ప్రస్తుతం నెట్టింట త్రోబ్యాక్ ట్రెండ్ నడుస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే స్టార్ సెలబ్రెటీస్ చైల్డ్ హుడ్ ఫోటోస్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. ఇప్పుడు ఫర్ ఏ చేంజ్ అంటూ ఒరచూపుతో కవ్విస్తోన్న ఓ అందాల ముద్దుగుమ్మ పిక్ నెట్టింట చక్కర్లు కొడుతుంది. ఎవరో మీరు గుర్తుపట్టగలరా ?. ఈ అమ్మడు టాలీవుడ్ ఇండస్ట్రీలో టాప్ హీరోయిన్. అతి తక్కువ సమయంలోనే స్టార్స్ హీరోస్ సరసన నటించి మెప్పించింది. ఇప్పుడు చేతినిండా సినిమాలతో బిజీ షెడ్యూల్ గడిపేస్తుంది.
ఆ చిన్నది మరెవరో కాదు.. టాలీవుడ్ క్రేజీ హీరోయిన్ శ్రుతి హాసన్. అనగనగా ఓ ధీరుడు సినిమాతో సినీ పరిశ్రమలోకి అరంగేట్రం చేసింది. మొదటి సినిమాతోనే నటనపరంగా మంచి మార్కులు కొట్టేసింది. ఇటీవల క్రాక్ సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న ఈ అమ్మడు.. ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవి, బాబీ దర్శకత్వంలో రాబోతున్న మెగా 154లో.. నందమూరి నటసింహం బాలకృష్ణ, గోపిచంద్ మలినేని కాంబోలో రాబోతున్న ఎన్బీకే 107లో నటిస్తోంది. అంతేకాకుండా పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటిస్తున్న సలార్ సినిమాలో కనిపించనుంది. ప్రస్తుతం శ్రుతి హాసన్ లేటేస్ట్ ఫోటోస్ నెట్టింట్లో తెగ చక్కర్లు కొడుతున్నాయి.
మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.