Viral Video: వారెవ్వా.. ఈ పెళ్లి కూతురి ఎంట్రీ వేరలెవల్.. వీడియో చూస్తే నోరెళ్లబెట్టాల్సిందే..

|

May 13, 2022 | 8:50 AM

పెళ్లి మండపం పైకీ వధూవరులు వస్తున్నప్పుడు సన్నిహితులు.. స్నేహితులు డ్యాన్సులతో స్వాగతం పలుకుతుంటారు. అంతేకాకుండా.. వధూవరులు ఇద్దరూ కలిసి డ్యాన్స్ చేస్తూ

Viral Video: వారెవ్వా.. ఈ పెళ్లి కూతురి ఎంట్రీ వేరలెవల్.. వీడియో చూస్తే నోరెళ్లబెట్టాల్సిందే..
Bride
Follow us on

పెళ్లి ప్రతి ఒక్కరి జీవితంలో ఓ ప్రత్యేకమైన రోజు.. తమ వివాహం కోసం ఎన్నో కలలు కంటుంటారు. ఇది వారి జీవితాలలోకి కొత్త అధ్యాయనం ప్రారంభమవుతుంది. పెళ్లంటేనే సందడి.. బంధుమిత్రులు.. కుటుంబసభ్యులు అంతా కలిసి సరదాగా గడిపేస్తుంటారు. ఇప్పుడు ట్రెండ్ మారింది.. పెళ్లి మండపం పైకీ వధూవరులు వస్తున్నప్పుడు సన్నిహితులు.. స్నేహితులు డ్యాన్సులతో స్వాగతం పలుకుతుంటారు. అంతేకాకుండా.. వధూవరులు ఇద్దరూ కలిసి డ్యాన్స్ చేస్తూ ఎంట్రీ ఇచ్చిన సందర్భాలు ఉన్నాయి. కానీ ఇక్కడ మాత్రం ఓ పెళ్లి కూతురు వేరలెవల్లో మండపం పైకీ ఎంట్రీ ఇచ్చింది.. పెళ్లి కూతురుగా అందంగా ముస్తాబైన వధువు.. కళ్లజోడు పెట్టుకుని..బాలీవుడ్ సూపర్ హిట్ సాంగ్‎కు స్టెప్పులేస్తూ వచ్చింది.. ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది..

అందులో ఓ వధువు… అందంగా ముస్తాబై..తన బంధువులతో కలిసి పూలన్ కి చాదర్ కింద నడుస్తూ వస్తుంది.. అంతేకాకుండా.. సన్ గ్లాసెస్ ధరించి. బాలీవుడ్ బ్యూటీ ప్రియాంక చోప్రా, సల్మాన్ ఖాన్ నటించిన సలామ్ ఇ ఇష్క్ పాటకు డ్యాన్స్ చేసింది. వధువు డ్యాన్స్ చేస్తుండగా.. పక్కనే ఉన్న అమ్మాయిలు సైతం డ్యాన్స్ చేయడం ప్రారంభించారు.. ఈ వీడియోను బ్రైడల్ లెహంగా డిజైన్ అనే ఇన్ స్టా ఖాతాలో షేర్ చేయగా.. నెట్టింట్లో వైరల్ అవుతుంది. ఈ వీడియో చూసిన నెటిజన్స్.. పలు రకాలుగా కామెంట్స్ చేస్తున్నారు.

మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Also Read: 9 Hours Web Series: డిస్నీ ఫ్లస్ హాట్‏స్టార్‏లో సస్పెన్స్ థ్రిల్లర్ సిరీస్.. 9 అవర్స్ స్ట్రీమింగ్ ఎప్పుడంటే..

Sarkaru Vaari Paata: సర్కారు వారి పాటతో మహేష్ బాబు ప్రభంజనం సృష్టించారు.. డైరెక్టర్ పరశురాం

Tina Sadhu: డ్యాన్స్ మాస్టర్ టీనా మృతి పై అనుమానాలు.. ఆమె చనిపోవడానికి అదే కారణమా?..