Viral Video: కాకే కదా అని కట్టేస్తే.. వందలాదిగా దండెత్తి చుక్కలు చూపించాయి.. వీడియో

ఎవరైనా ఏదైనా దక్కించుకోడానికి వెంటపడి వెంటపడి అదేపనిగా విసిగిస్తుంటే.. అబ్బా.. ఆపు నీ కాకిగోల అంటుంటారు.. కానీ ఆ కాకిగోల వెనక ఓ పట్టుదల ఉంటుంది. అంతేకాదు, కాకుల్లో.. మనుషులు నేర్చుకోవలసిన మంచి లక్షణాలు ఎన్నో ఉన్నాయి. కాకులు ఐకమత్యంగా ఉంటాయి. ఎన్నో విలువలు కలిగి ఉంటాయి. వాటి జీవనశైలి ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది.

Viral Video: కాకే కదా అని కట్టేస్తే.. వందలాదిగా దండెత్తి చుక్కలు చూపించాయి.. వీడియో
Viral Video
Follow us

|

Updated on: Jul 19, 2024 | 4:05 PM

ఎవరైనా ఏదైనా దక్కించుకోడానికి వెంటపడి వెంటపడి అదేపనిగా విసిగిస్తుంటే.. అబ్బా.. ఆపు నీ కాకిగోల అంటుంటారు.. కానీ ఆ కాకిగోల వెనక ఓ పట్టుదల ఉంటుంది. అంతేకాదు, కాకుల్లో.. మనుషులు నేర్చుకోవలసిన మంచి లక్షణాలు ఎన్నో ఉన్నాయి. కాకులు ఐకమత్యంగా ఉంటాయి. ఎన్నో విలువలు కలిగి ఉంటాయి. వాటి జీవనశైలి ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. ఎంతో శుభ్రతను పాటిస్తాయి. ఏదైనా ఓ కాకికి ఆపద వస్తే అన్ని కాకులు అక్కడికి చేరి గోల గోల చేస్తాయి. దానికి తాము అండగా ఉన్నామని భరోసా ఇస్తాయి. ఈ ఉపోద్ఘాతం అంతా ఎందుకు చెబుతున్నామంటే.. అంబేద్కర్‌ కోనసీమ జిల్లా రాజోలులో ఓ విచిత్ర సంఘటన జరిగింది. ఓ మాంసం దుకాణదారుడు విసిగిస్తుందని.. ఓ కాకిని కట్టేశాడు. అది తెలుసుకున్న మిగతా కాకులు వందలాదిగా అక్కడికి చేరి తమ నిరసన తెలిపాయి. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది.

అంబేద్కర్ కోనసీమ జిల్లాలోని తాటిపాక మార్కెట్లోని ఓ చికెన్ షాపు దగ్గర కాకి ఉదయం నుంచి ఆ షాపులో మాంసం వ్యర్ధాలను ఎత్తుకుపోడానికి ప్రయత్నించింది. ఈ క్రమంలో దుకాణదారుడిని చాలా విసిగించింది. ఎలాగైనా ఆ కాకిని పట్టుకోవాలనుకున్న అతను అదను చూసి దానిని పట్టేసుకున్నాడు. ఆ తర్వాత దానిని ఓ తాడుతో అక్కడ స్తంభానికి కట్టేశాడు. దీంతో అది విపరీతంగా అరుస్తూ కనిపించింది.

వీడియో చూడండి..

ఆ కాకి అరుపులకు.. మిగతా కాకులు అలర్ట్ అయ్యాయి.. దీంతో వాటి అరుపులకు వందలాది కాకులు చికెన్ షాపు పై దండెత్తి షాపు చుట్టూ తిరుగుతూ గోల చేస్తూ నిరసన తెలిపాయి. తమ తోటి కాకిని వదిలే వరకూ తగ్గేదే లేదంటూ ఎంత బెదిరించినా అవి వెనక్కిపోలేదు.

కావు కావు మని అరుపులతో మార్కెట్ ప్రాంతంలో గోల గోల చేశాయి. ఈ గోలను భరించలేని మిగిలిన దుకాణదారులు కట్టేసిన కాకిని వదిలేయాలని దుకాణదారుడిని కోరారు. దాంతో దుకాణదారు కాకిని వదిలిపెట్టేశాడు. దీంతో కాకులన్నీ కాసేపు అక్కడే ఉండి.. ఆ తర్వాత వెళ్లిపోయాయి.

దీంతో అక్కడున్నవారంతా కాకుల ఐక్యత ను చూసి ఆశ్చర్యపోయారు. ఇంతటి ఐక్యత మనుషులకు లేకపోయిందే అని ముక్కున వేలేసుకున్నారు.

మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్  చేయండి..

టీమిండియాకు తాకిన విడాకుల ట్రెండ్.. లిస్ట్ చూస్తే పరేషానే
టీమిండియాకు తాకిన విడాకుల ట్రెండ్.. లిస్ట్ చూస్తే పరేషానే
సరికొత్త రంగుల్లో ఆ రెండు స్కూటర్లు రిలీజ్ చేసిన సుజుకీ..!
సరికొత్త రంగుల్లో ఆ రెండు స్కూటర్లు రిలీజ్ చేసిన సుజుకీ..!
సర్వర్లు అంటే ఏమిటి? ఎలా పని చేస్తాయి? అవి డౌన్ అయినప్పుడు..
సర్వర్లు అంటే ఏమిటి? ఎలా పని చేస్తాయి? అవి డౌన్ అయినప్పుడు..
మళ్లీ పుంజుకుంటున్న పేటీఎం.. నష్టాల నుంచి లాభాల వైపు..
మళ్లీ పుంజుకుంటున్న పేటీఎం.. నష్టాల నుంచి లాభాల వైపు..
కార్ లోన్ కావాలా? అతి తక్కువ వడ్డీ రేటు అందించే బ్యాంకులు ఇవే..
కార్ లోన్ కావాలా? అతి తక్కువ వడ్డీ రేటు అందించే బ్యాంకులు ఇవే..
బజాజ్ సీఎన్‌జీ బైక్ డెలివరీలు షురూ.. ఆ విషయంలో ప్రత్యేక రికార్డు
బజాజ్ సీఎన్‌జీ బైక్ డెలివరీలు షురూ.. ఆ విషయంలో ప్రత్యేక రికార్డు
మొసలితోనే గేమ్సా..! పుచ్చ పగిలి పోవాల్సిందే.. ఒళ్లు గగుర్పొడిచే
మొసలితోనే గేమ్సా..! పుచ్చ పగిలి పోవాల్సిందే.. ఒళ్లు గగుర్పొడిచే
సంపంగి హీరోయిన్‏ను ఇప్పుడు చూస్తే షాకే..
సంపంగి హీరోయిన్‏ను ఇప్పుడు చూస్తే షాకే..
ఫ్రెషర్స్‌కి పండగలాంటి వార్త.. 20 వేల ఉద్యోగులకు ఛాన్స్
ఫ్రెషర్స్‌కి పండగలాంటి వార్త.. 20 వేల ఉద్యోగులకు ఛాన్స్
మాతో పెట్టుకుంటే మటాషే.. కాకే కదా అని కట్టేస్తే.. వీడియో
మాతో పెట్టుకుంటే మటాషే.. కాకే కదా అని కట్టేస్తే.. వీడియో