AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

వీడెవడండీ బాబు..! ఆ సాకుతో నిశ్చితార్థం క్యాన్సిల్ చేసుకున్న అబ్బాయి.. తెలిస్తే మీరు షాక్!

బీహార్‌‌లో వరకట్న పిశాచి మరో నిండు జీవితాన్ని, ఒక కుటుంబం ఆశలను చిదిమేసింది. ముజఫర్‌పూర్‌లో ఈ హృదయవిదారక సంఘటన వెలుగులోకి వచ్చింది. నిశ్చితార్థం ముగిసి, పెళ్లి పనులు జరుగుతున్న తరుణంలో వరుడి తరపు వారు చేసిన వింత డిమాండ్లు, అసంబద్ధమైన సాకులు ఇప్పుడు చర్చనీయాంశంగా మారాయి.

వీడెవడండీ బాబు..! ఆ సాకుతో నిశ్చితార్థం క్యాన్సిల్ చేసుకున్న అబ్బాయి.. తెలిస్తే మీరు షాక్!
Marriage Cancellation
Balaraju Goud
|

Updated on: May 08, 2026 | 9:24 PM

Share

బీహార్‌‌లో వరకట్న పిశాచి మరో నిండు జీవితాన్ని, ఒక కుటుంబం ఆశలను చిదిమేసింది. ముజఫర్‌పూర్‌లో ఈ హృదయవిదారక సంఘటన వెలుగులోకి వచ్చింది. నిశ్చితార్థం ముగిసి, పెళ్లి పనులు జరుగుతున్న తరుణంలో వరుడి తరపు వారు చేసిన వింత డిమాండ్లు, అసంబద్ధమైన సాకులు ఇప్పుడు చర్చనీయాంశంగా మారాయి.

ముస్తఫాపూర్‌లోని మిథన్‌సరాయ్‌కు చెందిన ఒక యువతికి, వైశాలి జిల్లాకు చెందిన యువకుడితో వివాహం నిశ్చయమైంది. 2026 ఫిబ్రవరి 22న ఒక హోటల్‌లో వైభవంగా నిశ్చితార్థం (ఫల్దాన్) వేడుక జరిగింది. ఈ వేడుక కోసం బాధితురాలి కుటుంబం సుమారు రూ. 14.15 లక్షల వరకు ఖర్చు చేసింది. ఇందులో రూ. 4.37 లక్షల విలువైన బంగారు ఆభరణాలు, రూ. 1.51 లక్షల నగదుతో పాటు పెళ్లి ఖర్చుల కోసం అడ్వాన్స్‌గా ఇచ్చిన రూ. 5.51 లక్షలు కూడా ఉన్నాయి.

నిశ్చితార్థం సజావుగా ముగిసిన మరుసటి రోజే వరుడి కుటుంబం అసలు రంగు బయటపెట్టింది. అదనంగా వాగన్ఆర్ కారు కావాలని వరుడి తరపు వారు డిమాండ్ చేశారు. అంత స్తోమత లేదని అమ్మాయి కుటుంబం వేడుకున్నా వారు కనికరించలేదు. కారు ఇవ్వలేమని తేల్చి చెప్పడంతో, వరుడి సోదరి ఫోన్ చేసి అసంబద్ధమైన సాకులు చెప్పడం మొదలుపెట్టింది. అమ్మాయికి జుట్టు పల్చగా ఉందని, జుట్టు రాలిపోతోందని అందుకే ఈ పెళ్లి తమకు ఇష్టం లేదని వివాహాన్ని రద్దు చేసుకున్నారు.

నిశ్చితార్థానికి ముందు ఇరు కుటుంబాలు పలుమార్లు కలుసుకున్నాయని, అప్పుడు లేని జుట్టు సమస్య ఇప్పుడు ఎలా వచ్చిందని బాధితురాలి తరపు వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కేవలం కట్నం ఇవ్వలేదన్న కోపంతోనే, అమ్మాయిని అవమానిస్తూ ఇలాంటి నిరాధారమైన ఆరోపణలు చేస్తున్నారని పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ పరిణామంతో ఆ యువతి తీవ్ర మానసిక క్షోభకు గురైంది.

బాధితురాలి తల్లి ఫిర్యాదు మేరకు ముజఫర్‌పూర్ మహిళా పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది. వరుడితో సహా ఆరుగురిపై మోసం, వరకట్న వేధింపులు, దాడి వంటి తీవ్రమైన సెక్షన్ల కింద ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారు. నగర్ ఎస్పీ మొహిబుల్లా అన్సారీ స్పందిస్తూ.. ఈ కేసుపై సమగ్ర విచారణ జరుపుతున్నామని, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.

మరిన్ని క్రైమ్ వార్తల కోసం ఇక్కడ క్లి్క్ చేయండి..

Follow Us
టపటపా పేలిపోతున్న కార్ సన్‌రూఫ్ అద్దాలు.. కారణం ఇదే !
టపటపా పేలిపోతున్న కార్ సన్‌రూఫ్ అద్దాలు.. కారణం ఇదే !
భూమిలోకి కుంగిపోతున్న నగరాలు.. పెను ప్రమాదం తప్పదా
భూమిలోకి కుంగిపోతున్న నగరాలు.. పెను ప్రమాదం తప్పదా
ఈ నర్స్‌ చేసిన దారుణం తెలిస్తే.. మీరు రగిలిపోతారు
ఈ నర్స్‌ చేసిన దారుణం తెలిస్తే.. మీరు రగిలిపోతారు
లోకో పైలట్ మానవత్వం.. మూగజీవుల రక్షకులు అంటూ నెటిజెన్స్ కామెంట్స్
లోకో పైలట్ మానవత్వం.. మూగజీవుల రక్షకులు అంటూ నెటిజెన్స్ కామెంట్స్
రాక్షసానందం.. స్ట్రాను ఎంగిలి చేసి.. వెండింగ్‌ మెషీన్‌లో పెట్టి.
రాక్షసానందం.. స్ట్రాను ఎంగిలి చేసి.. వెండింగ్‌ మెషీన్‌లో పెట్టి.
ఎంతకు తెగించార్రా.. ఏటీఎంకు తాడుకట్టి బొలెరోతో లాక్కుపోయిన దొంగలు
ఎంతకు తెగించార్రా.. ఏటీఎంకు తాడుకట్టి బొలెరోతో లాక్కుపోయిన దొంగలు
‘సూపర్ ఎల్‌ నినో’ వచ్చేసింది..! వచ్చే రెండున్నరేళ్లూ కరువే
‘సూపర్ ఎల్‌ నినో’ వచ్చేసింది..! వచ్చే రెండున్నరేళ్లూ కరువే
అదిగదిగో లచ్చిందేవి.. డ్రైవర్‌కు కలిసొచ్చిన లక్.. రాత్రికి రాత్రే
అదిగదిగో లచ్చిందేవి.. డ్రైవర్‌కు కలిసొచ్చిన లక్.. రాత్రికి రాత్రే
మొసలికి పోస్టుమార్టం.. కడుపులో ఉన్నది చూసి షాక్‌!
మొసలికి పోస్టుమార్టం.. కడుపులో ఉన్నది చూసి షాక్‌!
ప్రాణాలను కాపాడిన.. రియల్‌ "హీరో'' ఈ ఎలుక !!
ప్రాణాలను కాపాడిన.. రియల్‌