గ్లోబల్ వార్మింగ్, పంపపొలాల్లో రసాయనాలు, పురుగు మందుల వినియోగం, మితిమీరిన పొల్యూషన్ కారణంగా తేనెటీగలు చనిపోతున్నాయి. ఈ క్రమంలో వాటి సంఖ్య రోజురోజుకూ తగ్గిపోతోంది. తేనెటీగల వల్ల లాభమేంటి? అని అడిగితే… తియ్యనైన తేనె లభిస్తుందని ఈజీగా చెప్పేస్తారు. కానీ… వరల్డ్ వైడ్ 70 శాతం వ్యవసాయం తేనెటీగల మీదే ఆధారపడి జరుగుతోంది. ఇది మేము కాదు సైంటిస్టులు చెబుతున్న మాట. మనం పండిస్తున్న 100 రకాల పంటల్లో 90 రకాల పంటల నుంచి ఫలాలు అందాలంటే తేనెటీగలే ఆధారం. పువ్వుల్లోని పుప్పొడి రేణువుల్ని తేనెటీగలు మోసుకెళ్లడం వల్లే పరాగ, పరపరాగ సంపర్కం జరిగి.. తద్వారా పువ్వుల నుంచి కాయలు, పండ్లు కాస్తాయి. అంతేకాదు… ఈ భూమ్మీద ఉన్న జీవరాశుల్లో ఒక్క తేనెటీగలు మాత్రమే రోగాలను వ్యాప్తి చేయవని ఓ పరిశోధనలో తేలింది. అందుకే ప్రపంచ దేశాలు వాటి సంఖ్యను పెంచేందుకు చాలా ప్రయత్నాలు చేస్తున్నాయి. ఈ క్రమంలో అమెరికాకు చెందిన ఓ యువతి చేస్తున్న పని నెటిజన్లను తెగ ఆకట్టుకుంటోంది. ఈమె తేనెటీగలను పెంచుతున్న తీరు చూసి నెటిజన్లు మెచ్చుకుంటున్నారు.
అమెరికా… టెక్సాస్‌కు చెందిన ఎరికా థాంప్సన్ తేనెటీగలను పెంచుతుంటారు. ఈ క్రమంలో ఆమె పెరట్లోని ఓ ఇంటి బ్యాక్‌యార్డ్ షెడ్ గోడలో కొన్నేళ్లుగా తేనెటీగలకు ఆవాసం కల్పిస్తున్నారు. ఎరికా తేనెను కూడా సేకరిస్తారు. అయినా కూడా.. తేనెటీగలు అక్కడి నుంచి వెళ్లవు. అక్కడున్న వేల తేనెటీగల్లో రాణి తేనెటీగను కనిపెట్టి దాన్ని మరో చోట ఉంచుతుంది. దీంతో మిగిలిన తేనెటీగలన్నీ ఆ రాణి తేనెటీగను ప్రొటెక్ట్ చేసేందుకు అక్కడికి వెళతాయి. అక్కడ తేనెతుట్టును తయారుచేస్తాయి. ఇలా ఆమె సేఫ్టీ మెజర్స్ పాటిస్తూ.. తేనెటీగలకు హాని కలిగించకుండా.. రాణి తేనెటీగ సాయంతో తేనెను సేకరిస్తుంది. ఐడీయా అదిరిపోయింది కదూ. ఈ విషయంలో ఎరికాకి చాలా అనుభవం ఉంది. ఇదేదో బాగుంది కదా అని… మీరు కూడా ఇలా ట్రై చేశారంటే.. ఐపోతారు జాగ్రత్త.
Also Read: నడి ఎడారిలో పాపడాల ఫ్రై.. నెట్టింట మిలియన్న కొద్దీ వ్యూస్, లైక్స్‌తో దూసుకుపోతున్న వీడియో