AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

తెలంగాణలో కిచెన్.. మహారాష్ట్రలో బెడ్‌రూమ్.. ఈ వింత ఇల్లు గురించి తెలిస్తే నోరెళ్లబెడతారు..

ఈ ఇంట్లో మాత్రం బెడ్‌రూమ్ నుండి కిచెన్‌కి వెళ్లాలంటే ఏకంగా రాష్ట్ర సరిహద్దు దాటాలి. వినడానికి జోక్‌లా ఉన్నా ఇది అక్షరాలా నిజం. మహారాష్ట్ర, తెలంగాణ సరిహద్దుల్లో ఉన్న ఒక వింత ఇల్లు ఇప్పుడు సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. ఒకే ఇల్లు.. ఒకే అడ్రస్.. కానీ హాల్ ఒక రాష్ట్రంలో ఉంటే, వంటగది మరో రాష్ట్రంలో ఉంది.

తెలంగాణలో కిచెన్.. మహారాష్ట్రలో బెడ్‌రూమ్.. ఈ వింత ఇల్లు గురించి తెలిస్తే నోరెళ్లబెడతారు..
Viral House Sits Right On Maharashtra Telangana Border
Krishna S
|

Updated on: Jul 07, 2026 | 11:49 AM

Share

మన దేశంలో ఎన్నో వింత ప్రదేశాలు, విచిత్రమైన సంఘటనలు తరచుగా సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ప్రజల దృష్టిని ఆకర్షిస్తుంటాయి. ఈ క్రమంలోనే మహారాష్ట్ర, తెలంగాణ రాష్ట్రాల సరిహద్దులో ఉన్న ఒక వింత ఇల్లు ప్రస్తుతం నెట్టింట హల్‌చల్ చేస్తోంది. ఒకే ఇంట్లో ఉంటూనే రెండు వేర్వేరు రాష్ట్రాల సరిహద్దులను పంచుకుంటున్న ఆ ఇంటి విశేషాలు చూసి నెటిజన్లు ఆశ్చర్యపోతున్నారు. మహారాష్ట్రలోని చంద్రాపూర్ జిల్లా జీవతి తాలూకా పరిధిలో ఉన్న మహారాజ్ కూట అనే గ్రామంలో ఈ విచిత్రమైన ఇల్లు ఉంది. మొత్తం 10 గదులున్న ఈ పెద్ద ఇల్లు, రెండు రాష్ట్రాల సరిహద్దులను కచ్చితంగా సగానికి పంచుకునే విధంగా నిర్మించబడింది. అంటే ఈ ఇంటిలోని ఒక భాగం లేదా కొన్ని గదులు మహారాష్ట్ర సరిహద్దుల్లోకి వస్తే.. మరో భాగం లేదా మిగిలిన గదులు తెలంగాణ రాష్ట్ర సరిహద్దుల్లోకి వస్తాయి.

ఒకే ఇల్లు.. ఒకే అడ్రస్.. కానీ రెండు రాష్ట్రాలు..

ఒకే ఇంట్లో, ఒకే చిరునామాలో నివసిస్తున్న ఒక కుటుంబం, తమ ఇంట్లోనే రెండు వేర్వేరు రాష్ట్రాల సరిహద్దులకు ఆవల నివసిస్తున్న విచిత్రమైన పరిస్థితిని ఎదుర్కొంటుంది. ఈ రెండు రాష్ట్రాల సరిహద్దుల వల్ల ఆ కుటుంబం ఎదుర్కొనే రోజువారీ అనుభవాలు చాలా హాస్యాస్పదంగా, విచిత్రంగా ఉంటాయి. ఉదయాన్నే నిద్రలేచి ఒక కప్పు టీ తాగడానికైనా, పడకగది నుండి వంటగదికి వెళ్లడానికైనా, వారు తమ ఇంట్లోనే ఒక రాష్ట్ర సరిహద్దును దాటవలసి ఉంటుంది.

బెడ్‌రూమ్ ఒకచోట.. కిచెన్ మరోచోట..

ఈ ఇంటి భౌగోళిక పరిస్థితి ఎంత వింతగా ఉంటుందంటే.. వారి బెడ్‌రూమ్ ఒక రాష్ట్ర సరిహద్దులో ఉండగా.. వారి కిచెన్ మరో రాష్ట్ర సరిహద్దులో ఉంది. దీనివల్ల వారు వంట చేసుకోవాలన్నా, నిద్రపోవాలన్నా, చివరికి కాసేపు విశ్రాంతి తీసుకోవాలన్నా కూడా ప్రతిసారీ మహారాష్ట్ర నుండి తెలంగాణకు, తిరిగి తెలంగాణ నుండి మహారాష్ట్రకు ప్రయాణించాల్సి వస్తుంది. ఒక గది నుండి మరో గదికి వెళ్తే చాలు.. వారు క్షణాల్లో రాష్ట్రం దాటేస్తారన్నమాట. ఈ అరుదైన, విశిష్టమైన భౌగోళిక ప్రదేశం స్థానికులను, అటుగా వెళ్లే బాటసారులను విశేషంగా ఆకట్టుకుంటోంది.

Follow Us