ప్రస్తుతం గుండెపోటు బారిన పడుతోన్న వారి సంఖ్య భారీగా పెరిగిపోయింది. ఒకప్పుడు 60 ఏళ్లు దాటిన వారిలోనే ఎక్కువగా కనిపించిన ఈ సమస్య ప్రస్తుతం పట్టుమని పాతికేళ్లు కూడా నిండని వారిలో ఎక్కువుతోంది. మారిన జీవన విధానం, తీసుకుంటున్న ఆహారంలో మార్పుల కారణంగా హృదయ సంబంధిత సమస్యలు ఎక్కువుతున్నాయి.
తాజాగా ఓ యువకుడు గుండెపోటుకు గురైన సంఘటన తీవ్ర కలకలం రేపింది. అప్పటి వరకు ఎంతో హుషారుగా ఉన్న యువకుడు ఒక్కసారిగా గుండెపోటు కారణంగా కుప్పకూలిపోయాడు. ఇదంతా అక్కడే ఉన్న ఓ సీసీటీవీ కెమెరాలో రికార్డ్ అయ్యింది. దీంతో ప్రస్తుతం వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. వివరాల్లోకి వెళితే. హైదరాబాద్ కేపీహెచ్‌బీలోని హనుమాన్ ఆలయంలో ఓ యువకుడు దేవుడి దర్శనం కోసం వచ్చాడు.
అప్పటి వరకు ఎంతో హుషారుగా గుడి చుట్టూ ప్రదక్షిణలు చేశాడు. అయితే అంతలోనే ఒక్కసారిగా ఇబ్బందికి గురైన అతను అక్కడే ఉన్న పిల్లర్‌ను పట్టుకొని నిలబట్టాడు. అయితే క్షణాల్లోనే అందరు చూస్తుండగానే ఒక్కసారిగా కుప్పకూలి పోయాడు. దీంతో ఇది గమనించిన అక్కడున్న వారు వెంటనే ఆ యువకుడిని స్థానికంగా ఉన్న ఆసుపత్రికి తరలించారు. అయితే అప్పటికే అతను మరణించినట్లు వైద్యులు ధృవీకరించారు.
#Hyderabad—
హైదరాబాద్ KBHPలో విషాదం.. టెంపుల్ బస్ స్టాప్ సమీపంలోని ఆంజనేయస్వామి గుడిలో ప్రదక్షిణలు చేస్తుండగా గుండెపోటుతో యువకుడు మృతి చెందాడు. pic.twitter.com/54noZSAs1h— Newsmeter Telugu (@NewsmeterTelugu) November 12, 2024
కాగా ఇదంతా గుడిలో ఏర్పాటు చేసిన సీసీటీవీలో రికార్డు అయ్యింది. దీంతో ఈ వీడియో సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా ప్రస్తుతం ఆ వీడియో తెగ వైరల్ అవుతోంది. అంత హుషారుగా ఉన్న యువకుడు ఇలా కుప్పకూలిపోవడం దారుణమంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఇక సదరు యువకుడి పేరు విష్ణువర్ధన్‌గా తెలుస్తోంది. చేతికొచ్చిన కొడుకు ఇలా అద్యంతరంగా తనువు చాలించడంతో ఆయన పేరెంట్స్ గుండెలు పగిలేలా రోదించారు.
మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం క్లిక్ చేయండి..