Shocking Video: ఫేమస్ కావాలని బైక్ స్టంట్..! బట్టలకు నిప్పు అంటించుకుని లాంగ్ జంప్.. చివరకు ఏమయ్యిందో మీరే చూడండి..

|

Jun 13, 2023 | 5:02 AM

Shocking Video: సోషల్ మీడియాలో ప్రతిరోజూ వేలాది సంఖ్యలో వీడియోలు వైరల్ అవుతుంటాయి. విన్యాసాలు చేయడానికి ఇష్టపడేవారు తాము చేస్తున్న భయానక విన్యాసాల వీడియోలను సోషల్ మీడియాలో షేర్ చేసి ఫేమస్ అయ్యే ప్రయత్నాలు ఉన్నారు. ప్రస్తుతం అటువంటి..

Shocking Video: ఫేమస్ కావాలని బైక్ స్టంట్..! బట్టలకు నిప్పు అంటించుకుని లాంగ్ జంప్.. చివరకు ఏమయ్యిందో మీరే చూడండి..
Horrible Bike Stunt
Follow us on

Shocking Video: సోషల్ మీడియాలో ప్రతిరోజూ వేలాది సంఖ్యలో వీడియోలు వైరల్ అవుతుంటాయి. విన్యాసాలు చేయడానికి ఇష్టపడేవారు తాము చేస్తున్న భయానక విన్యాసాల వీడియోలను సోషల్ మీడియాలో షేర్ చేసి ఫేమస్ అయ్యే ప్రయత్నాలు ఉన్నారు. ప్రస్తుతం అటువంటి ఘోరమైన స్టంట్‌కి సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ వీడియో చూసిన తర్వాత మీరు కూడా ఆశ్చర్యపోతారు అనడంలో అతిశయోక్తి లేనే లేదు. ఆ వీడియోలో ఓ బైకర్ స్టంట్స్‌కి సంబంధించిన వీడియో. కానీ సదరు బైకర్ తన స్టంట్ కోసం తన దుస్తులకు నిప్పు అంటించుకుని బైక్‌తో సహా గాల్లోకి వెళ్తాడు. అయితే లాంచ్ ప్యాడ్ నుంచి దూకుతున్నప్పుడు బ్యాలెన్స్ కోల్పోయిన అతను, బైక్‌తో సహా దూరంగా పడిపోయి నేలను తాకాడు.

ఇలా భయానకంగా సాగిన ఈ వీడియో ఎక్కడ జరిగిందనే వివరాలు తెలియరాలేదు కానీ ఈ వీడియో చూసి అందరూ షాక్ అవుతున్నారు. ఇంకా వీడియోను చూసిన నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు. ప్రాణాల మీదకు తెచ్చుకునే స్టంట్స్, ఫేమస్ అవసరమా అంటూ సరదు బైకర్‌పై మండిపడుతున్నారు. ఇంకా దయచేసి ఇలాంటి స్టంట్ చేయొద్దని రాసుకొస్తున్నారు. ఇక ట్విట్టర్ వేదికగా షేర్ అయిన ఈ వీడియోకు ఇప్పటివరకు 33 లక్షలకు పైగా మండి సోషల్ మీడియా యూజర్లు వీక్షించారు. మీరు కూడా ఈ వీడియోను ఇక్కడ చూడవచ్చు..

ఇవి కూడా చదవండి

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం..