Viral Video: పిచ్చి పీక్ స్టేజ్ లో మెరిసే స్కిన్ కోసం ముఖానికి మలంతో ఫేస్ ఫ్యాక్.. మోడల్ వీడియో వైరల్..

|

Aug 14, 2024 | 11:47 AM

మెరిసే చర్మాన్ని పొందడానికి ఖరీదైన క్రీములు, ఫేషియల్స్, ఫేస్ ప్యాక్ లు మొదలైన వాటిని ముఖానికి రాసుకుంటారు. అయితే ఇదిగో ఓ మోడల్ ఖరీదైన క్రీములు, సహజసిద్ధమైన ఫేస్ ప్యాక్ లు వదిలేసి తన చర్మ సౌందర్యాన్ని పెంచుకోవడానికి మలాన్ని ముఖానికి పూసుకుంది. ఆమె దీని గురించి సోషల్ మీడియాలో ఒక వీడియోను పంచుకుంది. ఆమె విచిత్రమైన చర్మ సంరక్షణకు వైద్యులు షాక్ అయ్యారు.

Viral Video: పిచ్చి పీక్ స్టేజ్ లో మెరిసే స్కిన్ కోసం ముఖానికి మలంతో ఫేస్ ఫ్యాక్.. మోడల్ వీడియో వైరల్..
Poop Face Mask
Follow us on

అందంగా కనిపించాలని, చర్మం మెరుస్తూ ఉండాలని ప్రతి ఒక్కరికీ కోరిక ఉంటుంది. దీంతో చాలా మంది తమ ముఖ సౌందర్యాన్ని పెంపొందించుకోవడానికి, మెరిసే చర్మాన్ని పొందడానికి ఖరీదైన క్రీములు, ఫేషియల్స్, ఫేస్ ప్యాక్ లు మొదలైన వాటిని ముఖానికి రాసుకుంటారు. అయితే ఇదిగో ఓ మోడల్ ఖరీదైన క్రీములు, సహజసిద్ధమైన ఫేస్ ప్యాక్ లు వదిలేసి తన చర్మ సౌందర్యాన్ని పెంచుకోవడానికి మలాన్ని ముఖానికి పూసుకుంది. ఆమె దీని గురించి సోషల్ మీడియాలో ఒక వీడియోను పంచుకుంది. ఆమె విచిత్రమైన చర్మ సంరక్షణకు వైద్యులు షాక్ అయ్యారు.

బ్రెజిల్‌కు చెందిన డెబోరా పీక్సోటో (31) ప్రొఫెషనల్ మోడల్. అందంగా కనిపించడానికి, తన చర్మం గ్లో ని మెరుగుపరుచుకోవడానికి తన ముఖంపై మలాన్ని పూసుకుంటుంది. తాను ఇంటర్నెట్‌లో దీని గురించి ఒక కథనాన్ని చదివాను. మలాన్ని ముఖానికి అప్లై చేయడం వల్ల ముఖం అందంగా కనిపించడమే కాకుండా వృద్ధాప్య సంకేతాలు కూడా తగ్గుతాయని ఆమె పేర్కొంది. ఆమె తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో (deborapeixoto.ofc) దీని గురించి ఒక వీడియోను పంచుకుంది. వీడియోలో ఆమె తన ముఖానికి ఫేస్ ప్యాక్ లాగా మలాన్ని పూయడం కనిపిస్తుంది. ఆమె చేసిన ఈ వింత పనికి నెటిజన్లు సైతం విస్మయం వ్యక్తం చేస్తున్నారు.

ఇవి కూడా చదవండి

వైరల్ వీడియోను ఇక్కడ చూడండి:

దీని గురించి వైద్యులు ఏమి చెబుతారు:

వైరల్ అవుతున్న ఈ వీడియో గురించి లండన్‌లోని కాడోగన్ క్లినిక్ కన్సల్టెంట్ డెర్మటాలజిస్ట్ డాక్టర్ సోఫీ మోమెన్ మాట్లాడుతూ.. “ఇది అత్యంత చెత్త చర్మ సంరక్షణ పద్దతి అని చెప్పారు. ఇలా చేయడం వల్ల ముఖానికి ఎలాంటి ప్రయోజనం ఉండదు. బదులుగా అనేక రకాల బ్యాక్టీరియా, వైరస్లు ముఖంమీదకు చేరతాయని.. దీంతో తీవ్ర అనారోగ్యం బారిన పడాల్సి వస్తుందని హెచ్చరిస్తున్నారు.

 

మరిన్ని ట్రెండింగ్ వీడియో వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..