Viral Video: ఈ చిలక క్రియేటివిటీ మాములుగా లేదుగా.. గూడు నిర్మాణం కోసం ఏం చేసిందో తెలిస్తే మీరూ ఇదే అంటారు..

|

Jun 26, 2022 | 5:15 PM

Viral Video: ఈ సృష్టిలో ప్రతీ జీవికి గూడు అనేది అత్యవసరమైంది. రోజంతా ఎక్కడ తిరిగినా రాత్రయ్యే సరికి ఇంటికి చేరుకుంటారు మనుషులు. అలాగే పక్షులు కూడా పగలంతా ఆహార వేటలో ఎంత బిజీగా గడిపినా రాత్రయ్యే సరికి గూటికి చేరుకుంటాయి...

Viral Video: ఈ చిలక క్రియేటివిటీ మాములుగా లేదుగా.. గూడు నిర్మాణం కోసం ఏం చేసిందో తెలిస్తే మీరూ ఇదే అంటారు..
Follow us on

Viral Video: ఈ సృష్టిలో ప్రతీ జీవికి గూడు అనేది అత్యవసరమైంది. రోజంతా ఎక్కడ తిరిగినా రాత్రయ్యే సరికి ఇంటికి చేరుకుంటారు మనుషులు. అలాగే పక్షులు కూడా పగలంతా ఆహార వేటలో ఎంత బిజీగా గడిపినా రాత్రయ్యే సరికి గూటికి చేరుకుంటాయి. మనుషులు ఎలా అయితే తమ ఇంటిని అందంగా తీర్చిదిద్దుకుంటారో, పక్షులు కూడా అలానే తమ గూడులను పకడ్బందీగా తయారు చేసుకుంటాయి. గూటి నిర్మాణం కోసం ఎండి పోయిన ఆకులు, పుల్లలను పోగేసుకుంటాయి. ఇది సర్వ సాధారణమైన విషయమే, మనందరికీ ఇది తెలిసిందే. అయితే ఓ చిలక మాత్రం తన గూటి నిర్మాణం కోసం తెలివిగా ఆలోచించింది. అందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్‌ అవుతోంది.

ఇంతకీ విషయమేంటంటే.. ఓ చిలక తన ఇంటి నిర్మాణం కోసం పుల్లలను పోగు చేసుకోవాలని ప్లాన్‌ వేసింది. ఇందుకోసం ఎండిన పుల్లలు కాకుండా ఏకంగా ఆకులోని పుల్లలను టార్గెట్‌ చేసింది. ఆకులో పై నుంచి కింది వరకు నెమ్మదిగా ఎలాంటి డ్యామేజ్‌ కాకుండా పుల్లను బయటకు తీసింది. అయితే తీసిన ఒక్కో పుల్లను గూటి నిర్మాణం వద్దకు తీసుకెళ్తే సమయం వృథా అవుతుందనుకుందో ఏమో. తీసిన పుల్లను తీసినట్లు వెనకాల తన తోకలోకి జొప్పించింది. దీనంతటినీ వీడియో తీసిన వారు సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేశారు.

ఇవి కూడా చదవండి

దీంతో ఈ వీడియో కాస్త నెట్టింట తెగ వైరల్‌ అవుతోంది. రుపిన్‌ శర్మ అనే ఐపీఎస్‌ తన ట్విట్టర్‌ ఖాతాలో పోస్ట్‌ చేసిన ఈ వీడియో చూసిన నెటిజన్లు ఆశ్చర్యపోతున్నారు. ‘ఫ్యాషన్‌ అండ్‌ క్రియేటివిటీ’ అనే క్యాప్షన్‌తో సదరు ఆఫీసర్‌ పోస్ట్‌ చేయగా.. ఓ నెటిజన్‌ స్పందిస్తూ.. ‘అది ఫ్యాషన్‌ కాదు.. ఇంటి నిర్మాణ నైపుణ్యం’ అంటూ కామెంట్ చేశారు. మరి ఈ వైరల్‌ వీడియోపై మీరూ ఓ లుక్కేయండి..

మరిన్ని వైరల్ వీడియోల కోసం క్లిక్ చేయండి..