Viral Video: ఈ యాక్సిడెంట్ వీడియో చూస్తే స్టన్ అవ్వాల్సిందే.. నెట్టింట హల్ చల్ చేస్తున్న దృశ్యాలు

|

Jul 23, 2022 | 11:32 AM

దేశంలో రోడ్డు ప్రమాదాల సంఖ్య భారీగా నమోదవుతుంది. యాక్సిడెంట్ (Accident) కేసుల్లో చనిపోతున్న వారి సంఖ్య కూడా గణనీయంగా పెరుగుతోందని పలు అధ్యయనాలు వెల్లడించాయి. చాలా మంది ప్రాణాలు పోగొట్టుకుంటుండగా.. అంత కంటే ఎక్కువ...

Viral Video: ఈ యాక్సిడెంట్ వీడియో చూస్తే స్టన్ అవ్వాల్సిందే.. నెట్టింట హల్ చల్ చేస్తున్న దృశ్యాలు
Car Accident Video Viral
Follow us on

దేశంలో రోడ్డు ప్రమాదాల సంఖ్య భారీగా నమోదవుతుంది. యాక్సిడెంట్ (Accident) కేసుల్లో చనిపోతున్న వారి సంఖ్య కూడా గణనీయంగా పెరుగుతోందని పలు అధ్యయనాలు వెల్లడించాయి. చాలా మంది ప్రాణాలు పోగొట్టుకుంటుండగా.. అంత కంటే ఎక్కువ సంఖ్యలో క్షతగాత్రుల సంఖ్య నమోదవుతోంది. కొన్ని సందర్భాల్లో ట్రాఫిక్ నిబంధనలు పాటించకపోవడం వల్లే ఇలాంటి ఘోర ప్రమాదాలు జరుగుతాయి. ప్రస్తుతం రోడ్డు ప్రమాదానికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో (Social Media) వైరల్ గా మారింది. ఇందులో వేగంగా వస్తున్న ఎస్‌యూవీ.. రోడ్డు పక్కన ఆగి ఉన్న రెండు కార్లను ఢీ కొట్టింది. ఈ వీడియో నిడివి కేవలం 10 సెకన్లు అయినప్పటికీ.. దీనిని చూసిన వారు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. ప్రమాదాలు ఆహ్వానింపబడని అతిథుల్లాంటివి. ఇది ఎప్పుడు, ఎలా, ఎవరికి జరుగుతుందో అస్సలు ఊహించలేం. అందుకే రోడ్డుపై నడిచేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి.

ఈ వైరల్ వీడియోలో రోడ్డుపై ట్రాఫిక్ స్తంభించింది. అదే సమయంలో వేగంగా వస్తున్న ఎస్‌యూవీ రోడ్డు పక్కన ఆగి ఉన్న రెండు కార్లను ఢీకొట్టింది. ఎంతగా అంటే ఆ రెండు కార్లు తీవ్రంగా ధ్వంసమయ్యే విధంగా. వీడియోలో కారును ఢీకొట్టినప్పుడు ఫుట్ పాత్ పై నడుస్తున్న కొంతమంది వ్యక్తులు కూడా కనిపిస్తారు. కారు చక్రాలు గాల్లో ఉన్నప్పుడు ఫుట్ పాత్ పై నడిచే వ్యక్తులు తమ ప్రాణాలను కాపాడుకోవడం కోసం చేసే ప్రయత్నాలు మనం చూడవచ్చు. ఈ ఘోర రోడ్డు ప్రమాదం వీడియోను యాక్సిడెంటలోజియా అనే ఖాతాతో ట్విట్టర్‌లో షేర్ చేశారు. ఈ వీడియోకు లైక్స్, వ్యూస్ భారీగా వస్తున్నాయి.

మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం క్లిక్ చేయండి..