాయనాలు దీర్ఘకాలంలో ఆరోగ్యానికి, ముఖ్యంగా క్యాన్సర్ ముప్పును పెంచుతాయని ఆంకాలజిస్టులు హెచ్చరిస్తున్నారు.  సోషల్ మీడియాలో వస్తున్న వార్తలపై గురుగ్రామ్‌లోని ఆర్టెమిస్ ఆసుపత్రికి చెందిన ప్రముఖ ఆంకాలజిస్ట్ డాక్టర్ వర్తిక విశ్వానీ క్లారిటీ ఇచ్చారు. “నెయిల్ పాలిష్‌లలో క్యాన్సర్ ముప్పును పెంచే రసాయనాలు ఉంటాయి. ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) ఫార్మాల్డిహైడ్‌ను  ‘గ్రూప్ 1 కార్సినోజెన్’ ( అంటే క్యాన్సర్‌కు కారణమయ్యే ప్రమాదకర రసాయనం)గా వర్గీకరించింది” అని డాక్టర్ వర్తిక హెచ్చరించారు.

సాధారణంగా తరచుగా పాలిష్ వేసుకునే వారి కంటె కాస్త గ్యాప్ ఇచ్చే వారికి  క్యాన్సర్ ముప్పు తక్కువని అన్నారు.  హానికారక రసాయనాలను  ప్రతి రోజూ  పీల్చే బ్యూటీ సెలూన్లలో పనిచేసే సిబ్బందికి ప్రమాదం ఎక్కువ. వారికి ముక్కు, గొంతు సంబంధిత (నాసో ఫారింజియల్) క్యాన్సర్ ముప్పు ఎక్కువని డాక్టర్ వర్తిక తెలిపారు. రోజుకు ఎంత సమయం, ఎన్ని రోజుల పాటు ఆ రసాయనాల బారిన పడుతున్నారనేది కూడా క్యాన్సర్ ప్రమాదాన్ని నిర్ణయిస్తుందనీ తెలిపారు. హానికరక రసాయనాలు లేని  నెయిల్ పాలిష్‌ సురక్షితమనీ ఏదైనా ఫంక్షన్‌కు, ట్రిప్‌కు వెళ్లేముందు, కొత్త కోట్ వేసుకునే ప్రతిసారీ భయపడాల్సిన అవసరం లేదనీ అంటున్నారు.

నెయిల్ పాలిష్‌ను వేగంగా ఆరబెట్టడానికి సెలూన్లలో ఉపయోగించే ‘యూవి (UV) ల్యాంప్‌’ వల్ల చర్మ క్యాన్సర్ వచ్చే అవకాశం ఎక్కువని 2023లో జరిగిన ఒక అధ్యయనం బయటపెట్టిన షాకింగ్ ఫలితాన్ని ఆమె గుర్తుచేసారు. ఆ ల్యాంప్‌ నుంచి వచ్చే యువి కిరణాలు కణాలలోని డిఎన్‌ఏ ను సైతం మార్చగలవు.  అయితే, ఆ అధ్యయన ఫలితాలు ల్యాబ్ పరీక్షల్లో మాత్రమే నిరూపితమైందని, మానవులపై దాని ప్రభావం ఎంత  ఉంటుందనే దానిపై ఇంకా పరిశోధనలు కొనసాగుతున్నట్లు ఆంకాలజిస్ట్ తెలిపారు.

నెయిల్ పాలిష్ వల్ల క్యాన్సర్ ముప్పు ఉందనే విషయం కంగారుపెట్టినా, చిన్నపాటి జాగ్రత్తలు పాటిస్తే తప్పించుకోవచ్చని డాక్టర్ వర్తిక విశ్వానీ తెలిపారు. ఫార్మాల్డిహైడ్ ను ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) ‘గ్రూప్ 1 కార్సినోజెన్’ (నేరుగా క్యాన్సర్‌కు కారణమయ్యే రసాయనం)గా వర్గీకరించింది. టొలుయీన్ (Toluene) నరాల వ్యవస్థపై తీవ్ర ప్రభావం చూపుతుంది. డిబిపి (DBP – Dibutyl Phthalate) హార్మోన్ల సమతుల్యతను దెబ్బతీస్తుంది.  ఫార్మాల్డిహైడ్ రెసిన్ ఇంకా కర్పూరం, చర్మ అలర్జీలు, శ్వాసకోశ సమస్యలకు కారణమవుతాయి.  కాంపౌండ్ టిపిఒ (TPO) గోళ్ల ఆరోగ్యానికి హాని చేస్తుంది. అందుకే నెయిల్ పాలిష్ కొనేటప్పుడు ఈ కెమికల్స్ లేని “5-free”, “10-free” లేదా “13-free” లేబుల్స్ ఉన్న ఉత్పత్తులను  ఎంచుకోవాలి.  గోళ్లు ఆరబెట్టడానికి యువి ల్యాంప్ (UV lamp) వాడుతుంటే, డిఎన్‌ఏ దెబ్బతినకుండా ఉండటానికి చర్మాన్ని కాపాడుకోవడానికి ముందుగా సన్‌స్క్రీన్ లోషన్ ను రాయాలని ఆమె సూచించారు. బ్యూటీ సెలూన్లకు వెళ్లినప్పుడు వారు ఎలాంటి నెయిల్ పాలిష్‌లను ఉపయోగిస్తున్నారో అడిగి తెలుసుకోవాలని చెప్పారు.

2026లో “నెయిల్ పాలిష్ అవసరం లేని” ట్రెండ్

 నెయిల్ పాలిష్‌ వేయించుకోవడం కన్నా  ‘నేకడ్’ (Naked) నెయిల్స్ ట్రెండ్ 2026లో  ప్రాచుర్యం పొందుతోంది. ఎటువంటి పాలిష్ లేకుండా, నీట్‌గా ట్రిమ్ చేసి, తేలిక పాటి షీర్-గ్లోస్ మెరుపుతో ఉండే సహజమైన గోళ్లే ఇప్పుడు ట్రెండీగా మారాయట. సెలబ్రిటీలు, ఫ్యాషన్ ఇన్‌ఫ్లుయెన్సర్లు గంటల తరబడి బ్యూటీ సెలూన్లలో గడపడం, వేల రూపాయలు ఖర్చు చేయడాన్ని పక్కన పెట్టి.. ఈ సింపుల్, నేచురల్ లుక్ కి,  తక్కువ మెయింటెనెన్స్ లుక్‌కే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారనీ డాక్టర్ వర్తిక తెలిపారు.

మరిన్ని ట్రెండింగ్ వార్తలు చూడండి

Follow Us